ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: నా డబ్బును నాకు తిరిగి ఇచ్చేయండి.. రాష్ట్ర ప్రభుత్వంపైనే 90 ఏళ్ల ఓ వృద్ధురాలి న్యాయపోరాటం..!

ABN, First Publish Date - 2023-11-24T18:48:46+05:30

90 ఏళ్ల వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి పెన్షన్ డబ్బును తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ వృద్ధురాలికి 2020 నుంచి వృద్ధాప్య ఫించను వస్తోంది. అయితే ఆ విషయం ఆ మహిళకు తెలియలేదు. మూడేళ్ల తర్వాత వెళ్లిన ఆ వృద్ధురాలికి షాకింగ్ విషయం తెలిసింది.

90 ఏళ్ల వృద్ధురాలి (Old Woman) బ్యాంకు ఖాతా (Bank Account) నుంచి పెన్షన్ డబ్బును (Pension) తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu government) ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ వృద్ధురాలికి 2020 నుంచి వృద్ధాప్య ఫించను (Oldage Pension) వస్తోంది. అయితే ఆ విషయం ఆ మహిళకు తెలియలేదు. మూడేళ్ల తర్వాత వెళ్లిన ఆ వృద్ధురాలికి షాకింగ్ విషయం తెలిసింది. తన బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన రూ.36 వేలను ప్రభుత్వం విత్ డ్రా చేసుకున్నట్టు తేలింది. దీంతో తన డబ్బును తనకు వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆ వృద్ధురాలు ప్రభుత్వంతోనే పోరాటం చేస్తోంది (Viral).

తమిళనాడులోని తూత్తుకుడికి సమీపంలోని కామరాజ్ నగర్‌కు చెందిన తంగమ్మాళ్ తన ముగ్గురు కుమారులు, నివసిస్తోంది. ఆ ముగ్గురిలో ఇద్దరు మానసిక వికలాంగులు. తంగమ్మాళ్ భర్త 37 ఏళ్ల క్రితం చనిపోయాడు. వృద్ధాప్యం పింఛను పథకం కింద తంగమ్మాళ్‌కు మూడేళ్లుగా ఆర్థిక సహాయం అందుతోంది. అయితే పింఛను డబ్బులు తన పొదుపు ఖాతాలో జమ అవుతున్న విషయం తంగమ్మాళ్ల‌కు తెలియలేదు. తంగమ్మాళ్ తన పెన్షన్ డబ్బులు గురించి ఆరా తీయడానికి బ్యాంకుకు వెళ్లినప్పుడల్లా సిబ్బంది ఆమెతో దురుసుగా ప్రవర్తించి వెళ్లగొట్టేవారు. చివరకు ఆమె సామాజిక కార్యకర్త చంద్ర సహాయం తీసుకున్నారు.

Wife: టికెట్లు బుక్ చేసుకున్నాక.. బయటపడ్డ భర్త వివాహేతర సంబంధం.. ఆ భార్య చేసిన పనితో పేలుతున్న సెటైర్లు..!

తంగమ్మాళ్‌తో కలిసి చంద్ర ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. తంగమ్మాళ్ 2020 నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నట్లు తెలుసుకున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 29న ఎలాంటి సమాచారం లేకుండా తంగమ్మాళ్ ఖాతా నుంచి ప్రభుత్వం రూ.36,000 విత్‌డ్రా చేసింది. షాకైన తంగమ్మాళ్‌కు ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తన గుడిసె పాక్షికంగా కూలిపోయిందని, తన పింఛను మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చి ఇంటి నిర్మాణంలో తనకు సహాయం చేయాలని తంగమ్మాళ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

Updated Date - 2023-11-24T18:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising