ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..

ABN, Publish Date - Dec 28 , 2023 | 04:05 PM

చెవిలో పోటుగా ఉండటంతో కెమెరా డివైజ్ పెట్టి చూసుకున్న మహిళకు దిమ్మతిరిగే షాక్..

ఇంటర్నెట్ డెస్క్: చెవిలో కొన్ని రోజులుగా దురద పుడుతున్నా పట్టించుకోలేదామె. గులిగి ఇబ్బంది పెడుతోందేమోనని అనుకుంది. ఆ తరువాత దురద స్థానంలో నొప్పి మొదలైంది. రోజు రోజుకూ నొప్పి ఎక్కువవుతుండటంతో చివరకు ఆమె..చెవి శుభ్రపరిచే ఓ ఎలక్ట్రానిక్ డివైజ్‌ను చెవిలో (Ear cleaning device with camera) పెట్టుకుంది. ఈ డివైజ్‌కు ఓ కెమెరా కూడా ఉండటంతో చెవిలో ఏముందో తెలిసి ఆమె దిమ్మెరపోయింది. బ్రిటన్‌లోని (Britain) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రిటన్‌లోని చెషైర్‌కు (Cheshire) చెందిన లూసీ వైల్డ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలంగా చెవి నొప్పి పుడుతుండటంతో ఆమె చిన్న స్మార్ట్ ఇయర్ క్లీనింగ్ పరికరంతో చెవిని శుభ్రపరుచుకునే ప్రయత్నం చేసింది. కానీ, చెవిలో ఏకంగా సాలీడు ఉన్నట్టు గుర్తించి దిమ్మెరపోయింది (UK woman finds spider nesting in her ear) . చివరకు చెవిలో గోరు వెచ్చని నూనె పోసి దాన్ని బయటకు తీసేసుకుంది. అక్కడితో సమస్య పూర్తయ్యిందనుకున్న ఆమెకు ఆ తరువాత ఊహించని సమస్య మొదలైంది.

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!


చెవిలో సాలీడు తొలగించుకున్నాక లూసీ కొన్ని రోజులు మందులు వాడినా ఉపయోగం లేకపోయింది. చెవిలో పోటు మాత్రం తగ్గలేదు. దీంతో, భయపడుతూనే ఆమె చెవిలో మరోసారి డివైజ్ పెట్టుకుని చెక్ చేసుకుంది. ఈసారి ఆమెకు చెవిలోపల ఏదో నల్లని జిగురు కనిపించడంతో లూసీ భయంతో వణికిపోయింది. వెంటనే డాక్టర్ వద్దకు పరుగుతీసింది.

లూసీ చెవిని పరీక్షించిన డాక్టర్లు కూడా ఆమె పరిస్థితి చూసి షాకైపోయారు. ఆమె చెవిలో ఏకంగా సాలిగూడు ఉందని చెప్పడంతో లూసీకి నోటమాటరాలేదు. ‘‘నాకు తెలీకుండా నా చెవిలోకి సాలీడు ఎలా వెళ్లింది? గూడు ఎలా కట్టుకుంది? అంటూ వైద్యులను ఆమె ప్రశ్నించింది. దీనికి డైక్టర్ల వద్ద కూడా సమాధానం లేకపోయింది. కాగా, లూసీ చెవిని శుభ్రం చేసిన డాక్టర్లు ఆమెకు కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించారు. చెవిలోంచి దాన్ని తొలగిస్తుంటే ప్రసవ వేదన కన్నా దారుణమైన నొప్పిని అనుభవించానంటూ లూసీ స్థానిక మీడియాకు చెప్పుకొచ్చింది.

Updated Date - Dec 28 , 2023 | 04:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising