ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? ఆ తల్లి చేసిన ఓ చిన్న పొరపాటే ఈ రెండేళ్ల బాలుడి మృతికి ఎలా కారణమయిందో తప్పక తెలుసుకోండి..!
ABN, First Publish Date - 2023-03-18T18:28:46+05:30
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ప్రతి క్షణం వారిని కనిపెట్టుకుని ఉండాలి.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలి..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ప్రతి క్షణం వారిని కనిపెట్టుకుని ఉండాలి.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలి.. లేకపోతే చిన్న చిన్న పొరపాట్లే చిన్నారుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటాయి.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఓ మహిళ చేసిన తప్పిదం ఆమె కొడుకు ప్రాణాలను తీసింది.. దీంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని మొరేనాకు చెందిన రాజ్‌వీర్ జాతవ్ రెండేళ్ల కుమారుడు రివ్యాన్ష్ ఇంట్లో ఆడుకుంటున్నాడు. తల్లి ఆ బాలుడికి కొన్ని బఠానీలను (Pea Grain) ఇచ్చింది. ఆ బాలుడు వాటిని నోటిలో వేసుకుని నమలడానికి ప్రయత్నించాడు. అయితే ఒక బఠానీ గింజ అతడి గొంతులో (Throat) ఇరుక్కుపోయింది. దాంతో రివ్యాన్ష్ ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. తర్వాత వాంతులు చేసుకున్నాడు. దీంతో భయపడిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని తీసుకుని ఆస్పత్రికి బయల్దేరారు. బాన్‌మోర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కుర్రాడి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు.
Viral Video: తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో చూడండి.. ప్రమాదకర ఎలుగు బంటితో ఆటలు.. షాకవుతున్న నెటిజన్లు
అంబులెన్స్‌లో కూర్చొని, భార్యాభర్తలు మోరెనా జిల్లా ఆసుపత్రికి బయలుదేరారు. కేవలం 25 కిలోమీటర్లు వెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా గంటన్నర సమయం తీసుకున్నాడు. దీంతో ఆ కుర్రాడు ఆస్పత్రికి వెళ్లే సరికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
దగ్గు మందు తాగి స్పృహ తప్పి పడిపోయిందంటూ 27 ఏళ్ల భార్యను ఆస్పత్రికి తెచ్చిన భర్త.. ఆమె తాగింది ఏంటన్నది డాక్టర్లు చెప్పడంతో..
Updated Date - 2023-03-18T18:28:46+05:30 IST