ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచానికి పొంచివున్న సముద్ర గండం.. కనుమరుగు కానున్న ప్రాంతాలివే..

ABN, First Publish Date - 2023-04-26T10:21:14+05:30

వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టం(sea level) ప్రపంచంలోని అనేక ప్రదేశాల ఉనికిని నిర్మూలించే దిశగా కదులుతోంది. శాస్త్రవేత్తల(scientists) అంచనా ప్రకారం 2100 నాటికి ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు నీటిలో మునిగిపోనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టం(sea level) ప్రపంచంలోని అనేక ప్రదేశాల ఉనికిని నిర్మూలించే దిశగా కదులుతోంది. శాస్త్రవేత్తల(scientists) అంచనా ప్రకారం 2100 నాటికి ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు నీటిలో మునిగిపోనున్నాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం సముద్ర మట్టం వేగంగా పెరుగుతోంది.

యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ (UCS) ఆ వివరాలు వెల్లడించింది. మునిగిపోయే ప్రదేశాలలో మాల్దీవులు అగ్రస్థానంలో ఉన్నాయి. 1200 చిన్న, పెద్ద దీవులతో కూడిన ఈ దేశంలో 77 శాతం కనుమరుగుకానుంది. దీని తరువాత కిరిబాటి(Kiribati) దేశం వస్తుంది. కిరిబాటి జనాభా ఒక లక్షా 20 వేలు. రాబోయే కాలంలో ఈ దేశం మూడింట రెండు వంతుల భూమిని కోల్పోనుంది.

ఈ జాబితాలో చైనా కూడా చేరింది. చైనా(China)లోని సముద్ర తీరంలో దాదాపు 43 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. రాబోయే కాలంలో వారు చాలా నష్టపోనున్నారు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌(Bangladesh)లోని ఢాకా నగరం కూడా చేరింది. ఇక్కడ 32 మిలియన్ల మంది నిరాశ్రయులు కానున్నారు. ఈ జాబితాలో భారతదేశం పేరు కూడా చేరింది. యూరోపియన్ యూనియన్(European Union) నిధులతో రూపొందించిన లైఫ్ అడాప్టేట్ ప్రాజెక్ట్ ప్రకారం, భారతదేశంలో 27 మిలియన్ల మంది ప్రజలు సముద్రాల వల్ల ప్రభావితమవుతారు. స్వచ్ఛంద సంస్థ Earth.org తెలిపిన వివరాల ప్రకారం జకర్తా(Jakarta) అత్యంత వేగంగా మునిగిపోబోతోంది.

ఏటా రెండు నుంచి నాలుగు అంగుళాల మేరకు నీటిలో మునిగిపోతోంది. ఇది 2050 నాటికి నీటిలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. అమెరికాలోని న్యూయార్క్(New York) నగరం కూడా ఈ జాబితాలో ఉంది. పెరుగుతున్న సముద్ర మట్టం కారణంగా ఈ నగరం మునిగిపోయే అవకాశం మరింతగా పెరుగుతోంది.

Updated Date - 2023-04-26T10:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising