ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Youtuber: బాబోయ్.. ఇంత డబ్బా..? ఈ యూట్యూబర్ ఇంట్లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు వెళ్తే ఏం దొరికాయంటే..!

ABN, First Publish Date - 2023-07-17T17:35:51+05:30

ప్రతిరోజూ షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్ తస్లీమ్. అతడు వివిధ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిరోజూ షేర్ మార్కెట్‌ (Share Market)కు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన యూట్యూబర్ (Youtuber) తస్లీమ్ (Taslim). అతడు వివిధ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతడి ఇంటిపై ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు (IT Raids on Youtuber Taslim). ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన తస్లీమ్ ఇంట్లో రూ.24 లక్షల నగదు దొరికినట్టు అధికారులు వెల్లడించారు.

ఐటీ అధికారుల దాడులు, ఆరోపణలపై తస్లీమ్ సోదరుడు స్పందించాడు. తమ సోదరుడిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. తస్లీమ్ ఎలాంటి తప్పులూ చేయలేదని అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ``ట్రేడింగ్ హబ్ 3.0`` (Trading Hub 3.0) ద్వారా తన సోదరుడు తస్లీమ్ షేర్ మార్కెట్ సంబంధిత వీడియోలు పోస్ట్ చేస్తుంటాడని, ఆ వీడియోల ద్వారా వచ్చే సంపాదనపై ట్యాక్స్ కూడా సక్రమంగా కడుతున్నాడని చెప్పారు. యూట్యూబ్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన రూ. 1.2 కోట్ల ఆదాయానికి ఇప్పటికే రూ. 4 లక్షల పన్ను కట్టామని తెలిపాడు.

Viral Video: పాపం.. ఈ అమ్మాయి.. కోతే కదా భయపడిపోతుందిలే అనుకుంటే.. ఇలా షాకిస్తుందని అస్సలు ఊహంచలేదు..!

తాము అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, కుట్ర ప్రకారమే ఐటీ దాడులు జరిగినట్టు అనిపిస్తోందని చెప్పాడు. తస్లీమ్ తల్లి కూడా ఐటీ దాడులపై స్పందించారు. తమ కుమారిడిని కావాలనే కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-17T17:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising