ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Happy Chocolate Day 2023: వాలెంటైన్ వీక్ లో చాక్లెట్ కథలోకి వెళితే...!

ABN, First Publish Date - 2023-02-09T09:35:04+05:30

స్పెయిన్ ప్రపంచానికి తెలియకుండా చాక్లెట్‌ను రహస్యంగా ఉంచింది.

Happy Chocolate Day 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమను తెలపకోవడానికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సెలబ్రెట్ చేసుకుంటారు. ఒకరి పట్ల మీకున్న అభిమానాన్ని వ్యక్తపరిచే ఈ రోజు. వాలెంటైన్స్ డేకి ముందు వచ్చే వారం కూడా ప్రత్యేకమైనదే.. దీనినే వాలెంటైన్స్ వీక్‌గా జరుపుకుంటారు. ఇది ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుతో ఈ ప్రేమ వేడుకలు ముగుస్తాయి.

వాలెంటైన్స్ డే 2023

వాలెంటైన్స్ డే భావన రోమన్ పండుగ లుపెర్కాలియా నుండి వచ్చింది, దీనిని ఫిబ్రవరి 13-15 వరకు జరుపుకుంటారు. ఈ రోజున, పురుషులు మేక లేదా కుక్కను బలి ఇచ్చేవారట. ఇది స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతుందని నమ్మేవారు. దీనిని అనుసరించి, యువతులు లాటరీ విధానంలో ఒక వ్యక్తితో జతకట్టడానికి వారి పేర్లను ఒక కలశంలో ఉంచేవారు. కొన్ని జంటలు ఈ రోజు తర్వాత పెళ్లి కూడా చేసుకునేవారు. ఇది చాలా హింసతో కూడుకున్న పనైనా వారికి ఇదో సాంప్రదాయంగా వస్తుంది. కొన్ని చోట్ల 5వ శతాబ్దం తరువాత ఈ ఆచారాన్ని రద్దు చేసారు. దాని స్థానంలోనే పోప్ గెలాసియస్ సెంయింట్ వాలెంటైన్స్ డేని ప్రారంభించారు.

సెయింట్ వాలెంటైన్ ఒక పూజారి, అతను రహస్యంగా వివాహం చేసుకోవడంలో జంటలకు సహాయం చేశాడు. ఆ సమయంలో పాలించిన రోమన్ చక్రవర్తి క్లాడియస్ II, సైనికులు వివాహం చేసుకోవడానికి అనుమతించలేదు. పాలకుడి ఆదేశాల మేరకు సెయింట్ వాలెంటైన్ శిరచ్ఛేదం చేయబడ్డాడు.

వాలెంటైన్స్ వీక్

వాలెంటైన్స్ డే సంవత్సరంలో అత్యంత రొమాంటిక్ డే. కానీ ప్రేమికులు వాలెంటైన్స్ వీక్ అంతా ప్రేమను తెలుపుకుంటారు. ప్రేమికుల వారంలోని ప్రతి రోజు ప్రేమ చాలా రూపాల్లో తెలుపుకుంటూ ఉంటారు. ఇది ఫిబ్రవరి 7 న రోజ్ డేతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే , కిస్ డే ఉంటాయి. ప్రేమజంటలు, ఈ వారంలో, తమ భాగస్వాములను ఆకర్షించడానికి ప్రత్యేకమైన ఆలోచనలతో చేస్తారు. గులాబీలు, టెడ్డీ బేర్స్, గ్రీటింగ్ కార్డ్‌లు, చేతితో రాసిన నోట్స్, చాక్లెట్‌లు ఈ వారం జరుపుకునే కొన్ని వేడుకలు.

వాలెంటైన్స్ డే నాడు మాత్రమే కాకుండా ప్రేమను ఎప్పుడైనా తెలపచ్చు. వాలెంటైన్స్ వారంలో రెండవ రోజు ఫిబ్రవరి 8 తర్వాత చాక్లెట్ డేని ప్రేమ వారంలో మూడవ రోజున జరుపుకుంటారు. స్వయంగా ప్రేమగా తయారు చేసిన చాక్లెట్లతో విందు ఇచ్చేందుకు ఇష్టపడతారు.

చాక్లెట్ పురాణంలోకి వెళితే...

1528లో అన్వేషకుడు హెర్నాన్ కోర్టేస్ తన స్వస్థలమైన స్పెయిన్‌కు కోకో మొక్కను తీసుకువచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం, కోర్టెస్ బంగారం కోసం వెతుకుతున్నప్పుడు అమెరికాలో చాక్లెట్‌ను కనుగొన్నారు. అన్వేషకుడికి బంగారానికి బదులుగా అజ్టెక్ చక్రవర్తి అతనికి ఒక కప్పు కోకో ఇచ్చాడట. స్పెయిన్‌లో, చేదు చాక్లెట్‌కు తేనె, చక్కెర కలిపి తీపి రుచిని అందించారు. చాక్లెట్ తీపి రుచిచూసిన తర్వాత, దాని ప్రజాదరణ వేగంగా పెరిగింది. చాక్లెట్ ధనవంతుల ఫ్యాన్సీ డ్రింక్‌గా మారింది. ఇది ఎంతగానో నచ్చింది, కాథలిక్ సన్యాసులు కూడా మతపరమైన ఆచారాలకు దీనిని తాగేవారు.

యూరోపియన్లు చాక్లెట్‌ను ఎలా కనుగొన్నారు.

1615 వరకు స్పెయిన్ ప్రపంచానికి తెలియకుండా చాక్లెట్‌ను రహస్యంగా ఉంచింది. ఫ్రెంచ్ రాజు లూయిస్ 13వ స్పానిష్ రాజు ఫిలిప్ 3వ కుమార్తె అయిన ఆస్ట్రియాకు చెందిన అన్నేని వివాహం చేసుకున్నాడు. రాణి ఫ్రాన్స్ రాజ స్థానానికి చాక్లెట్లు తెచ్చింది. దీని తరువాత, దేశం మొత్తం భూమధ్యరేఖ వెంబడి కోకో తోటలను ప్రారంభించింది. అలా ప్రచుర్యంలోకి వచ్చింది చాక్లెట్. ఐరోపాలోని రాజ కుటుంబీకులు ఆరోగ్య ప్రయోజనాల కోసం చాక్లెట్‌ను వినియోగించారు, అలాగే చాక్లెట్ చరిత్ర కొనసాగుతోంది, ఎందుకంటే ఈ ట్రీట్ యూరోపియన్ కులీనుల మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. రాజ కుటుంబీకులు , ఉన్నత వర్గాలవారు చాక్లెట్‌ని దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగించారన్నమాట.

చాక్లెట్ బార్లు ఎలా వచ్చాయంటే..

ఇప్పటి వరకు, చాక్లెట్‌ను ద్రవ రూపంలో మాత్రమే తీసుకుంటారు. ఈ బార్‌లు 1828 తర్వాత మాత్రమే వచ్చాయి. పారిశ్రామిక విప్లవం వినూత్నమైన పరికరాలను తీసుకువచ్చింది, ఇవి వేయించిన కోకో గింజల నుండి కోకో వెన్నను పిండగలిగేలా మంచి కోకో పౌడర్‌ను చేస్తారు. పౌడర్‌ను ద్రవాలతో కలిపి ఒక అచ్చులో పోస్తారు, అక్కడ అది తినదగిన చాక్లెట్ బార్‌గా గడ్డకడుతుంది.

జోసెఫ్ ఫ్రై 1847లో మొట్టమొదటి ఆధునిక చాక్లెట్ బార్‌ను తయారుచేయడానికి వెనుక ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. 1868 నాటికి, క్యాడ్‌బరీ అనే చిన్న కంపెనీ ఇంగ్లాండ్‌లో చాక్లెట్ క్యాండీల పెట్టెలను విక్రయిస్తోంది. మిల్క్ చాక్లెట్ కొన్ని సంవత్సరాల తర్వాత మార్కెట్‌లోకి వచ్చింది, ఇది నెస్లే అనే మరొక కంపెనీచే మార్గదర్శకత్వం చేయబడింది. అంటే చాక్లెట్ 4,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందన్నమాట. కానీ ఇది ఔషధంగా ప్రారంభించి, తర్వాత ఒక దివ్యమైన పానీయం తయారై ఆ తర్వాత గృహస్తులకు ఇష్టమైన చాక్లెట్ గా మారింది.. అదీ మన చాక్లెట్ కథ.

Updated Date - 2023-02-09T09:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising