ten rupee note: రూ. 10 నోటుపై తొలుత ఎవరి ఫొటో ఉండేదంటే..
ABN, First Publish Date - 2023-03-19T09:24:07+05:30
ten rupee note: 1996లో తొలిసారిగా మహాత్మాగాంధీ(Mahatma Gandhi) బొమ్మ ఉన్న 10 నోటును ఆర్‌బీఐ ముద్రించింది. గాంధీజీ బొమ్మ ఉన్న తొలి భారతీయ కరెన్సీ ఇదేకావడం విశేషం. అయితే దీనికిముందు కూడా భారతదేశం(India)లో 10 రూపాయల నోట్లు ఉండేవి.

ten rupee note: 1996లో తొలిసారిగా మహాత్మాగాంధీ(Mahatma Gandhi) బొమ్మ ఉన్న 10 నోటును ఆర్‌బీఐ ముద్రించింది. గాంధీజీ బొమ్మ ఉన్న తొలి భారతీయ కరెన్సీ ఇదేకావడం విశేషం. అయితే దీనికిముందు కూడా భారతదేశం(India)లో 10 రూపాయల నోట్లు ఉండేవి. కానీ అవి బ్రిటిష్ కాలంనాటి కరెన్సీ నోట్లు. ఇప్పుడు మనం భారతదేశంలో నడుస్తున్న మొదటి 10 రూపాయల నోటు గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ పాలన(British rule)లోని రూ. 10 నోటుపై కింగ్ జార్జ్ VI చిత్రం ఉండేది.
ఈ నోటు వెనుక వైపు ఉర్దూ, హిందీ, బెంగాలీ, బర్మీస్, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ(Gujarati) భాషల్లో దాని విలువ ఉండటంతో పాటు, రెండు ఏనుగుల చిత్రాన్ని కూడా రూపొందించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank of India) 1966లో మొదటిసారిగా 10 నోటును విడుదల చేసింది. దానిపై మహాత్మా గాంధీ(Mahatma Gandhi) చిత్రాన్ని ముద్రించారు. ఈ నోటు పరిమాణం 137 మిమీ X 63 మిమీగా ఉంటుంది. ఈ నోట్‌లో మొదటిసారిగా కరెన్సీ(Currency)ని గుర్తించడంలో దృష్టి లోపం ఉన్నవారికి సహాయం చేయడానికి RBI బ్రెయిలీ ఫీచర్‌ను కూడా ఉపయోగించింది.
ఈ నోటు వెనుక భాగంలో ఒక ఖడ్గమృగం, ఒక ఏనుగు, ఒక పులి చిత్రాలు కూడా కనిపిస్తాయి. తరువాతి కాలంలో రూ.10 నోటులో చాలా మార్పులు(Changes) చేశారు. మహాత్మా గాంధీ కొత్త సిరీస్ నోట్లు 2016లో ముద్రించారు. ప్రస్తుతం మార్కెట్లో చలామణీలో ఉన్న నోటు 2018వ సంవత్సరంలో విడుదలైంది. ఈ నోట్‌పై ముందు భాగంలో గాంధీజీ చిత్రం, వెనుక వైపు కోణార్క్ సూర్య దేవాలయం(Konark Sun Temple) చిత్రం కనిపిస్తాయి. ఈ నోటు చాక్లెట్ బ్రౌన్(Chocolate brown) కలర్‌లో కనిపిస్తుంది.
Updated Date - 2023-03-19T09:39:28+05:30 IST