ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China smartphones: చైనా ఫోన్లు అంత డేంజరా?.. యూజర్లు తెలుసుకోవాల్సిన అసలు విషయాలు ఇవే.. !

ABN, First Publish Date - 2023-03-15T22:39:06+05:30

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లలో ప్రీలోడెడ్(ప్రీ ఇన్‌స్టాల్డ్) యాప్స్‌ అన్‌ఇన్‌స్టాల్ అయ్యే ఆప్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. నిజంగా అలాంటి యాప్స్ డేంజరా?.. అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లలో ప్రీలోడెడ్(ప్రీ ఇన్‌స్టాల్డ్) యాప్స్‌ అన్‌ఇన్‌స్టాల్ అయ్యే ఆప్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. నిజంగా అలాంటి యాప్స్ డేంజరా?

రాజు హైఎండ్ ఫీచర్లున్న(Hi-end features) స్మార్ట్‌ఫోన్(Smart Phone) కొనాలనుకున్నాడు. కానీ, బ్రాండెడ్‌(Branded Smart Phones)లో వాటి ధరలు రూ.50 వేలు, ఆపైన ఉండడంతో.. చైనా మోడల్(China Model) కొన్నాడు. చైనా మొబైల్‌ ప్రకటిత ఫీచర్ల(Announced Features)ను చూస్తే.. హైఎండ్ మోడళ్లు దిగదుడుపే..! కానీ, నెల రోజులకే చవకరకం మొబైల్(Budget Phone, Economy Phone) సమస్యలేంటో రాజుకు తెలిసివచ్చింది. తన ప్రమేయం లేకుండానే యాప్స్ ఇన్‌స్టాల్(Install) అవ్వడం.. డేటా(Mobile Data) ఖర్చు ఎక్కువవ్వడం.. చార్జింగ్ త్వరగా అయిపోవడం వంటి సమస్యలను గుర్తించాడు.

మోహన్ కూడా చవకధర మొబైల్ కొన్నాక.. తంటాలు పడ్డాడు. స్క్రీన్‌ను అన్‌లాక్ చేయగానే.. పొలోమంటూ ప్రకటనల జోరు.. అతని ప్రమేయం లేకుండానే కొత్తకొత్త యాప్స్ ఇన్‌స్టాల్ అయిపోతుండడం.. వాటిని అన్‌ఇన్‌స్టాల్(Uninstall) చేయడం వీలుకాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నాడు.

ఒక్క రాజు.. మోహనేకాదు.. ఈ సమస్యలు చాలా మంది వినియోగదారులు ఎదుర్కొన్నవే.. ఎంతో మందికి ఇవి అనుభవంలోకి వచ్చినవే..! ఇందుకు ప్రధాన కారణం.. అన్‌బ్రాండెడ్(Unbranded) చైనా ఫోన్లే..! అంతర్జాతీయ ప్రమాణాల(International Standards)ను పాటించకపోవడం.. చవకబారు హార్డ్‌వేర్ వినియోగం.. యూజర్ల డేటాను తస్కరించే మాల్‌వేర్ ఉండడమే..! ఈ పరిస్థితులను గమనించే కేంద్ర ఐటీ శాఖ ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.

ఎలాంటి యాప్స్?

చైనా కంపెనీలు తయారు చేసే స్మార్ట్‌ఫోన్లలో.. భారత ప్రభుత్వం నిషేధించిన యాప్స్ కూడా ప్రీఇన్‌స్టాల్ కేటగిరీలో ఉంటున్నాయి. టిక్‌టాక్‌(TikTok)తోపాటు.. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా 500 దాకా చైనా యాప్స్‌(China Apps)పై కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. ఆయా యాప్స్ భారత్‌లో పనిచేయకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు(ISPలు), భారత టెలికాం నియంత్రణ సంస్థ(TRAI) చర్యలు తీసుకుంటున్నా.. ప్రీలోడెడ్ యాప్స్ ఆ లక్ష్యాలకు విఘాతాన్ని కలిగిస్తున్నాయి. పైగా.. ఈ యాప్స్‌ రీడ్ ఓన్లీ మెమొరీ(ROM)లో ఉండడం వల్ల అన్‌ఇన్‌స్టాల్‌కు వీలుండదు. ఒకవేళ ఎవరైనా ఫ్లాష్(Device Format) చేసినా.. ఈ యాప్స్ యథావిధిగా కొనసాగుతాయి.

అవి మరీ ప్రమాదకరం?

సెల్‌ఫోన్లలో ఏదైనా మాల్‌వేర్ చొరబడితే.. యాంటీవైరస్‌(Anti-Virus)లు, గూగుల్ ప్లే ప్రొటెక్షన్(Google Play Protection) వెంటనే గుర్తిస్తాయి. కానీ, చైనా ఫోన్ల ద్వారా వ్యాప్తి చెందుతున్న మాల్‌వేర్లు ROMలో ఉండడం వల్ల.. వాటి గుర్తింపు సాధ్యపడడం లేదు. ఒకవేళ గూగుల్ ప్లే ప్రొటెక్షన్ దాన్ని గుర్తించినా.. మాల్‌వేర్ పనితీరును అడ్డుకునే సామర్థ్యం ఉండదు. పైగా.. కొన్ని మాల్‌వేర్లు(Malwares) వాటంతట అవే యాంటీవైరస్, గూగుల్ ప్లే ప్రొటెక్షన్‌ను డిజేబుల్ చేస్తుంటాయి. మాల్‌వేర్(Malware) ఉన్న ఫోన్లను ఉత్పత్తి సంస్థ సులభంగా యాక్సెస్ చేయగలుగుతుంది. హ్యాకర్లు(Hackers) తమ నియంత్రణలోకి తీసుకునే వీలుంటుంది. చాలా వరకు చైనా తయారీ ఫోన్లలో ఈ తరహా మాల్‌వేర్లు ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భారత సైనికులు వాటిని వాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. మాల్‌వేర్ ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని స్పష్టం చేసింది.

