ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Couture Fashion Week: ఐడియా తలకెక్కింది.. ఫ్యాషన్ తిరగబడింది!

ABN, First Publish Date - 2023-02-03T17:00:58+05:30

వెర్రి వేయి విధాలని అంటారు.. ఇప్పుడు దీనిని ఫ్యాషన్‌కు అన్వయించుకోవాల్సి వస్తోంది. అందానికి మరిన్ని రంగులు అద్దడమే ఫ్యాషన్ అయితే అదిప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: వెర్రి వేయి విధాలని అంటారు.. ఇప్పుడు దీనిని ఫ్యాషన్‌కు అన్వయించుకోవాల్సి వస్తోంది. అందానికి మరిన్ని రంగులు అద్దడమే ఫ్యాషన్ అయితే అదిప్పుడు ఆ స్థాయిని దాటేసి తలకిందులైంది. ఫ్యాషన్‌కు పుట్టినిల్లు అయిన పారిస్‌(Paris)లో ఫ్యాషన్ అర్థమే మారిపోయింది. ఫ్యాషన్ డిజైనర్లు తమకు తోచిందే ఫ్యాషన్ అన్నట్టుగా డిసైడైపోయారు. ‘వ్యతిరేక దిశ’లో వెళ్తూ ఫ్యాషన్‌ను వెర్రెక్కించేస్తున్నారు.

పారిస్‌లో జనవరి 23న ప్రారంభమైన కోచర్ ఫ్యాషన్ వీక్‌(Couture Fashion Week)లో తొలి రోజు షియాపరెల్లి(Schiaparelli), డియోర్(Dior) తమ స్ప్రింగ్, సమ్మర్ 2023 కలెక్షన్స్‌ను ప్రదర్శించాయి. డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించిన మోడల్స్ వయ్యారాలు ఒలకబోస్తూ క్యాట్ వాక్ చేశారు. ఇక ఈ ఫ్యాషన్ వీక్‌లో ప్రఖ్యాత మోడల్స్ అయిన కైలీ జెన్నర్(Kylie Jenner), డోజా క్యాట్‌(Doja Cat)లను రంగంలోకి దించి షియాపరెల్లి అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు రోజుల తర్వాత విక్టర్ అండ్ రోల్ఫ్(Viktor & Rolf) ఫ్యాషన్ హౌస్ కోచర్ ప్రజెంటేషన్‌లో క్యాట్ మళ్లీ డిఫరెంట్ లుక్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

పారిస్ ప్యాషన్ వీక్ 2023లో సెయింట్ లారెంట్, లూయిస్ విట్టన్, లుడోవిక్ డి సెయింట్ సెర్నిన్, డ్రీస్ వాన్ నోటెన్ వంటివి తమ మెన్స్‌వేర్ కలెక్షన్లను ప్రదర్శించాయి. ఇక, అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్టర్ అండ్ రోల్ఫ్ ప్యాషన్ డిజైన్స్ గురించి. ఐడియాలు కరువయ్యాయేమో.. మోడల్స్‌తో డ్రెస్సులను తిరిగేసి, అడ్డదిడ్డంగా తొడిగించేసి నడిపించేసింది. ఫ్యాషన్ వీక్‌కు హాజరైనవారు మోడల్స్‌ను చూసి తొలుత తలకిందులుగా నడుస్తున్నారేంటబ్బా అనుకున్నారు. కానీ దగ్గరకొచ్చాక చూస్తే డ్రెస్సే తిరగేసి వేసుకున్నట్టు గుర్తించి షాకయ్యారు. వారే కాదు, ఆ ఫ్యాషన్‌ వీక్‌ను లైవ్‌లో వీక్షిస్తున్న వారు, సోషల్ మీడియాలో వాటిని చూసిన వారు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఐడియాలు రాకపోతే మాత్రం ఇదెక్కడి ఫ్యాషన్ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

30 వేల క్రిస్టల్స్‌తో ‘క్యాట్’

ఈ ఫ్యాషన్‌ వీక్‌లో మరో ఆకర్షణ డోజా క్యాట్(Doja Cat). శరీరం నిండా 30 వేల స్వారోవ్‌స్కీ క్రిస్టల్స్(Swarovski crystals ) ధరించి వయ్యారాలు పోయింది. ఈ ఫ్యాషన్ వీక్‌లో అందరినీ ఆకర్షించిన విషయం ఏదైనా ఉందీ అంటే అది డోజా క్యాటే. శరీరం నిండా రెడ్ పెయింట్, రెడ్ డ్రెస్‌తో ఎర్రగా కనిపించిన ఆమెను అలా తీర్చిదిద్దేందుకు డిజైనర్లు గంటలకొద్దీ శ్రమించారు. ఒక్క కళ్లు తప్ప ఆమె మొత్తం ఎర్రగా దర్శనమిచ్చింది. డోజా క్యాట్ మేకింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆమె విషయాన్ని పక్కన పెడితే తలకిందులుగా కనిపించిన ఫ్యాషనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-02-03T17:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising