40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adipurush: ఈ ‘ఆదిపురుష్‌’ శూర్పణక గురించి ఆసక్తికర విషయాలు..!

ABN, First Publish Date - 2023-06-20T13:52:52+05:30

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘‘ఆదిపురుష్’’ సినిమాలో రావణాసురుడి చెల్లి శూర్పణక పాత్రలో నటించిన తేజస్విని పండిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నెటిజన్లు ఈ భామ గురించి తెగ ఆరా తీస్తున్నారు.

Adipurush: ఈ ‘ఆదిపురుష్‌’ శూర్పణక గురించి ఆసక్తికర విషయాలు..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘‘ఆదిపురుష్’’ సినిమాలో (Adipurush) రావణాసురుడి చెల్లి శూర్పణక పాత్రలో (Soorpanaka) నటించిన తేజస్విని పండిట్ (Tejaswini Pandit) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నెటిజన్లు ఈ భామ గురించి తెగ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ తేజస్విన్ పండిట్? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె సినిమా ప్రస్థానం ఎలా సాగింది? అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదకర ఘటనలేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

131595347_694657087910649_185077496448098603_n.jpg

ప్రభాస్, కృతిసనన్ సీతారాములుగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఒక వైపు సినిమాపై విమర్శలు, వివాదాలు నెలకొన్నప్పటికీ.. మరోవైపు మంచి కలెక్షన్లనే రాబడుతోంది. అయితే సినిమా చూసిన చాలా మంది రావణాసురుడి చెల్లిగా శూర్పణక పాత్రలో నటించిన తేజస్విని పండిట్ నటన, అందం అభినయానికి ముగ్దులైపోయారు.

రాక్షసి పాత్రలోనూ అందాల రాక్షసిగా తన ‘సొగసు చూడతరమా’ అనేంతలా ఆకట్టుకుంది. దీంతో చాలా మంది నెటిజన్లు తేజస్విని పండిట్ గురించి తెలసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. మరాఠి నటి అయిన తేజస్విని పండిట్‌ హీరోయిన్ మెటీరియలే అయినప్పటికీ సరైన అవకాశాలు దక్కలేదనే చెప్పుకోవాలి.

ఎప్పుడో 2004లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ సరైన స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. 2004లో వచ్చిన ‘అగా బాయి అరేచా’ అనే మరాఠి సినిమాతో తేజస్విని తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. అందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న కథానాయిక పాత్రలో నటించింది. అలాగే ‘రన్ బజార్’ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా నటించింది. ఆ తర్వాత కూడా పలు సిరీయల్స్, సినిమాల్లో నటించింది.

మరాఠిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. గ్లామరస్ పాత్రల్లోనూ ఆకట్టుకుంది. పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా దక్కాయి. అయితే తేజస్విని పండిట్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘‘ఆదిపురుష్’’ నే కావడం గమనార్హం.

తేజస్విన్ పండిట్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే తన చిన్ననాటి స్నేహితుడైనా భూషణ్ బోప్చేను 2012లో వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఆ తర్వాత కొంతకాలానికే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్విని పండిట్.. తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది.

అందులో ట్రెడిషనల్, వెస్ట్రన్ లుక్‌లో ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే తన సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన పోస్టర్లను కూడా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. కాగా తేజస్విన్ పండిట్‌కు సోషల్ మీడియాలో ఒక మిలియన్‌కు పైగానే ఫాలోవర్లు ఉండడం విశేషం.

Updated Date - 2023-06-20T13:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising