ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uber Auto: ఉబెర్ ఆటోను బుక్ చేసుకున్న యువతికి షాకింగ్ అనుభవం.. అంత రద్దీలోనూ రూ.6 కే రైడ్..!

ABN, First Publish Date - 2023-08-18T11:06:33+05:30

నగరాల్లో నివసించే ప్రజలు ఆటోలు, క్యాబ్ లకు వందలాది రూపాయలు ధారబోస్తుంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఆశ్చర్యంగా 6రూపాయలతో ఆటో జర్నీ చేసింది. ఇదెలా సాధ్యమంటే..

హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల్లో నివసించేవారు ఆన్లైన్ ట్రావెల్ సర్వీస్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆఫీసులకు, రైల్వేస్టేషన్లకు, సినిమాలకు.. ఇలా నగరంలో ఒక ప్రదేశం నుండి మరొకప్రదేశానికి వెళ్లడానికి క్యాబ్, ఆటో సర్వీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రజల అవసరాలకు తగ్గట్టే ఓలా, ఉబెర్ వంటి ట్రావెలింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ట్రాఫిక్ దారుణంగా ఉన్న సమయంలో ఈ క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు కూడా ఆన్లైన్లో చూపించే ధర కాకుండా ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. ఒక్కోసారి వీటికి వందలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కానీ బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం కేవలం రూ. 6కే రైడ్ పొందింది. అది కూడా ట్రాఫిక్ ఎంతో రద్దీగా ఉన్న సమయంలో ఇలా జరగడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వార్త బెంగుళూరు ప్రజలతో పాటు మహానగరాల్లో నివసించేవారికి పెద్ద షాకే ఇస్తోంది. అసలు ఇదెలా సాధ్యమైంది? నిజంగానే రూ.6కే రైడ్ పొందడం సాధ్యమా? వివరంగా తెలుసుకుంటే..

బెంగుళూరు(Bengaluru) వంటి నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సయమంలో ఎంత షార్డ్ రైడ్ అయినా ఆటోలు, క్యాబ్ లకు వందలాది రూపాయలు చెల్లించక తప్పదు. అందులోనూ సాయంత్రం, చీకటి సమయాల్లో అయితే వీరి డిమాండ్స్ చాలా దారుణంగా ఉంటాయి. బెంగుళూరు నివాసితులకు అక్కడి డిమాండ్స్ ఎలా ఉంటాయో అనుభవమే. కానీ బెంగుళూరుకు చెందిన మహిమా చందక్ అనే మహిళకు మాత్రం వింత అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణం కోసం ఉబెర్(Uber) లో ఆటోను(auto) బుక్ చేసుకుంది. రైడ్ కాస్ట్ చూసి షాకైంది. కేవలం రూ.6 చూపించడంతో ఆమె తను చూస్తున్నది నిజమా? కాదా? అనే సందిగ్దంలో పడిపోయింది. రైడ్ మొత్తం పూర్తైన తరువాత కానీ ఆమె పూర్తీగా తన ప్రయాణం రూ.6 కే పూర్తైందనే విషయం నమ్మలేకపోయింది(Uber auto ride for 6rs). ఈ రైడ్ తరువాత ఆమె ఉబెర్ ఆటో రైడ్ కు చెల్లించిన మొత్తాన్ని, తన ప్రయాణ మ్యాప్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన బెంగుళూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇతర నగరాల్లో ప్రజలు ఆసూయ పడేవారు కొందరైతే, అవాక్కవుతున్నవారు మరికొందరు.

Health Tips: ఈ 4 రకాల ఆకుకూరలు, కూరగాయలను పొరపాటున కూడా పచ్చివి తినకండి.. తింటే ఏమవుతుందంటే..!



ఈ పోస్ట్ ను Mahima Chandak తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేసింది. 'ఇది బగ్ అయి ఉండాలి' అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఇది చూసిన పలు నగరాల్లోని ప్రజలు కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు ఇదెలా సాధ్యమంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. 'నేను అసలు డబ్బులేమీ చెల్లించకుండా రైడ్ చేశాను. కూపన్ ఉపయోగించడం ద్వారా నాకు రైడ్ ఉచితంగా లభించింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'నేను నిన్న దీన్ని గమనించాను. ఛార్జెస్ సున్నా, పైగా 35శాతం డిస్కౌంట్ కూడా. దీన్ని ఉపయోగించాలని అనుకున్నా ఏ డ్రైవర్ దీన్ని అంగీకరించలేదు' అని మరొకరు చెప్పుకొచ్చారు.

Longer Life: ఎక్కువ కాలం బ్రతకాలని ఉందా..? అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే..!


Updated Date - 2023-08-18T11:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising