Tattoo Woman: ఈ యువతిని గుర్తు పట్టారా..? ఒకే ఒక్క వీడియోతో తెగ వైరల్ అయిన ఈ యువతి తాజాగా పెద్ద బాంబే పేల్చిందిగా..!
ABN, First Publish Date - 2023-11-15T14:39:32+05:30
కాళ్లూ, చేతులూ కాదు.. ఏరికోరి మరీ నుదుటిపై పచ్చబొట్టు వేయించుకుంది. కానీ ఇప్పుడు పెద్ద ఝులక్కే ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా షాకింగ్ గా ఉంటాయి. ఓ యువతి ఇలాంటి షాకింగ్ పని చేసి సోషల్ మీడియాలో ఒక్కరోజులోనే తెగ వైరల్ అయ్యింది. యువతి తన నుదురు మీద తన బాయ్ ఫ్రెండ్ పేరును పెద్దగా పచ్చబొట్టు వేయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన అందరూ షాకయ్యారు. ఒక వేళ నీ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ కట్ అయితే ఆ తరువాత నీ పరిస్థితి ఏంటి? అని చాలామంది బాహాటంగానే ఆమెను హెచ్చరించారు. మరికొందరు ఆమె టాటూ గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ యువతి పెద్ద షాకింగ్ విషయం బయట పెట్టింది. ఇది విన్న తరువాత నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ తరువాత ఆమె చెప్పింది అర్థం చేసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా(Social media)లో వైరల్ కావడానికి ఒక్కోరు ఒక్కో విధమైన పద్దతి అవలంభిస్తారు. చాలా వరకు ఎవ్వరూ చేయని పనులు చేయడం, వింత చర్యలకు పాల్పడటం చేస్తుంటారు. అయితే కొందరు చేసే పనుల వెనుక ఓ మంచి కారణం కూడా ఉంటుంది. తాజాగా అనా స్టాన్స్‌కోవ్‌స్కీ అనే విదేశీ మహిళ తన నుదిటిమీద(forehead) తన బాయ్ ఫ్రెండ్ 'కెవిన్' అనే పేరును(boyfriend name tattoo) పెద్ద అక్షరాలతో పచ్చబొట్టు వేయించుకుని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అలా బాయ్ ఫ్రెండ్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని, బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయితే అప్పుడు పరిస్థితేంటని ఆమెను చాలా మంది ప్రశ్నించారు. అయితే తాజాగా ఆమె పెద్ద బాంబే పేల్చింది. తను నుదుటి మీద వేయించుకున్నది నిజమైన పచ్చబొట్టు కాదని(fake tattoo), దాన్ని తొలగించవచ్చని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Lady Finger vs Diabetes: చక్కెర వ్యాధికి, బెండకాయలకు అసలు లింకేంటి..? చాలా మందికి తెలియని నిజాలివీ..!
తన నకిలీ పచ్చబొట్టు గురించి చెబుతూ అనా స్టాన్స్‌కోవ్‌స్కీ కొన్ని వాస్తవాలు బయటపెట్టింది. పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు ఎంతో ప్రేమతో వేయించుకుంటూ ఉంటారని, బంధం తెగిపోతే ఆ పచ్చబొట్ల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనా స్టాన్స్‌కోవ్‌స్కీ పేర్కొంది. ఇలాంటి పచ్చబొట్లు ప్రజలను బాధపెడతాయని, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలనేదే తన ఉద్దేశ్యమని చెప్పుకొచ్చింది. 10ఏళ్ల కిందట తాను పచ్చబొట్లు వేయించుకుంటూ ఉంటే తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతగానో వారించారని ఆమె తన జీవిత అనుభవాన్ని కూడా నెటిజన్లతో పంచుకుంది. నెటిజన్లు మొదట ఆమె పచ్చబొట్టు ఫేక్ అనే విషయం విని అవాక్కయ్యారు. ఇంత నాటకం ఆడిందా అని విస్తుపోయారు. కానీ ఆమె సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఉద్దేశ్యంతో అలా చేసిందని అర్థం చేసుకుని ఆమెను మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Online Dating: ఎవరితో పడితే వారితో డేటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఓ యువతి పిలిచింది కదా అని వెళ్లిన యువకుడికి ఏమైందంటే..!
Updated Date - 2023-11-15T14:39:34+05:30 IST