ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Teacher Video: తరగతి గదిలో విద్యార్థులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న టీచర్.. గొడవ పడుతున్నారని పరుగెత్తుకుంటూ వస్తే..!

ABN, First Publish Date - 2023-11-09T12:42:02+05:30

తరగతి గదిలో విద్యార్థులు గొడవపడుతున్నారని కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిన టీచర్ కు విద్యార్థులు ఊహించని షాకిచ్చారు. వారు చేసిన పని చూస్తే..

పిల్లల జీవితంలో తల్లిదండ్రుల తరువాత ఉపాధ్యాయులే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఉత్తమ పౌరుల నిర్మాణానికి తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువ శ్రమ పడతారు. స్కూల్లో పిల్లలకు విద్యను మాత్రమే కాకుండా ఇతర విషయాల పట్ల అవగాహన, ప్రాపంచిక విషయాలను వివరించి చెప్పడం నుండి విస్తృతమైన జ్ఞానాన్ని అందించడం వరకు ఉపాధ్యాయులు కృషి చేస్తారు. కొందరు ఉపాధ్యాయులు తాము విద్యను బోధించే పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకుంటారు. తన తరగతి గదిలో విద్యార్థులు గొడవపడుతున్నారని కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిన టీచర్ కు విద్యార్థులు ఊహించని షాకిచ్చారు. వారు చేసిన పనికి ఆ టీచర్ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

గురుశిష్యుల అనుబంధం(Teacher, student bonding) చాలా ప్రత్యేకమైనది. ఎంతోమంది మంచి ఉద్యోగాలలో స్థిరపడుతున్నారన్నా, మంచి పేరు తెచ్చుకుంటున్నారన్నా అదంతా ఉపాధ్యాయులు కలిగించిన స్ఫూర్తి, వారు అందించిన జ్ఞానమే. అలాంటి ఉపాధ్యాయులకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. వీడియోలో తరగతిలో కొందరు పిల్లలు గుంపుగా చుట్టుకుని గొడవపడుతున్నట్టు కనిపిస్తారు. పిల్లలు గొడవ పడుతున్న విషయం ఆ తరగతి ఉపాధ్యాయురాలికి తెలిసి ఆమె కంగారుగా పరిగెడుతూ పిల్లల వద్దకు వస్తుంది. అనంతరం పిల్లలను గొడవ నుండి వేరు చేయాలని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గుంపుగా ఉన్న పిల్లలు కాస్తా చెల్లాచెదురు అవుతారు. అప్పుడే టీచర్ వెనకనుండి ఒకరు పేపర్ పార్టీ పాపర్ ను పగలగొడుతుంది. దాంతో రంగు రంగుల కాగితాలు గాలిలో ఎగురుతూ టీచర్ మీద పడతాయి. ఈ శబ్ధానికి టీచర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతులతో చెవులు మూసకుంటుంది. ఆ వెంటనే విద్యార్థులు అందరూ టీచర్ కోసం బర్త్ డే సాంగ్ పాడతారు. టీచర్ కు ఓ పూలబొకెను అందిస్తారు. ఆ రోజు తమ టీచర్ పుట్టినరోజు కావడంతో ఆమెను సర్ప్రైజ్ చేయాలని తరగతి పిల్లలందరూ అలా ప్లాన్ చేశారు(Kids surprise birthday wish to their teacher). ఆ పిల్లలు చేసిన పనికి ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఓదార్చుతూ ఒకవైపు, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ మరొకవైపు పిల్లలు ఆమెను ఆత్మీయంగా అలింగనం చేసుకుంటారు.

ఇది కూడా చదవండి: Shocking: కూతురు ఎవరినో ప్రేమిస్తోందని డౌట్.. అతడెవరో బయటపెట్టేందుకు దారుణమైన ఊహించని స్కెచ్.. కన్నతండ్రిని చంపి మరీ..!



ఈ వీడియోను Ashraf EI Zarka అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. టీచర్ ను సర్ప్రైజ్ చేయడానికి పిల్లలు గొడవపడుతున్నట్టు నటించారు' అని క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమకు విద్యను భోదించిన ఉపాధ్యాయులను గుర్తుచేసుకునేవారు కొందరైతే, ఆ విద్యార్థులకు, ఉపాధ్యాయురాలికి మధ్య ఉన్న అనుబంధాన్ని మెచ్చుకుంటున్నవారు మరికొందరు. 'ఈ వీడియో ఎంత బాగుందో' అని ఒకరు కామెంట్ చేశారు. ' ఆ టీచర్ కు ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇంకొకరు అన్నారు.'ఆ పిల్లలకు తమ టీచర్ పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది' అని మరొకరు అన్నారు.

ఇది కూడా చదవండి: Garlic: వంటింట్లో కనిపించే వెల్లుల్లి గురించి మీకు తెలియని 7 నిజాలు.. కూరల్లో వాడేది ఇందుకేనన్నమాట..!

Updated Date - 2023-11-09T12:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising