Success Story: కరోనా మార్చిన తలరాత.. మూడేళ్ల క్రితం వరకు పెయింటర్‌గా పనిచేసిన ఈ వ్యక్తే ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు..!
ABN, First Publish Date - 2023-06-30T20:11:10+05:30
అతడి పేరు ప్రజ్ఞాన్ చక్మా. అతడు ఒక పెయింటర్. కేరళలోని త్రిపురకు సమీపంలో ఉన్న పంచరతన్ అనే గ్రామంలో ఓ చిన్న ఆర్ట్ స్కూల్ నడిపేవాడు. అయితే కరోనా కారణంగా 2020లో అతడి స్కూల్ మూతబడింది. అతడికి సంపాదన లేకుండా పోయింది.
అతడి పేరు ప్రజ్ఞాన్ చక్మా. అతడు ఒక పెయింటర్. కేరళ (Kerala)లోని త్రిపురకు సమీపంలో ఉన్న పంచరతన్ అనే గ్రామంలో ఓ చిన్న ఆర్ట్ స్కూల్ నడిపేవాడు. అయితే కరోనా కారణంగా 2020లో అతడి స్కూల్ మూతబడింది. అతడికి సంపాదన లేకుండా పోయింది. కరోనా తర్వాత అతడు ఒకసారి పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏడాది పొడవునా ఫలాలను ఇచ్చే మామిడి చెట్లను చూశాడు. ఆ తర్వాత తను కూడా రైతుగా మారాలనుకున్నాడు. తనకు ఉన్న నాలుగెకరాల్లో ఆ ప్రత్యేకమైన మామిడిని పండించడం మొదలుపెట్టాడు (Success Story).
అప్పటివరకు తను సంపాదించన డబ్బు మొత్తాన్ని ఆ తోటపై పెట్టాడు. అతడు పండించే ఆ ప్రత్యేక మామడి పేరు ``మియాజాకి`` (Miyazaki mango). ఈ మియాజాకి మామిడి పండ్లను మొదటిసారిగా 1940లలో కాలిఫోర్నియాలో ఉత్పత్తి చేసినప్పటికీ జపాన్ (Japan)లోని మియాజాకి ప్రాంతంలో బాగా సాగు చేశారు. దాంతో ఆ మామిడి పండ్లకు మియాజాకి మామిడి అనే పేరు వచ్చింది. ఈ మామిడి దాని పోషణ, రుచి, రంగు మరియు తీపి రుచికి ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మామిడి కిలో ధర దాదాపు 2.75 లక్షల రూపాయలు. ఒక్క పండు ధర దాదాపు రూ.40 వేలు. ఈ మియాజాకీ మామిడి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. దీనిలో బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. అలాగే యాంటీ-ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి (World`s most Expensive mango).
Zomato Delivery Boy: ప్రతీ ఆర్డర్‌కు సొంత డబ్బుతో ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ జొమాటో డెలివరీ బాయ్ ఎందుకిలా చేస్తున్నాడంటే..!
ప్రజ్ఞాన్ కూడా తన సంపాదన మొత్తాన్ని మియాజాకిపై పెట్టుబడి పెట్టాడు. ఐదేళ్ల క్రితం మియాజాకీ మామిడి పండ్లను ప్రజ్ఞాన్ పండించడం ప్రారంభించాడు. రెండేళ్ల నుంచి ఈ పండ్లను అమ్మడం ప్రారంభించాడు. అయితే ప్రజ్ఞాన్ పండించిన మియాజాకి మామిడి పండ్లను ఉద్యానవన శాఖ వారు పరీక్షించకపోవడం, వాటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ లేకపోవడంతో ప్రస్తుతానికి స్థానిక మార్కెట్‌లో మాత్రమే అమ్ముతున్నాడు. స్థానికంగా కిలో రూ.1500 చొప్పున విక్రయిస్తున్నాడు. గత ఏడాది 20 కిలోలు విక్రయించగా, ఈ ఏడాది తన విక్రయాలను రెట్టింపు చేసి దాదాపు 40 కిలోలకు పెంచాడు. తన తోటలో ఈ మియాజాకీతో పాటు రంబుటాన్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ బెర్ వంటి పండ్లను పండిస్తున్నాడు. అలాగే ఖతిమోన్, అమెరికన్ పామర్, రంగూయ్, ఆమ్రపాలి వంటి అనేక రకాల మామిడి పండ్లను పెంచుతూ లక్షలు సంపాదిస్తున్నాడు.
Updated Date - 2023-06-30T20:11:10+05:30 IST