Most Dangerous Tree: యాపిల్ పండ్లలా ఉన్నాయని తినడానికి ట్రై చేసేరు.. ఈ చెట్టును ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే..!
ABN, First Publish Date - 2023-08-29T11:55:09+05:30
ఈ చెట్ల పండ్లను తింటే.. నోట్లో మంట మొదలై.. గొంతు పట్టేస్తుంది. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడమే...
పెద్ద వర్షం పడుతుందనుకోండి, చేతిలో గొడుగు లేకపోతే ఏం చేస్తాం. ఏదైనా నీడ కిందకు వెళ్ళాలనుకుంటాం. ఏదీ కనిపించకపోతే చెట్టు నీడకైనా పోతాం. వర్షం తగ్గాకా అక్కడి నుంచి బయలుదేరతాం. కానీ ఈ చెట్టు కిందకి పొరపాటున వెళ్ళారనుకోండి. అంతే ఆ వర్షం బిందువులు చెట్ల కొమ్మల మీంచి మీ మీదకు పడితే చాలు మీ ప్రాణాలు పోవడం ఖాయం. ఇదేం భయపట్టేందుకు చెప్పడం లేదు. ఇది నిజంగా నిజం. చెట్లు మనిషికి ప్రాణాధారాలు. గాలి కాలుష్యాన్ని తగ్గించే కారకాలు. అలాంటి వృక్షాన్ని దేవతగా కొలుస్తాం. చెట్టు మన ప్రాణాలను నిలబెట్టడమే కాదు, జీవనాధారంగా, గృహాలంకరణలోనూ, ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషదంగా చాలా రకాలుగా ఉపయోగపడుతూ వస్తున్నాయి. చెట్లు చేసే మేలు చెప్పాలంటే దానికి కొన్ని మాటలు సరిపోవు. ఇక చెట్లగాలి, పండ్లు, ఫలాలు ఇలా చెట్టు ప్రతి భాగమూ మనకు ఉపయోగపడేదే. మరి అలాంటి చెట్టు తెలిసిన మీకు ఇప్పటి వరకూ తెలియని ఈ వింత చెట్టు గురించి చెప్పాలంటే..
ఆ చెట్టు నీడలోకి వెళ్ళినా, ఆ చెట్టును తాకినా, వాన చినుకులు ఆ చెట్టు మీదనుంచి పడినా, ఈ చెట్టు కాయలు తిన్నా కూడా ప్రాణాలకు ముప్పే.. అదేం చెట్టో చూద్దాం. మంచినీల్ చెట్టు (హిప్పోమేన్ మాన్సినెల్లా) అనేది స్పర్జ్ కుటుంబంలో (యుఫోర్బియాసి) పుష్పించే మొక్క. దీని స్థానిక పరిధి ఉష్ణమండల దక్షిణ ఉత్తర అమెరికా నుండి ఉత్తర దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉంది.
"మంచినీల్" అని, అలాగే మాన్సినెల్లా అనే పేరుతో పిలుస్తారు. స్పానిష్ మంజానిల్లా ("చిన్న ఆపిల్") నుండి వచ్చినవి, దాని పండు, ఆకుల, ఆపిల్ చెట్టును పోలి ఉంటాయి.. దీనిని బీచ్ యాపిల్ అని కూడా అంటారు. దీనిని లిటిల్ యాపిల్ ఆఫ్ డెత్" అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చెట్లలో మంచినీల్ ఒకటిచెట్టులో మిల్కీ వైట్ సాప్ ఉంటుంది, ఇందులో అనేక విషపదార్ధాలు ఉంటాయి. దీనిని తాకగానే చర్మం మీద పొక్కులు ఏర్పడతాయి. చెట్టు ప్రతి భాగంలో బెరడు, ఆకులు, పండ్లు అన్నీ విషపూరితమైనవే.
మన్షినిల్ చెట్టు విశేషాలు, దుష్పలితాలు ఎలా ఉంటాయంటే..
1. కరేబీయన్ సముద్ర తీరాల్లో కనిపించే ఈ మన్షినిల్ చెట్టు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు. ఇవి ప్రస్తుతం ఉత్తర-దక్షిణ అమెరికా, ఫ్లోరిడా, ది బహమాస్, మెక్సికోలలో కనిపిస్తుంటాయి.
3. 50 అడుగుల వరకు పెరగగలిగే ఈ చెట్లలో ప్రతీ భాగం విషపూరితమే. ఈ చెట్టును తాకితే చాలు ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లే. ఇక దీని పండ్లు చూడటానికి గ్రీన్ యాపిల్‌లా ఉంటాయి.. కానీ అవి తింటే మనుషులు చనిపోతారు.
ఇదికూడా చదవండి: పొరపాటున కూడా టీ తాగేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు.. వీటిని కలుపుకుని తింటే..!
4. ఈ చెట్ల పండ్లను తింటే.. నోట్లో మంట మొదలై.. గొంతు పట్టేస్తుంది. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడమే...
5. క్రిస్టోఫర్ కొలంబస్ అనే శాస్త్రవేత్త మంచినిల్ పండుకు ”ఆపిల్ అఫ్ ది డెత్” అని పేరు పెట్టారు. ఈ చెట్టు ఎంతటి విషపూరితమంటే.. పండు రసం కళ్లకు తగిలితే చాలు.. ఆ వ్యక్తి అంధుడు అయినట్లే. వర్షంలో కూడా ఈ చెట్టు కింద నిలబడటం మానవులకు హాని కలుగుతుంది.
6. కరేబియన్ వడ్రంగులు శతాబ్ద కాలం నుంచి ఈ చెట్టును ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. దానిని ఉపయోగించే ముందు.. విషాన్ని తొలగించేందుకు ఆ చెట్టు కలపను చాలా రోజులు ఎండలో ఎండబెట్టేవారట.
Updated Date - 2023-08-29T13:22:03+05:30 IST