ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ పెళ్ళిలో ఏడడుగులు కాదు ఐదే.. చనిపోయిన వారికి విగ్రహాలు కట్టి బీడి,సిగరెట్,మద్యంతో నైవేద్యం..

ABN, First Publish Date - 2023-03-02T14:40:01+05:30

అలాంటివాళ్ళు తమ గ్రామంలోకి రావద్దని 2కిలోమీటర్ల దూరంలోనే హెచ్చరిక బోర్డ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హిందూ సంప్రదాయపు పెళ్ళిలో సప్తపది తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో వరుడు వధువు చిటికెన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడుస్తాడు. కానీ అక్కడ మాత్రం ఏడడుగులకు బదులుగా ఐదడుగులు మాత్రమే వేస్తున్నారు. అంతేకాదు చనిపోయిన కుటుంబసభ్యులకు విగ్రహాలు కట్టి బీడి, సిగరెట్, మద్యంతో నైవేద్యం కూడా పెడుతున్నారు. ఈ సందర్భంగా మేక బలి ఇవ్వడం తప్పనిసరి. ఇవన్నీ తెలియగానే ఇదేదో మూడనమ్మకాల ప్రాంతమనీ, వీరికి చదువు సంధ్యా లేదని అనుకుంటారేమో.. కానీ అలా అనుకుంటే పొరపడినట్టే.. అక్కడ ప్రతి ఇంట్లో చదువుకున్నవారు ఉన్నారు. సంప్రదాయానికి, మూఢనమ్మకానికి మధ్య ప్రశ్నార్థకంలా అనిపిస్తున్న ఈ గ్రామం గురించి తెలుసుకుంటే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం భోపాల్(Bhopal) జిల్లాలో భిలాలా(Bhilala) గ్రామం ఒకటి. ఈ గ్రామంలో సుమారు 1200 జనాభా ఉంది. ప్రతి ఇంట్లోనూ చదువుకున్నవారు ఉన్నారు. ఈ గ్రామంలో ఒక మాధ్యమిక పాఠశాల ఉంది. దీనికి మించి పై తరగతుల కోసం 5కిలోమీటర్ల దూరం వెళ్ళి మరీ చదువుకుంటున్నారు. ఈ గ్రామంలో చాలామంది బిఏ-బియస్సీ చదివినవారు, చదువుతున్నవారు ఉన్నారు. చాలామంది విద్యాశాఖ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ లలో పనిచేస్తున్నవారున్నారు. వీరేమీ నిరక్షరాస్యులు కాదనే విషయం దీని ద్వారా స్పష్టమవుతోంది.కానీ వీరి సంప్రదాయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నా, వీరి అలవాట్లను మార్చుకోమని ఎవరైనా చెప్పినా వీరికి అస్సలు నచ్చదు. అలాంటివాళ్ళు తమ గ్రామంలోకి రావద్దని 2కిలోమీటర్ల దూరంలోనే హెచ్చరిక బోర్డ్ తగిలించారు. మతం మారాలనే ఉద్దేశంతోనో, మతాంతర వివాహాలకోసమో ప్రయత్నించేవారు తమ గ్రామంలోకి అడుగుపెట్టద్దని కూడా హెచ్చరిక బోర్డులో రాశారు.

Read also: ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిగా మార్చుకునే ప్రయత్నంలో కుర్రాడు.. కోర్టు మెట్లెక్కిన తండ్రి.. వీరి కథేంటంటే..


ఈ భిలాలా ప్రజలు భిల్లు జాతికి చెందిన గిరిజనులు. వీరు 45ఏళ్ళక్రితం భోపాల్ క్రషర్ లో కూలీలుగా పనిచేయడానికి భోపాల్ జిల్లాకు వచ్చారు. వీరు ప్రధానంగా నిమాడి భాషను మాట్లాడతారు. ఇది దక్షిణ రాజస్థానీ, మార్వాడీ భాషల మిశ్రమం. వీరి కుటుంబాలలో జరిగే పెళ్ళిలో అగ్నిహోత్రం ఉండదు. దానిబదులుగా చెక్కపలక ఉంటుంది. ఈ చెక్కపలక చుట్టూ ఏడడుగులకు బదులు ఐదడుగులు మాత్రమే వేస్తున్నారు. అమ్మాయిలకు వరుడిని ఎంచుకునే విషయంలో పూర్తీ స్వేచ్చ ఉంది. ఇంకా కుటుంబాలలో ఎవరైనా అనుకోకుండా మరణిస్తే వారిని దేవుళ్ళలా కొలుస్తారు. చనిపోయిన వారికి గుర్తుగా విగ్రహాలు కట్టించి వాటికి బీడి, సిగరెట్, మద్యంతో నైవేద్యం పెడతారు. వీటితోపాటు కోడి-మేకను బలి ఇచ్చి సమర్పిస్తారు. వీరు మిగిలిన గ్రామీణ ప్రజల్లాగే వ్యవసాయం, పశుపోషణ, కూలిపనులు చేసుకోవడం వంటివాటిపై ఆధారపడి జీవిస్తున్నారు.

చరిత్ర ప్రకారం మాంధాత ఓంకారేశ్వరుని పాలన భిల్ పాలకుల క్రింద ఉండేది.ఈ భిల్లులు 15వ శతాబ్దానికి చెందినవారు. ఈ ప్రాంతం 1824లో బ్రిటీష్ పాలకుల నియంత్రణలోకి వచ్చింది.ఈ భిల్లులు చాలా ఆత్మాభిమానం కలిగినవారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా భిలాలా సమాజం అడుక్కోవడం కనిపించదు. అడవులలోనూ, పర్వతాల మధ్యలో నివసించడం వల్ల వీరు ప్రకృతిని ఆరాధిస్తారు.

Updated Date - 2023-03-02T16:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!