ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madyapradesh: దీపావళి సందర్భంగా ఆవులతో తొక్కించుకునే సంప్రదాయం.. ఎందుకో తెలుసా?

ABN, First Publish Date - 2023-11-13T15:54:26+05:30

మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని ఓ గ్రామం తనకంటూ ఓ స్పెషాలిటీని చూపుతూ వార్తలో నిలిచింది. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని(Ujjain) జిల్లా కేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో బద్‌నగర్ తహసీల్ లో భిదావద్(Bhidavad) అనే గ్రామం ఉంది. అక్కడ ఏళ్లుగా ఓ సంప్రదాయం(Unique Tradition) ఉంది.

భోపాల్: దేశంలోని చాలా ఏరియాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందిది. తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్ లో సంక్రాతి సందర్భంగా నిర్వహించే కోళ్ల పందేలు.. ఇలాంటివి ఆ ప్రాంతాల ప్రత్యేకతను, సంస్కృతిని చాటుతాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని ఓ గ్రామం సైతం తనకంటూ ఓ స్పెషాలిటీని చూపుతూ వార్తలో నిలిచింది.

వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని(Ujjain) జిల్లా కేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో బద్‌నగర్ తహసీల్ లో భిదావద్(Bhidavad) అనే గ్రామం ఉంది. అక్కడ ఏళ్లుగా ఓ సంప్రదాయం(Unique Tradition) ఉంది. దీపావళి(Diwali) పండుగైన మరుసటి రోజు ఉదయం భక్తులు వినూత్నంగా తమ మొక్కు తీర్చుకుంటారు. గ్రామంలో ఉదయం పూట గోవులకు పూజలు నిర్వహించి వాటి ముందు పడుకుంటారు. గోమాతలను(Cows) గ్రామస్థులు భక్తులపై నుంచి తీసుకెళ్తారు.


33 కోట్ల మంది దేవుళ్లు గోవుల్లో ఉంటారని.. అవి తమపై నడిస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల(Devotees) నమ్మకం. ఇదే కాకుండా దీపావళి అయ్యాక 5 రోజులపాటు ఆ గ్రామస్థులు ఉపవాసం ఉంటారు. దీపావళి ఒక రోజు ముందు రాత్రంతా గ్రామ దేవాలయంలో(Gods) భజనలు, కీర్తనలు చేస్తారు. రెండో రోజు పూజలు నిర్వహిస్తారు. ఆపై డప్పుచప్పులతో గ్రామంలో ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం గోవులన్నింటినీ ఒక చోట చేర్చి.. భక్తులు నేలపై పడుకుంటారు.

ఇలా చేయడం తమ ఆచారమని గ్రామస్థులు చెబుతున్నారు. ఆవులు భక్తులపై నుంచి వెళ్లిన తరువాత వారు లేచి డప్పు వాయిద్యాలకు నృత్యాలు చేయడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకుంటుంది. ఇలా చేయడంవల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకనుచూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ సంప్రదాయ వేడుకలో భక్తులెవరికి పెద్దగా గాయాలు కావని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2023-11-13T15:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising