ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Break Up: ఇదెక్కడి లవ్‌స్టోరీ తల్లి.. రీల్స్‌కు లైక్ కొట్టలేదని బ్రేకప్.. మధ్యలో దోమ కథ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-11-27T21:35:38+05:30

ప్రస్తుత టీనేజర్ల లవ్‌స్టోరీలు చాలా ఫన్నీగా ఉంటున్నాయి.. కలిసి తిరిగినంత కాలం తిరిగి ఆ తర్వాత సిల్లీ కారణాలతో బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.. ఎవరి బంధం ఎంత కాలంలో ముగుస్తుందో అంచనా వేయడం కష్టం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ 16 ఏళ్ల బాలిక బ్రేకప్ స్టోరీ వింటే నవ్వు రాకమానదు.

ప్రస్తుత టీనేజర్ల లవ్‌స్టోరీలు (Love Story) చాలా ఫన్నీగా ఉంటున్నాయి.. కలిసి తిరిగినంత కాలం తిరిగి ఆ తర్వాత సిల్లీ కారణాలతో బ్రేకప్ (Break Up) చెప్పేసుకుంటున్నారు.. ఎవరి బంధం ఎంత కాలంలో ముగుస్తుందో అంచనా వేయడం కష్టం.. లవ్, బ్రేకప్ మొదలైన విషయాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేలా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ 16 ఏళ్ల బాలిక బ్రేకప్ స్టోరీ వింటే నవ్వు రాకమానదు. ఆమె తన ప్రేమకథలో దోమను కూడా విలన్‌ను చేసింది. తన కథను స్వయంగా ఆ బాలిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది (Funny Break Up Story).

``నాకు ప్రేమ, డేటింగ్ పట్ల అంతగా ఆసక్తి లేదు. కానీ నా ఫ్రెండ్ హర్షిత్ నన్ను అమితంగా ఆకట్టుకున్నాడు. అయినా నేను 6 నెలలు వెయిట్ చేసిన తర్వాతే హర్షిత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ తర్వాత హర్షిత్ నిజస్వరూపం నాకు తెలిసింది. నేను పోస్ట్ చేసిన రీల్స్‌కు లైక్స్ కొట్టలేదు. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదు. అనుష్కను విరాట్ కోహ్లి ఎలా చూసుకుంటాడో, ఆ విధంగా హర్షిత్ నన్ను చూసుకోలేదు. తర్వాత ఒకరోజు హర్షిత్ మీద కోపంతో అతని క్లాస్‌రూమ్‌కి వెళ్లి అతని చెంపపై గట్టిగా కొట్టాన``ని వెల్లడించింది.

Social Media: చనిపోయేముందు ఆ మహిళ రాసిన వీలునామా చెల్లదంటూ సంచలన తీర్పు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

``నేను కొట్టే సమయంలో హర్షిత్ చెంప మీద ఒక దోమ (Mosquito) ఉంది. నా కొట్టిన దెబ్బకు ఆ దోమ చనిపోయింది. ఇప్పుడు ఆ దోమ ఫ్యామిలీ నా కలలోకి వస్తోంది. నాపై పగబట్టిన ఆ దోమ ఫ్యామిలీ పగ తీర్చుకోవాలని చూస్తోంది. నాకు డెంగ్యూ రావాలని దోమ ఫ్యామిలీ కోరుకుంటోంద``ని ఆ బాలిక రాసింది. ఆ బాలిక రాసిన ఈ ఫన్నీ బ్రేకప్ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు ఈ పోస్ట్‌పై ఫన్నీగా స్పందిస్తున్నారు.

Updated Date - 2023-11-27T21:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising