ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eilish Poe Ghost Story: యువతిని కాపాడిన ‘దెయ్యం’ కథ.. ప్రియుడు కత్తితో పొడిచి పారిపోతే..

ABN, First Publish Date - 2023-08-17T22:00:42+05:30

దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దెయ్యాలు నిజంగానే ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ..

దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దెయ్యాలు నిజంగానే ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ.. చాలామంది తాము దెయ్యాల్ని చూశామని వాదిస్తుంటారు. చూడ్డమే కాదండోయ్, ఆ దెయ్యాలతో మాట్లాడామని కూడా చెప్తుంటారు. కానీ.. మిగతా వాళ్లు మాత్రం వారి వాదనల్ని కొట్టిపారేస్తుంటారు. అసలు దెయ్యాలనేవే లేవని, అది కేవలం మన భ్రమ మాత్రమేనంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. ఈ డిబేట్ ఇలాగే కొనసాగుతుంటుంది కానీ, తాజాగా ఓ యువతి చెప్పిన ‘దెయ్యం’ కథ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


ఆ యువతి పేరు ఇలిష్‌ పో. టెక్సాస్‌ రాష్ట్రానికి చెందిన ఈ 25 ఏళ్ల యువతి కొలరాడోలోని ఒక స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. రీసెంట్‌గా ఒక షోలో పాల్గొన్న ఇలిష్.. 2020లో తన జీవితంలో జరిగిన ‘దెయ్యం’ కథని చెప్పింది. ఆ ఏడాదిలో తాను ఓ యువకుడితో ప్రేమలో ఉన్నానని.. అయితే తమ మధ్య విభేదాలు తలెత్తడంతో అతడు తనపై దాడి చేశాడని తెలిపింది. ఈ క్రమంలో ఒక కత్తి తీసుకొని.. తనని 16 సార్లు పొడిచాడని పేర్కొంది. తాను చనిపోయానని భావించి.. తన ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. కానీ.. తాను ఇంకా ప్రాణాలతోనే ఉన్నానని, ఆ సమయంలో తనకు మూడు దెయ్యాలు కనిపించాయని చెప్పింది. అందులో ఒక దెయ్యం తన అమ్మమ్మది కాగా, మరొకటి తన చిన్ననాటి స్నేహితుల్లో ఒకరైన విక్కీది అని వెల్లడించింది. ఆ రెండు దెయ్యాలు చావు బతుకుల్లో ఉన్న తనని చూస్తూ నవ్వాయని వివరించింది.

ఇక మూడో దెయ్యం తన స్నేహితురాలు అలీసా బర్కెట్ అని, ఆ దెయ్యమే తనని కాపాడిందని ఇలిష్ వెల్లడించింది. తనను ఫోన్ వద్దకు తీసుకెళ్లి, పోలీసులకు ఫోన్ చేసేలా అలీసా ప్రోత్సాహించిందంది. ఆ దెయ్యం సహకారంతో తాను పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పానని.. అప్పుడు పోలీసులొచ్చి తనని ఆసుపత్రికి తీసుకెళ్లారని పేర్కొంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ తనకు 50 నుంచి 100 రూపాలు అస్పష్టంగా కనిపించాయని చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. ఈరోజు తానిలా ప్రాణాలతో ఉన్నానంటే అందుకు అలీసా దెయ్యమే కారణమని, అందుకు తాను ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆ షోలో వివరించింది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ!

Updated Date - 2023-08-17T22:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising