ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Longest Beard: గడ్డం చూసుకొని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. గిన్నిస్ రికార్డ్ కొట్టిన ‘ఆమె’

ABN, First Publish Date - 2023-08-13T17:44:14+05:30

మనకు కాలం కలిసి రానప్పుడు.. కాలానికి అనుగుణంగా నడుచుకోవడమే ఉత్తమం. పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటే.. జీవితం సాఫీగా సాగడంతో పాటు అనూహ్య మలుపులు తీసుకునే..

మనకు కాలం కలిసి రానప్పుడు.. కాలానికి అనుగుణంగా నడుచుకోవడమే ఉత్తమం. పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటే.. జీవితం సాఫీగా సాగడంతో పాటు అనూహ్య మలుపులు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. ఈ మహిళ జీవితమే. ఎంత ప్రయత్నించినా తనకున్న రోగం నయం కాకపోవడంతో.. దాంతోనే సహజీవనం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడదే ఆమెకు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.

ఆ మహిళ పేరు ఎరిన్ హనీకట్. అమెరికాలోని మిచ్‌గాన్‌కు చెందిన ఆమె వయసు 38 సంవత్సరాలు. ఆమెకు పాలిసిస్టిక్‌ ఓవెరియన్‌ సిండ్రోమ్‌(PCOS) అనే వ్యాధి ఉంది. ఈ సిండ్రోమ్‌ వల్ల జుట్టు విపరీతంగా పెరిగిపోవడమే కాదు.. పీరియడ్స్‌ సజావుగా రాకపోవడం, బరువు పెరగడం, సంతానలేమి లాంటి సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమెకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ముఖంపై గడ్డం పెరగడం ప్రారంభమైంది. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఎరిన్ ఎన్నో చికిత్సలు చేయించుకుంది. పెరుగుతున్న జుట్టును కంట్రోల్ చేసేందుకు షేవింగ్, వ్యాక్సింగ్ వంటివి తరచూ చేసేది. ఒక్కసారైతే రోజుకు మూడుసార్లు షేవింగ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి.


ఇది చాలదన్నట్టు.. ఒక యాక్సిడెంట్‌లో ఎరిన్ కాలికి గాయం అయ్యింది. దానికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. అది శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపింది. ఏళ్లు గడిచేకొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో.. ఎరిన్ మానసికంగా ఎంతో కుంగిపోయేది. ఇలాంటి తరుణంలో వైద్యులు ఆమెకు ఒక సూచన ఇచ్చారు. ‘‘అయ్యేదేదో ఎప్పటికైనా అవుతుంది. టెన్షన్స్ అన్నీ పక్కనపెట్టేసి.. జీవితంలో ముందుకుసాగిపో’’ అని ధైర్యం నూరిపోశారు. ఇక అప్పటి నుంచి ఆమె పరిస్థితులకు అనుగుణంగా జీవించడం మొదలుపెట్టింది. తనని అనారోగ్య పరిస్థితులు చుట్టుముట్టినా, చెక్కు చెదరకుండా ముందుకు సాగిపోయింది.

ఇలా గత రెండేళ్ల నుంచి జుట్టుని కత్తిరించడం మానేయడంతో.. ఎరిన్ గడ్డం ఇప్పుడు 30 సెంటిమీటర్లు పెరిగింది. ఫలితంగా.. అతిపెద్ద గడ్డం కలిగిన మహిళగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన 75 ఏళ్ల వివియన్‌ వీలర్‌ పేరిట ఉండేది. ఆమె గడ్డం 10.04 అంగుళాలు ఉండేది. అయితే.. ఎరిన్ అంతకుమించి 11.8 అంగుళాల గడ్డం పెంచి, ఆ ముసలావిడ రికార్డ్‌ను బద్దలుకొట్టింది. చూశారుగా.. పరిస్థితులు అనుకూలించడం లేదని బాధపడటం కన్నా, ముందుకు సాగిపోవడం వల్ల ఎరిన్ ఎక్కడికి చేరిందో. కాబట్టి, సమస్యల్ని చూసి ఎవ్వరూ కుంగిపోవద్దు.

Updated Date - 2023-08-13T17:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising