Aadhaar: ఆధార్ అప్‌డేట్ కోసం మిగిలింది 6 రోజులే.. ఫోన్లోనే ఈజీగా ఇలా చేయండి
ABN, First Publish Date - 2023-12-09T07:32:30+05:30
ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్(Aadhaar Updation) చేయడానికి ఇప్పుడు 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఢిల్లీ: ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్(Aadhaar Updation) చేయడానికి ఇప్పుడు 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరింకా ఆధార్ ని అప్ డేట్ చేయలేదా? మీ ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీని మార్చాలనుకుంటే/అప్‌డేట్ చేయాలనుకుంటే ఇదే సరైన సమయం.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిబంధనలను అనుసరిస్తూ ముందుకు సాగాలి. ఆధార్ కార్డ్ హోల్డర్‌లు ఎలాంటి డబ్బు చెల్లించకుండా MyAadhaar పోర్టల్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్ల వయస్సు పైబడిన వారికి ఆధార్ కార్డ్ అప్ డేషన్ అవసరం.
ముందుగా MyAadhaar పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
లాగిన్ కావడానికి మీకు మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అవసరం.
లాగిన్ అయిన తర్వాత, కిందకు స్క్రోల్ చేసి, ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
మీ ప్రస్తుత సమాచారాన్ని ధ్రువీకరించవచ్చు. తరువాత హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి.
అనంతరం గుర్తింపు , చిరునామా ప్రూఫ్‌లను ఎంచుకోవచ్చు. తరువాత డాక్యుమెంట్ సమాచారం స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయవచ్చు.
అప్‌లోడ్ చేయడానికి కొనసాగించాలి. ఆమోదించాల్సిన పత్రాల జాబితా వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది.
మీకు 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) వస్తుంది. ఇది అప్‌డేషన్ స్థితిని తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది.
సమాచారం అప్‌డేట్ అయిన తర్వాత, మీరు మీ కొత్త ఆధార్ కార్డ్‌ని పొందవచ్చు.
Updated Date - 2023-12-09T07:32:32+05:30 IST