ఈ 10 వ్యాధులలో ఏ ఒక్క వ్యాధితోనైనా బాధపడుతున్నారా? అయితే రైల్వేశాఖ అందిస్తున్న ఈ శుభవార్త మీకోసమే!
ABN, First Publish Date - 2023-04-19T09:27:07+05:30
దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి రైల్వేశాఖ శుభవార్త(good news) చెప్పింది. అనేక వర్గాల ప్రయాణికులకు రైల్వేశాఖ టిక్కెట్‌లో రాయితీ(Concession) ఇస్తున్న విషయం విదితమే.
దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి రైల్వేశాఖ శుభవార్త(good news) చెప్పింది. అనేక వర్గాల ప్రయాణికులకు రైల్వేశాఖ టిక్కెట్‌లో రాయితీ(Concession) ఇస్తున్న విషయం విదితమే. అయితే దీర్ఘ కాలిక రోగులకు అందజేస్తున్న రాయితీకి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్ పేషెంట్లకు(cancer patients), వారితో పాటు వెళ్లే అటెండర్‌కు టిక్కెట్ ఛార్జీలో మినహాయింపునిచ్చే నిబంధన ఉంది. వారు చికిత్స కోసం ఎక్కడికైనా వెళుతుంటే, వారు ఏసీ చైర్‌కార్(AC chair car)లో 75 శాతం రాయితీ పొందవచ్చు. అదే సమయంలో AC-3, స్లీపర్‌లలో 100 శాతం రాయితీ ఇస్తున్నారు. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ క్లాస్‌లో 50 శాతం రాయితీ లభిస్తుంది.
తలసేమియా, గుండె జబ్బులు(Heart diseases) ఉన్నవారు, కిడ్నీ బాధితులకు కూడా ఛార్జీలో రాయితీ లభిస్తుంది. హృద్రోగులు గుండె శస్త్రచికిత్స కోసం వెళుతున్నప్పుడు, కిడ్నీ రోగులు కిడ్నీ మార్పిడి లేదా డయాలసిస్ కోసం వెళుతున్నప్పుడు టిక్కెట్ ఛార్జీలలో రాయితీ పొందవచ్చు. ఇటువంటి సందర్భంలో AC-3, AC చైర్ కార్, స్లీపర్(Sleeper), సెకండ్ క్లాస్, ఫస్ట్ ఏసీలలో 75 శాతం రాయితీ లభిస్తుంది. రోగితో పాటు ఉన్న వ్యక్తి కూడా మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.
హీమోఫీలియా(Hemophilia) రోగులు చికిత్స కోసం రైల్లో వెళ్లేటప్పుడు టిక్కెట్ ఛార్జీలలో రాయితీ లభిస్తుంది. ఈ రోగులతో పాటు వెళ్లే మరో వ్యక్తికి కూడా రాయితీ లభిస్తుంది. ఈ కేటగిరీలోని వారు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, ఏసీ-3, ఏసీ చైర్ కార్లలో 75 శాతం వరకూ రాయితీని పొందవచ్చు.
టీబీ రోగులు చికిత్స కోసం రైల్లో వెళుతున్నప్పుడు టిక్కెట్ ఛార్జీలో మినహాయింపు పొందవచ్చు. ఈ రోగులకు సెకండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌లో 75 శాతం రాయితీ(Concession) లభిస్తుంది. వీరితో పాటు వెళ్లే మరొక వ్యక్తికి కూడా ఈ మినహాయింపు లభిస్తుంది.
ఇన్‌ఫెక్షన్ లేని కుష్టు వ్యాధిగ్రస్తులకు(leprosy patients) కూడా సెకండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌లో 75% రాయితీ ఇస్తారు.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం రైల్లో వెళ్లేటప్పుడు రెండవ తరగతిలో 50% రాయితీ ఇస్తారు.
Ostomy రోగులు మొదటి, రెండవ తరగతిలో నెలవారీ సెషన్, క్వార్టర్ సెషన్(Quarter Session) టిక్కెట్లలో రాయితీని పొందవచ్చు
రక్తహీనత రోగులకు స్లీపర్, AC చైర్ కార్, AC-3 టైర్, AC-2 టైర్ టిక్కెట్లలో 50 శాతం రాయితీ(Concession) ఇవ్వనున్నారు.
Updated Date - 2023-04-19T10:30:35+05:30 IST