ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Success Story: ఒకప్పుడు రోడ్ల పక్కన పుస్తకాలు అమ్మాడు.. ఇప్పుడు ఏకంగా రూ.20 వేల కోట్ల ఆస్తి..!

ABN, First Publish Date - 2023-11-28T16:17:35+05:30

అతను ఎన్నో కష్టాలు పడ్డాడు.. వీధుల్లో ఫుట్‌పాత్‌లపై పుస్తకాలు అమ్మాడు.. ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు.. ఇంకా ఎన్నో చిన్నా చితకా పనులు చేశాడు.. అయితే ఎదగాలనే ఆశను మాత్రం చంపుకోలేదు.. అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా రూ.20 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా మారాడు..

అతను ఎన్నో కష్టాలు పడ్డాడు.. వీధుల్లో ఫుట్‌పాత్‌లపై పుస్తకాలు అమ్మాడు.. ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు.. ఇంకా ఎన్నో చిన్నా చితకా పనులు చేశాడు.. అయితే ఎదగాలనే ఆశను మాత్రం చంపుకోలేదు.. అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా రూ.20 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా మారాడు.. దుబాయ్‌లోనే అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా నిలిచాడు (Richest Indian in Dubai).. ఆయన మరెవరో కాదు.. డానుబే గ్రూప్ (Danube Group) అధినేత రిజ్వాన్ సజన్ (Rizwan Sajan).

ముంబైకి (Mumbai) చెందిన రిజ్వాన్ 16 ఏళ్ల వయసులో ఉండగానే అతడి తండ్రి మరణించాడు. ముగ్గురు సంతానంలో పెద్దవాడైన రిజ్వాన్‌పైనే కుటంబ పోషణ భారం పడింది. దీంతో రిజ్వాన్ ఫుట్‌పాత్‌లపై పుస్తకాలు అమ్మాడు. ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు. ఆ సమయంలో రిజ్వాన్‌ను అతడి మేనమామ ఆదుకున్నాడు. 1981లో 18 ఏళ్లు నిండిన రిజ్వాన్‌కు కువైట్‌లో ఉద్యోగం ఇప్పించాడు. మొదట్లో సేల్స్ ట్రయినీగా పని చేశాడు. అప్పుడు రిజ్వాన్ జీతం నెలకు రూ.18 వేలు. ఆ తర్వాత సేల్స్ మేనేజర్‌గా ఎదిగాడు. జీవితం స్థిరపడుతోందనుకునే సమయంలో గల్ఫ్ యుద్ధం వచ్చింది. దీంతో మళ్లీ ముంబైకి వచ్చేశాడు. ఈసారి దుబాయ్‌ (Dubai)లో బిల్డింగ్ మెటీరియల్స్ బ్రోకరేజ్ వ్యాపారంలోకి దిగాడు (Success Story).

Firefox: ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను వాడుతున్న వాళ్లకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అలెర్ట్.. వెంటనే..!

ఆ తర్వాత 1993లో తనే స్వయంగా డానుబే సంస్థను ఏర్పాటు చేసి నిర్మాణ సామాగ్రి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అకుంఠిత దీక్షతో వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్లాడు. 2019 నాటికి డానుబే గ్రూప్ వార్షిక టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లకు చేరింది. దుబాయ్‌లో బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయం, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను డానుబే గ్రూప్ నిర్వహిస్తోంది. ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే తండ్రి తమ స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఎంతో ఇబ్బందులు పడేవారని ఓ ఇంటర్వ్యూలో రిజ్వాన్ తెలిపారు.

Updated Date - 2023-11-28T16:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising