Woman carries disabled spouse : మరో సావిత్రి మన విమ్లా.., ఈ బంధానికి వెనుకున్నదీ ప్రేమే.. !

ABN, First Publish Date - 2023-02-08T23:26:27+05:30

నరాల సంబంధిత వ్యాధితో ఆమె భర్త బదన్ సింగ్ కుడికాలు పనిచేయడం మానేసింది.

Woman carries disabled spouse : మరో సావిత్రి మన విమ్లా.., ఈ బంధానికి వెనుకున్నదీ ప్రేమే.. !
valentine week 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహం బంధంలోనూ ప్రేమదే అత్యంత ప్రధానమైన పాత్ర. ఎన్ని చిక్కులు, చికాలు వచ్చి పడినా ఓ ఇద్దరు ఒకే గూటిలో కలిసి ఉంటున్నారంటే దాని వెనుక ప్రేమపాళ్ళు ఎక్కువే ఉన్నట్టు. వివాహంతో మూడు ముళ్ళతో ఏడు అడుగులతో కలిసిన బంధానికి ప్రేమ ప్రాణమై ఆ ఇద్దరినీ ఒక్కటిగా చేసిందనే. ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ అనుబంధమే నడిపిస్తుంది. బిడ్డల్ని సాకి, ఇంటిని చక్కదిద్దే సామర్థ్యాన్ని ఆమెకు ఇస్తే.. ఇంటిని నడిపి అందరినీ పోషించే శక్తిని అతనికి ఇస్తుంది. ఇద్దరిదీ ఒకే మాటై, ఒకే బాసై సాగిపోయే జీవితాల మొదటి, ఆఖరి మజిలీ మళ్ళీ ప్రేమే..

 

మధుర ఉత్తరప్రదేశ్ లోని మధుర సమీపంలోని గీత విహార్ లో ఉంటున్న ఇంటి నుంచి ప్రతిరోజూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి విమ్లా దేవి తన భర్తను తన వీపు మీద ఎక్కించుకుని దీక్షగా నెలల తరబడి ఆరోగ్య కేంద్రానికి అలుపులేకుండా తిరుగుతూనే ఉంది. నరాల సంబంధిత వ్యాధితో ఆమె భర్త బదన్ సింగ్ కుడికాలు పనిచేయడం మానేసింది. అయితే విమ్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉచిత వీల్ చైర్ కు పొందేందుకు వైకల్య ధృవీకరణ పత్రం అవసరం అనేసరికి విమ్లా దానిని పొందేందుకు నెలల తరబడి మధురలోని ఆరోగ్య కేంద్రం చుట్టూ తిరిగింది. తన బాధను చూసిన స్థానిక వార్తా సంస్థ విషయం ఏంటని అడిగితే తన బాధను చెప్పుకొచ్చింది విమ్లా. భర్తను రోజంతా వీపు మీద వేసుకుని తిరగడం కష్టంగా ఉంది. ఆ కష్టం ఉచితంగా ఇచ్చే వీల్ చైర్ తో తగ్గుతుందని అంది పొందాలంటే వైకల్యం ఉన్నదనే పత్రం కావాలని చెప్పారు. అందుకే ఇలా తిరుగుతున్నాను. అయినా ఇప్పటికీ నాకు ఆ సర్టిఫికేట్.

 

చివరకు విమ్లా పోరాటానికి ఫలితం దక్కింది, ఆమె భర్త బదన్ సింగ్‌ను తన వీపుపై మోస్తున్న హృదయాన్ని కదిలించే చిత్రం, విస్తృతంగా  ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడటంతో.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి భూపేంద్ర చౌదరి "నాగరిక దేశంలో ఇది సిగ్గుచేటు" అని అన్నారు. ఆ దంపతులకు తనవంతు సాయం చేస్తానని మంత్రి తెలిపారు. చివరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ విమల భర్త బదన్ సింగ్ కు వైకల్య ధ్రవీకరణ పత్రం ఇచ్చారు. విమ్లా, బదన్ సింగ్ చక్కని అన్యోన్యతకు సలామ్ చేస్తూ.. విజయం సాధించిన జంట కథ ఇది.

Updated Date - 2023-02-09T14:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising