ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bank Loan: పాత లోన్‌ను తీర్చేయకుండానే.. బ్యాంకులో మళ్లీ కొత్తగా లోన్ పొందాలంటే.. చేయాల్సిన పనేంటంటే..!

ABN, First Publish Date - 2023-08-11T17:14:58+05:30

మీరు గతంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? ప్రస్తుతం ఇంకా ఈఎమ్ఐ చెల్లిస్తున్నారా? పాత లోన్ పూర్తిగా తీరకుండానే మళ్లీ కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? నిజానికి పాత లోన్ పూర్తిగా చెల్లించకుండా బ్యాంకులు కొత్త లోన్ ఇవ్వవు.

మీరు గతంలో బ్యాంకు నుంచి లోన్ (Bank Loans) తీసుకున్నారా? ప్రస్తుతం ఇంకా ఈఎమ్ఐ (EMI) చెల్లిస్తున్నారా? పాత లోన్ పూర్తిగా తీరకుండానే మళ్లీ కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? నిజానికి పాత లోన్ పూర్తిగా చెల్లించకుండా బ్యాంకులు (Banks) కొత్త లోన్ ఇవ్వవు. అయితే క్రెడిట్ హిస్టరీ (Credit History) కనుక బాగున్నట్టైతే మాత్రం బ్యాంకులు మీకు లోన్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తాయి. కానీ, ఒకవేళ మీరు డీఫాల్టర్ (Defaulter) అని ఏ బ్యాంకు గుర్తించినా, మిగిలిన బ్యాంకుల్లో కూడా మీకు చుక్కెదురవుతుంది.

మీరు గతంలో తీసుకున్న లోన్ ఈఎమ్‌ఐలు సరిగ్గా చెల్లించలేకపోయినట్టైతే మీ బ్యాంకు ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరో (Credit bureau)కు తెలియజేస్తుంది. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ (Credit score) చెడిపోతుంది. ఇక, ఏ బ్యాంకులూ మిమ్మల్ని విశ్వసించవు. అటువంటి పరిస్థితిలో, మీరు మళ్లీ రుణం పొందడం దాదాపు అసాధ్యం. మీరు మొదటి రుణాన్ని తిరిగి చెల్లించకుండా కొత్త రుణం తీసుకోవాలనుకుంటే, ముందుగా బ్యాంకుతో చర్చలు జరిపి మీ బకాయిలను క్లియర్ చేయండి. అందుకు అవసరమైతే కొంత సమయం అడగండి. అలా చేస్తే మీ క్రెడిట్ స్కోరు తగ్గిపోకుండా ఉంటుంది.

How To Create Wealth: జీతమే సరిపోవడం లేదు.. ఇక సేవింగ్స్ ఎక్కడ..? అని వాపోతున్నారా..? ఈ 7 సూత్రాలను పాటిస్తే..!

పాత లోన్ తీర్చిన తర్వాత కొత్త లోన్ తీసుకునేందుకు కాస్త వేచి చూడండి. ఆ మధ్యలో మీకు వీలైనంత మొత్తాలను మీ అకౌంట్లో డిపాజిట్ (Deposit) చేస్తూ ఉండండి. దాంతో మీ క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. దీని తర్వాత, మీరు బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాత లోన్ తీర్చుకుండానే కొత్త లోన్ తీసుకోవాలనుకుంటే.. మీ బ్యాంకుకు మీపై ఉన్న నమ్మకం, క్రెడిట్ హిస్టరీ ఆధారంగానే లోన్ లభించే వీలుంటుంది.

Updated Date - 2023-08-11T17:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising