ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Railways: ఆ రైల్వే ప్లాట్‌ఫారం అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.. మన పక్కరాష్ట్రం సాధించిన ఆ ఘనత గురించి మీకు ఇంతవరకూ తెలియదా?

ABN, First Publish Date - 2023-03-14T07:57:57+05:30

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌(Largest rail network)ను కలిగివుంది. ఇండియన్ రైల్వేస్ పేరిట ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నమోదవగా, ఇప్పుడు వాటికి జతగా సరికొత్త రికార్డు(new record) చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌(Largest rail network)ను కలిగివుంది. ఇండియన్ రైల్వేస్ పేరిట ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నమోదవగా, ఇప్పుడు వాటికి జతగా సరికొత్త రికార్డు(new record) చేరింది. కర్ణాటకలోని హుబ్లీలోగల శ్రీ సిద్ధారూఢ స్వామిజీ రైల్వే స్టేషన్‌(Sri Siddarudha Swamiji Railway Station)లో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. ఈ రైల్వే ప్లాట్‌ఫారమ్(Railway platform) పొడవు 1507 మీటర్లు. ఈ రైల్వే ప్లాట్‌ఫారమ్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌(Guinness Book of World Records)లో కూడా నమోదైంది. దీని నిర్మాణానికి మొత్తం 20 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది.

కర్ణాటకలోని శ్రీ సిద్ధారూఢ స్వామిజీ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫారమ్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్(Gorakhpur) జంక్షన్‌లో నిర్మించిన ప్లాట్‌ఫారమ్‌ను అధిగమించింది. ఇప్పటివరకూ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫారమ్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జంక్షన్‌లో ఉండేది. దీని పొడవు 1366.33 మీటర్లు. మూడవ నంబర్‌లో కేరళ(Kerala)లోని కొల్లం జంక్షన్‌(Kollam Junction)లో నిర్మించిన రైల్వే ప్లాట్‌ఫారమ్ ఉంది.

భారతీయ రైల్వే సాధించిన ఈ సరికొత్త ప్రపంచ రికార్డు గురించి తెలియజేస్తూ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్... ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జాతికి అంకితం చేస్తున్నారని ట్వీట్ చేశారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుబ్లీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనీష్ హెగ్డే మాట్లాడుతూ హుబ్లీ యార్డ్ పునర్నిర్మాణం(Reconstruction)లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారన్నారు.

హుబ్లీ స్టేషన్‌లో ఇంతకుముందు ఐదు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు ఉండగా, ఇక్కడ భారీ రద్దీని ఎదుర్కొనేందుకు దాని సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే దానికి మూడు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు జోడించారు. ఈ మూడింటిలో ప్లాట్‌ఫారమ్ నంబర్ 8 యొక్క పరిమాణం 1507 మీటర్లు. ఇది ప్రపంచం(world)లోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫారమ్‌గా పేరు పొందింది.

Updated Date - 2023-03-14T08:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising