Bed For Rent: మహిళ ఆఫర్.. అద్దెకు ‘సగం బెడ్’.. జస్ట్ రూ.54 వేలు మాత్రమే.. ఎక్కడో తెలుసా?
ABN, First Publish Date - 2023-11-23T11:23:00+05:30
ఎవరైనా తమ ఇంటిని గానీ, లేదా పేయింగ్ గెస్టుగా ప్రత్యేకమైన రూమ్‌ని గానీ అద్దెకు ఇస్తుంటారు. కానీ.. సగం బెడ్‌ని అద్దెకు ఇవ్వడాన్ని ఎక్కడైనా చూశారా? అసలు ఇలాంటి విచిత్రమైన ఆలోచన మీకెప్పుడైనా తట్టిందా? అయితే.. టొరంటోలోని ఒక మహిళ మాత్రం..
Half Bed For Rent: ఎవరైనా తమ ఇంటిని గానీ, లేదా పేయింగ్ గెస్టుగా ప్రత్యేకమైన రూమ్‌ని గానీ అద్దెకు ఇస్తుంటారు. కానీ.. సగం బెడ్‌ని అద్దెకు ఇవ్వడాన్ని ఎక్కడైనా చూశారా? అసలు ఇలాంటి విచిత్రమైన ఆలోచన మీకెప్పుడైనా తట్టిందా? అయితే.. టొరంటోలోని ఒక మహిళ మాత్రం ఈ ఆఫర్ ప్రకటించింది. తన బెడ్‌లోని సగం బెడ్‌ని అద్దెకు ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చింది. ఇంతకీ అద్దె ఎంతో తెలుసా? నెలకు ఏకంగా 900 కెనడియన్ డాలర్లు (మన భారత కరెన్సీలో రూ.54,790). టొరంటోలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఒక మహిళ ఈ తెలివైన ఆలోచన చేసింది. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అనే చందంగా.. అద్దెలు భారీగా ఉన్నాయి కాబట్టి, ఇలా సగం బెడ్ అద్దెకిచ్చి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ప్లాన్ చేసింది.
ఈ విషయాన్ని అన్యా ఎట్టింగర్ అనే మహిళ హైలైట్ చేసింది. తన ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో తాను ఈ ‘సగం బెడ్’ ప్రకటన చూశానని.. అది చూసి తాను షాక్‌కి గురయ్యానని తెలిపింది. ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే.. ‘‘మాస్టర్ బెడ్‌రూమ్, ఒక క్వీన్-సైజ్ బెడ్‌ను పంచుకోవడానికి ఒక స్త్రీ కోసం వెతుకుతున్నాను. ఇంతకుముందు నేను ఫేస్‌బుక్‌లో పరిచయమైన రూమ్‌మేట్‌తో ఒక క్వీన్-సైజ్ ఉన్న బెడ్‌రూమ్‌ని షేర్ చేసుకున్నాం. ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది’’ అని రాసి ఉంది. ‘లేక్-ఫేసింగ్ కలిగిన షేర్డ్ బెడ్‌రూమ్’ అనే టైటిల్‌తో ఆ పోస్టింగ్ ఉండగా.. నెలకు అద్దె కేవలం 900 కెనడియన్ డాలర్లు అని దానికి జత చేయబడింది. ఈ పోస్టును అన్యా ఎట్టింగర్ షేర్ చేస్తూ.. ‘‘టొరంటో మార్కెట్ చాలా దారుణంగా దిగజారిందని చెప్పడానికి ఒక్క ప్రకటనే ఉదాహరణ’’ అని విచారం వ్యక్తం చేసింది. ‘‘అసలు సగం బెడ్‌ని అద్దెకు ఇవ్వడం ఏంటి? అది కూడా నెలకు 900 డాలర్లకు. ఇది నిజంగా జుగుప్సాకరం’’ అని ఆమె పేర్కొంది.
ఇదిలావుండగా.. టొరంటో నగరం కెనడాలోనే రెండో అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా నివేదించబడింది. అక్కడ కేవలం ఒక బెడ్రూమ్ అద్దె నెలకు యావరేజ్‌గా $2,614 (మన ఇండియన్ కరెన్సీలో రూ.2,17,870)గా ఉంది. అద్దె ఇంత భారీగా ఉండటం వల్లే.. అద్దెపై ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇలా ‘హాఫ్ బెడ్’లను అపరిచత వ్యక్తులతో పంచుకునే ట్రెండ్ విపరీతంగా పెరిగిపోతోంది. 2021లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 7,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో 3 శాతం మంది అద్దె ఖర్చులను ఆదా చేసేందుకు గాను ఈ ‘హాట్ బెడ్డింగ్’ని ఆశ్రయించినట్టు తేలింది. దీన్ని బట్టి.. అక్కడ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Updated Date - 2023-11-23T11:23:02+05:30 IST