Gold Shop: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ షాపులో బంగారు నగలన్నీ మాయం.. అనుమానంతో ఆ యజమాని షాపంతా వెతికితే..!
ABN, First Publish Date - 2023-03-30T17:02:12+05:30
షట్టర్ వేసింది.. వేసినట్టుగానే ఉంది. అయినా చోరీ జరిగింది. ఎలా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
వామ్మో.. ఈ సీన్ చూశాక.. దొంగలు ఎంత తెలివి మీరిపోయారో ఆశ్చర్యపోవడం ఖాయం. వేసిన తాళం వేసినట్టుగానే ఉంది. కానీ షాపులో మాత్రం నగలు మాయమైపోయాయి. దొంగతనం ఎలా జరిగిందో తెలియక యజమాని జట్టు పట్టుకున్నాడు. అనుమానంతో షాపంతా కలియ తిరిగాడు. చోరీ జరిగిన తీరు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ దొంగతనం ఎలా జరిగింది. షట్టర్ వేసింది.. వేసినట్టుగానే ఉంది. అయినా చోరీ జరిగింది. ఎలా? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మీరట్(Meerut)లో పెద్ద నగల షాపు (jewelery shop) ఉంది. సోమవారం ఉదయం షాపు ఓపెన్ చేసి ఓనర్ లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. షాపులోని లక్షల ఖరీదైన బంగారు నగలన్నీ మాయమయ్యాయి. కానీ వేసిన షట్టర్ వేసినట్టే ఉంది. కానీ నగలు ఎలా మాయమయ్యాయో తెలియక షాపు యజమాని మొత్తం అంతా పరిశీలించాడు. చివరికి దొంగతనం జరిగిన తీరు చూసి ఖంగుతిన్నాడు.
ఇవి కూడా చదవండి: Pimples: క్రీములు, లోషన్లు అస్సలు అక్కర్లేదు.. రూపాయి ఖర్చు లేకుండా మొటిమలకు చెక్ పెట్టే చిట్కాలివి..!
బంగారం షాపు పక్కన నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఆ డ్రైనేజీ నుంచి షాపులోకి రావడానికి దుండగులు 10 అడుగుల సొరంగం తవ్వుకుంటూ రాత్రి పూట షాపులోకి ప్రవేశించి లక్షల విలువైన గోల్డ్ (gold)ను ఎత్తుకెళ్లారు. జరిగిన తీరు చూసి షాపు ఓనర్ లబోదిబోమన్నాడు. అనంతరం మీరట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు పోలీసులు తీరుపై నగల షాపుల యజమానులు మండిపడ్డారు. దొంగలు రెచ్చిపోయి నగలు ఎత్తుకెళ్లిపోతున్నా పోలీసులు మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సంఘటనాస్థలిని సందర్శించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని కేటుగాళ్ల కోసం గాలిస్తున్నారు. విలువైన ఆభరణాలతో పరారైన దొంగలు ఓ లేఖను కూడా షాపులో వదిలివెళ్లినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Cooler: వాడకుండా పక్కన పడేసిన పాత కూలర్‌ను మళ్లీ బయటకు తీస్తున్నారా..? వాడే ముందు చేయాల్సిన పనులివీ..!
Updated Date - 2023-03-30T17:08:28+05:30 IST