ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Swiggy: ఒకే ఒక్కడు.. స్విగ్గీలో ఫుడ్ అంతా ఇతనే ఆర్డర్ చేశాడా ఏంటి? ఏడాదిలో ఇతను చేసిన ఆర్డర్ విలువ తెలిస్తే..

ABN, Publish Date - Dec 15 , 2023 | 04:16 PM

ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టడం నగరవాసులకు మామూలే.. కానీ ఇతని ఆర్డర్ విలువ తెలిస్తే..

టెక్నాలజీ ప్రజల జీవితాలలో చాలా మార్పులు తీసుకొచ్చింది. చిన్న వస్తువుల నుండి వేలాది రూపాయల వస్తువుల వరకు. ఇంటి సరుకుల నుండి వేడి వేడి ఆహారం వరకు అన్నీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తుంటారు. దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ విషయంలో స్విగ్గీ, జొమాటో ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది తమకు వచ్చిన ఆర్డర్స్ గురించి స్విగ్గీ గణాంకాలు వెల్లడించింది. భాగ్యనగరం బిర్యానీ ఆర్డర్ లో ముందుండగా ముంబై వాసి స్విగ్గీకి పెద్ద బోనాంజాగా మారాడు. ఈ ఏడాదిలో అతను స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ విలువ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.

ఏడాది ముగుస్తున్న కారణంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన స్విగ్గీ(Swiggy) "2023లో ఇండియా స్విగ్గి"డ్ ని విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన వంటకంగా బిర్యానీ మొదటి ప్లేస్ సంపాదించింది. ఇక ఇందులో మరొక దిమ్మతిరిగిపోయే విషయం ముంబై కస్టమర్ ఒకరు ఏడాది మొత్తంగా ఏకంగా రూ. 42.3లక్షల ఫుడ్ ఆర్డర్(42.3lakhs food order in Swiggy) చేశాడు. దీంతో మొత్తం స్విగ్గీలో ఆర్డర్ చేసిన కస్టమర్లలో ఇతనే మొదటి వరుసలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి: Relationship Advice: రాత్రి పడుకునే ముందు భర్తలు ఈ మూడు పనులు చేస్తే చాలు.. భార్యలు ఫుల్లు హ్యాపీ..!


చాలామందికి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేయడం వ్యసనంగా మారింది. టైం సేప్ అవుతుందనే కారణంతో బాగా అడిక్ట్ అయిపోయారు. ఆకలి అనిపించినప్పుడే కాదు.. పండుగలకు కూడా స్పెషల్ వంటకాలు ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తృప్తి పడుతున్నారు. కేకులు, గులాబ్ జామూన్, పిజ్జా వంటి వంటకాలు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్ అయ్యాయి. మరొక షాకింగ్ విషయం ఏంటంటే వాలెంటైన్స్ డే సందర్భంగా దేశం మొత్తం కలిసి నిమిషానికి 271కేకులను స్విగ్గీలో ఆర్డర్ చేసింది. 8.5మిలియన్ చాక్లెట్ కేకులను ఆర్డర్ చేసి బెంగుళూరు గార్డెన్ సిటీగానే కాకుండా కేక్ క్యాపిటల్ అనే ట్యాగును కూడా సొంతం చేసుకుంది. ఈ గణాంకాలు చూసిన నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 04:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising