ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..

ABN, First Publish Date - 2023-01-03T17:03:26+05:30

అతడు తన ముగ్గురు కూతుళ్లకూ వివాహాలు చేశాడు. కాగా, వారి అల్లుళ్లలో ఓ వ్యక్తి తరచూ ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. అల్లుడే కావడంతో ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాలేదు. ఇటీవల మామా, అల్లుళ్లు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతడు తన ముగ్గురు కూతుళ్లకూ వివాహాలు చేశాడు. కాగా, వారి అల్లుళ్లలో ఓ వ్యక్తి తరచూ ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. అల్లుడే కావడంతో ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాలేదు. ఇటీవల మామా, అల్లుళ్లు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో నిద్రలోకి జారుకున్న మామ.. కొన్ని గంటల తర్వాత లేచాడు. అయితే ఉన్నట్టుండి భార్య కనపడకపోవడంతో షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ..

నాకు ఈ పెళ్లి వద్దంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న యువకుడు.. అసలు నిజాలేంటో బయటపెట్టిన యువతి..!

రాజస్థాన్‌లోని (Rajasthan) సిరోహి జిల్లా అనదరా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. అందరికీ వివాహాలు (marriages) చేశాడు. కాగా, రమేష్ అల్లుడు నారాయణ.. తరచూ ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. అల్లుడే కావడంతో ఎవరికీ అనుమానం ఉండేది కాదు. దీన్నే అవకాశంగా తీసుకున్న నారాయణ్.. నిత్యం అత్తగారిటింకి వస్తూ, చివరికి అత్త పైనే కన్నేశాడు. ఆమెతో చనువుగా ఉండేవాడు. ఇది పద్ధతి కాదంటూ మందలించాల్సిన అత్త కూడా... అందుకు విరుద్ధంగా అల్లుడిపై ప్రేమ (love) పెంచుకుంది. భర్తకు తెలీకుండా ఇద్దరూ తరచూ కలుస్తుండేవారు.

Viral Video: పెళ్లి ఊరేగింపులో వధువుతో కలిసి రొమాంటిక్‌ స్టంట్ చేయాలని చూసిన వరుడు.. పాపం చివరికి..

ఈ క్రమంలో డిసెంబర్ 30న అత్తగారిటికి వెళ్లిన నారాయణ్.. మామతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. ఫుల్ తాగిన మామ రమేష్.. కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. అయితే కొన్ని గంటల తర్వాత లేచి చూస్తే.. అల్లుడితో పాటూ తన భార్య కూడా కనిపించలేదు. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు. అయినా ఫలితం లేకపోవడంతో జనవరి 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్తతో పాటూ వెళ్లిపోయిన నారాయణ.. తనతో పాటూ తన కూతురిని కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అత్త, అల్లుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో.. ఇంటికి వెళ్లి చూసేసరికి..

Updated Date - 2023-01-03T17:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising