Viral Video: ఇంటి ముందు సీబీఐ అధికారులు.. తలుపులు వేసుకుని మరీ ఓ భార్య చేసిన నిర్వాకమిదీ.. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో..
ABN, First Publish Date - 2023-03-27T16:46:02+05:30
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. రాజ్‌కోట్‌లో ఫారిన్ ట్రేడ్ జాయింట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న జవారీ మల్ బిష్ణోయ్ రూ.5 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు.
గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. రాజ్‌కోట్‌లో ఫారిన్ ట్రేడ్ జాయింట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న జవారీ మల్ బిష్ణోయ్ రూ.5 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐ (CBI) అధికారులకు పట్టుబడ్డాడు. శనివారం అతడి ఆఫీస్, ఇంటిపై సీబీఐ అధికారులు దాడి చేశారు. తన ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులను చూసిన బిష్ణోయ్ నాలుగో అంతస్తు కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్య చేసిన పని తాజాగా వెలుగులోకి వచ్చింది.
సీబీఐ బృందం ఇంటికి చేరుకున్నప్పుడు, బిష్ణోయ్ భార్య బెడ్రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకుంది. డబ్బు ఉన్న బ్యాగ్‌ను (Bag Full of Cash) బాల్కనీ నుంచి పార్కింగ్ స్థలంలోకి విసిరేసింది. ఆ బ్యాగ్‌ను ఆమె మేనల్లుడు తీసుకుని పక్క ఇంట్లో పెట్టాడు. సీసీటీవీ ఫుటేజీలో వారి చర్యలు మొత్తం రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage) ఆధారంగా అసలు విషయం తెలుసుకున్న అధికారులు రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగ్‌ల్లో ఉన్న దాదాపు కోటి రూపాయలను సీజ్ చేశారు.
Brother And Sister Relationship: పెళ్లి చేసుకుని భర్తతో కలిసి కారులో అత్తారింటికి అక్క వెళ్తోంటే.. ఆమె తమ్ముడు ఏం చేశాడో మీరే చూడండి..!
ఆ మహిళ బాల్కనీ నుంచి డబ్బులు విసిరేస్తుండగా ఆమె మేనల్లుడు కింద నుంచి పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సీబీఐ అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
NASA Revealed Mystery: చందమామ పక్కనే ఓ చక్కని చుక్క.. ఈ అద్భుతం వెనుక ఉన్న మిస్టరీని బయటపెట్టిన నాసా..!
Updated Date - 2023-03-27T16:46:02+05:30 IST