Vaarasudu: వెనక్కి తగ్గిన దిల్ రాజు.. మూడు రోజుల ఆలస్యంగా..
ABN, First Publish Date - 2023-01-09T11:04:56+05:30
గత కొంతకాలంగా సంక్రాంతి సినిమాల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా సంక్రాంతి సినిమాల విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాలైన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’లకి కాకుండా తమిళ డబ్బింగ్ సినిమా అయినా ‘వారసుడు’ (Vaarasudu)కి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారని రచ్చ జరిగింది. దీంతో కొన్ని రోజులుగా తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy) నటించిన ‘వారసుడు’ సినిమా విడుదల విషయంలో దిల్ రాజు (Dil Raju) వెనక్కి తగ్గాడని ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ తాజాగా ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన మూవీ రిలీజ్ డేట్‌ని మారుస్తున్నట్లు ప్రకటించారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘నాలుగైదు రోజుల నుంచి ఈ చిత్రం విడుదల గురించి వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. నేను ఈ సినిమాని సంక్రాంతి ‘వారసుడు’ గానే తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను. జనవరి 14న తెలుగు వెర్షన్‌ని విడుదల చేస్తాం. అయితే తమిళ వెర్షన్ ‘వారిసు’ (Varisu) మాత్రం జనవరి 11నే విడుదల అవుతుంది. ఈ సినిమాతో సూపర్‌హిట్ కొట్టబోతున్నాం. అందుకే విడుదల తేది మారిన సమస్య లేదు. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం.
నేను ఎందుకు వెనక్కి తగ్గుతున్నానని అందరూ అడుగుతున్నారు. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. ఆ సినిమాలకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందరూ నిర్మాతలు బాగుండాలి అని నేను అనుకుంటున్నాను. కానీ అందరూ నా మీద అందరు పడి ఏడుస్తున్నారు. నన్ను టార్గెట్ చేస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. దాంతో నాకు సమస్య లేదు. అందుకే వెనక్కి తగ్గుతున్నా’’ అని చెప్పుకొచ్చాడు.
Updated Date - 2023-01-09T12:38:38+05:30 IST