యాడ్‌వేర్‌తో తంటాలు..

మన డబ్బులు పెట్టి మనం కొనే ఫోన్లలో తరచూ యాడ్స్ వస్తే ఎలా అనిపిస్తుంది. చాలా వరకు చైనా ఫోన్లలో ఈ తరహా యాడ్‌వేర్లు(Adware) ఉండడంతో వినియోగదారులు విసుగుచెందుతున్నారు. ఈ యాడ్‌వేర్లు మన అభిరుచులకు అనుగుణమైన యాడ్స్‌ వచ్చేలా ప్రోగ్రామింగ్ కలిగి ఉంటాయి. ఉదాహరణకు మీరు గూగుల్‌లో బెస్ట్ ఎయిర్ కండిషనర్ అనో.. బడ్జెట్ ఎయిర్ కండిషనర్ అనో సెర్చ్ చేస్తే.. యాడ్‌వేర్ ఆ కీవర్డ్స్‌ ఆధారంగా యాడ్స్‌ వచ్చేలా చేస్తుంది. మీరు చాటింగ్‌లోనో.. సందేశాల్లోనో ‘ఫ్రెండ్‌షిప్’, ‘లవ్’, ‘డేట్’ అనే పదాలను వాడితే.. ఈ యాడ్‌వేర్లు మీకు డేటింగ్ సైట్లు, ఫ్రెండ్‌షిప్ సైట్లు, బూతు సైట్ల యాడ్స్‌ వచ్చేలా చేస్తాయి. ఇవి యూజర్లకు పరమ చిరాకు కలిగిస్తాయి. యూజర్లు తమ ఫోన్ల స్క్రీన్ లాక్ చేసి.. తిరిగి అన్‌లాక్ చేయగానే.. ఈ తరహా యాడ్స్ ప్రత్యక్షమవుతాయి.

మాల్‌వేర్‌తో డేటా ఖతం..!

మీరు చైనా ఫోన్లు వాడుతుంటే.. మీ డేటా వేగంగా తరగిపోవడాన్ని గమనించే ఉంటారు. చైనా ఫోన్లలో ఉండే ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లు, మాల్‌వేర్ల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్(Background Process) వల్ల డేటా వినియోగం పెరుగుతుంది. అంతేకాదు.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ వల్ల ఫోన్ తరచూ వేడెక్కుతుంది. దాంతో ఎక్కువ మొత్తంలో రేడియేషన్ విడుదలవుతుంది. ఇది మొబైల్ యూజర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చీటింగ్ అప్‌డేట్స్..

కొన్ని యాప్‌లు ‘మిస్టర్ క్లీన్’గా ఉన్నట్లు కనిపించినా.. గూగుల్ ప్లేస్టోర్ వాటిని అనుమతించినా.. అప్‌డేట్స్ సమయంలో యూజర్లకు తెలియకుండానే మాల్‌వేర్లను చొప్పిస్తాయి. దీన్నే చీటింగ్ అప్‌డేట్స్ అంటారు. ఆయా యాప్‌లను అప్‌డేట్ చేశాక.. వ్యక్తిగత సమాచార తస్కరణ, పేమెంట్ యాప్‌ల యాక్సెస్ వంటి వెసులుబాట్లు హ్యాకర్లకు కలుగుతాయి. చైనా ఫోన్లలో సింహభాగం ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఈకోవకు చెందినవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్‌ అన్‌ఇన్‌స్టాల్ ఫీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్పత్తిదారులను ఆదేశించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

మార్కెట్ వాటా 50%

భారత మొబైల్‌ఫోన్ల మార్కెట్‌లో చైనా ఫోన్ల వాటా 50శాతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ మొబైల్ ఆపరేటర్స్ అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి. యాపిల్ ఐఫోన్ల వాటా 3%, సామ్‌సంగ్ వాటా 20% దాకా ఉన్నట్లు చెబుతున్నాయి. దీన్ని బట్టి.. భారతీయులు ఎకానమీ ఫోన్లను ఇష్టపడుతున్నట్లు నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో యూజర్లపై భారం మోపకుండా.. ఉత్పత్తిదారులు ప్రీఇన్‌స్టాల్ యాప్స్ తొలగింపునకు ఆప్షన్ ఇచ్చేలా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ భావనగా తెలుస్తోంది.

చైనా ఫోన్ల వల్ల నష్టాలేంటి?

1. భద్రతాపరమైన ఫీచర్లు తక్కువ

2. మాల్‌వేర్లు, ఇతర వైరస్‌ల చొరబాటుకు, హ్యాకింగ్‌కు ఆస్కారలెక్కువ

3. యాడ్‌వేర్ల వల్ల ప్రకటనల చిరాకు

4. బ్యాక్ గ్రౌండ్ ప్రాసెసింగ్ అధికంగా ఉండే ప్రీఇన్‌స్టాల్డ్ యాప్స్ వల్ల బ్యాటరీ, డేటాపై భారం

5. త్వరగా వేడెక్కడం.. నిర్ధారిత ప్రమాణాల కంటే ఎక్కువగా రేడియేషన్ విడుదల

6. బ్యాటరీ సామర్థ్యం ప్రకటించినంతగా ఉండకపోవడం.. త్వరగా బ్యాటరీ చెడిపోవడం.

Updated Date - 2023-03-15T22:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising