ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన దేశంలోని రాజకీయ నేతలు తెల్లని కుర్తా-పైజమా ఎందుకు ధరిస్తారో తెలుసా? దీని వెనుకనున్న కారణమిదే..

ABN, First Publish Date - 2023-05-03T10:24:24+05:30

భాష, యాస, వేషధారణలు విభిన్నంగా ఉండే మన భారతదేశంలో ఒక విషయంలో సారూప్యత(Similarity) కనిపిస్తుంది. అదే మన రాజకీయ నేతల వస్త్రధారణ. దేశంలోని ప్రతిప్రాంతంలో ఎవరు నాయకుడవ్వాలనుకున్నా, లీడర్‌(leader)గా కనిపించాలనుకున్నా తెల్లటి కుర్తా పైజామా ధరిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భాష, యాస, వేషధారణలు విభిన్నంగా ఉండే మన భారతదేశంలో ఒక విషయంలో సారూప్యత(Similarity) కనిపిస్తుంది. అదే మన రాజకీయ నేతల వస్త్రధారణ. దేశంలోని ప్రతిప్రాంతంలో ఎవరు నాయకుడవ్వాలనుకున్నా, లీడర్‌(leader)గా కనిపించాలనుకున్నా తెల్లటి కుర్తా పైజామా ధరిస్తుంటారు. అయితే ఈ ఆచారం ఎక్కడి నుంచి మొదలైందన్న ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంటుంది.

ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం(Answer) తెలుసుకుందాం. ఈ ఆచారం భారత స్వాతంత్ర్య పోరాట కాలం నాటిది. భారత స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ(Mahatma Gandhi) స్వదేశీ నినాదం ఇచ్చినప్పుడు దేశ ప్రజలు విదేశీ దుస్తులను సేకరించి, వాటిని తగులబెట్టారు. ఆ తరువాత మహాత్మా గాంధీ.. భారతీయులను ఖాదీ వస్త్రాలు(Khadi cloths) ధరించే దిశగా ప్రేరేపించారు. గాంధీజీ దీనిని స్వావలంబనకు చిహ్నంగా భావించారు. అలాగే ఖాదీతో తయారు చేసిన దుస్తులు ఎక్కువగా తెలుపు రంగు(white color)లో ఉంటాయి. కాలక్రమేణా అది చేనేతవస్త్రంగా మారింది.

అది మొదలు రాజకీయాల్లో ఉండేవారు, సామాజిక సేవ చేసేవారు ఎప్పుడూ తెల్లని దుస్తులలో కనిపించడం మొదలుపెట్టారు. మరోవైపు సంప్రదాయపరం(traditional)గా చూస్తే తెలుపు రంగు సత్యం, అహింసకు చిహ్నం. కుర్తా, పైజామా, ధోతీ మొదలైనవి భారతీయ సంప్రదాయ దుస్తులు.

దీనితోపాటు తెలుపు రంగు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెలుపు రంగు కుర్తా, పైజామా ధరించినప్పుడు వారిలో సింప్లిసిటీ(Simplicity) కనిపిస్తుంది. భారతదేశంలోని రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు తెల్లని దుస్తులు ధరించడానికి ఇదే ప్రధాన కారణం.

Updated Date - 2023-05-03T10:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising