ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

valentine week 2023:మతం మారకుంటే ఆమెది ప్రేమే కాదు.. నిఖా చేసుకోవాల్సిందే..!

ABN, First Publish Date - 2023-02-11T21:51:46+05:30

మాకు చేతనైనా సహాయం చేస్తుంటాం. ఇదంతా ఎందుకంటే రేవు వెనక్కి తిరిగి చూస్కుంటే మనకంటూ జీవితం ఉండాలి మనం ఉన్నంతకాలం పది మందికి తోడుగా ఉండాలి.

valentine week 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమకి కులమతాల భేదాలు లేవు. ప్రేమ అనిర్వచనీయమైనది. స్వచ్ఛమైనది. ఇదంతా మాటలవరకే పరిమితమైపోతుందా? ప్రేమించి పెళ్లాడిన వాళ్ళకు తల్లిదండ్రులే శత్రువులైతే.. ప్రేమించడం నేరంగా చూస్తున్న తల్లిదండ్రుల దృష్టికోణం మారెదెప్పుడు? మతం మారితేనే కోడలవుతుందని, ముస్లిం అయితే మోసగిస్తాడనే భ్రమలు ఎప్పుడు తొలగిపోతాయి. ఈ కథలోకి వెళితే ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, పోటీపడి చదివారు, చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్ళే లోపు స్నేహానికి అడ్డురాని మతాలు, కులాలు పెళ్ళికి ముళ్ళ కంచె వేశాయి, ఎదిరించారు. ఇబ్బందులను ఎదుర్కున్నారు. ఐదేళ్ళవుతున్నా కుల మతాల జాడ్యాలు వదలని పెద్దల పట్టింపులు అలాగే రావణకాష్టంలా రాజుకుంటూనే ఉన్నాయి. ప్రేమకు హద్దులులేవని మాటలలో చెప్పేవారంతా లోలోపల కూరుకుపోయిన కులమతాల దూరాలను ఎప్పటికైనా చెరిపేస్తారని ఈ ప్రేమజంట షారిక్, లక్ష్మీ చంద్రిక కోరుకుంటున్నారు. మనసును మెలితిప్పే ఈ ప్రేమకథను ప్రేమికుల రోజు సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ మీ ముందుకు తెస్తుంది.

నా పేరు లక్ష్మి చంద్రిక (హిందూ- బ్రాహ్మిన్) మా ఆయన పేరు షారిక్ ( గౌస్ మోహిద్దీన్). మాది మతాంతర వివాహము. మా ఇద్దరిది ఆంధ్రాలో వెస్ట్ గోదావరి పాలకొల్లు. మేము ఇంటర్ ఒకటే కాలేజీలో చదివాం. చిన్నతనం నుండి చదువులో ఇద్దరం టాపర్స్. ఇంటర్లో పోటాపోటిగా చదివేవాళ్ళం. నాకు తను మంచివాడు బాగా చదువుతాడనిపించింది 1st ఇయర్ నుండే తన మీద ఒకరకమైన ఇష్టం కలిగింది(love at first sight) ఇది ఎవరికీ చెప్పకుండా నాలో నేను అతన్ని ఇష్టపడుతూ, ఆరాధిస్తూ ఉండేదాన్ని. రెండేళ్లలో ఒకసారి కూడా మాట్లాడకుంది లేదు. ఇదంతా అట్రాక్షన్‌నే‌మో అని నాకు నేను అనుకునే దాన్ని. కానీ కాలేజీ అయిపోయేసరికి అది ప్రేమని ఇంత మంచివాడిని మిస్ అవ్వకూడదని ఎలాగోలా అతని నెంబర్ సంపాదించి ప్రొపోజ్ చేశా. మా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేశారు. తను వెంటనే నా ప్రేమను నమ్మలేదు ఎదో సరదాకి అనుకున్నాడు. అప్పటికి తనకు ప్రేమపై నమ్మకం లేదు. అప్పటికి ఎవరిదగ్గరా ఫోన్స్ లేవు. కాయిన్ బాక్స్ తోనే ఫోన్ చేసేదాన్ని. మొదట్లో తాను మాట్లాడలేదు కానీ నాకు అదే నచ్చింది, వెంటనే అమ్మాయి ప్రొపోజ్ చేసిందని ఒప్పుకోకుండా వాళ్ళ ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచించాడు. ఆరు నెలల తరువాత ప్రొపోజ్ చేసాడు. ఆ తరువాత మేము ఇంజనీరింగ్‍లో జాయిన్ అయ్యాం. మా ర్యాంక్స్ వల్ల వేరు వేరు కాలేజీల్లో సీట్స్ వచ్చాయి. అపుడు డిసైడ్ అయ్యాం ఎలాగైనా మనం పెళ్లి చేసుకోవాలని. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా పోరాడాలని.

నేను మా వాళ్లకు ఒక్కదాన్నే కూతురిని. మా పేరెంట్స్ ది ప్రేమ వివాహమే కానీ వాళ్లిద్దరూ ఒకటే బ్రాహ్మణ కులం. సో వాళ్లు అర్ధం చేస్కుంటారానే ఉద్దేశ్యంతో మాఅమ్మకి చెప్పాను. అమ్మ అర్థం చేసుకున్నట్టే ఉన్నా తిట్టేవారు. మా నాన్నగారికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి ద్వారానో తెలియడం ఇష్టం లేక నేనే మా విషయం చెప్పేసాను. నాన్నగారు మొదట్లో బానే ఉన్నా, నా విషయం వచ్చేసరికి తిట్టడం, కొట్టడం చేసేవారు. ఆయనకు ముస్లిం షారిక్ ముస్లిం అనేదే ప్రాబ్లెమ్.. వాళ్లు గొడ్డు మాంసం తింటారు, బురఖా వేసుకుంటారు, మంచిగా ఉండరు అనేవి ఆయన అభ్యంతరాలు. ప్రేమించి పెళ్ళి చేసుకుని జీవితాన్ని పంచుకున్న మా పేరెంట్స్ అర్థం చేసుకోకపోయేసరికి ఏం చెయ్యాలో తెలీలేదు.

ఎవరో చేప్పిన మాటలు విని తనపై నాన్న చేయి కూడా చేసుకున్నారు. తన ఫోన్ లాగేసుకున్నారు ఇంతా చేసి మా ఇంటి మీదుగా వెళ్తున్నాడనే కారణంతో అలా ప్రవర్తించారు. చదువు మనిపించేదాం అనుకున్నారు, కానీ బాగా చదివే నన్ను మానిపించొద్దని అమ్మ కొంచెం సపోర్ట్ చేసేది. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని మాటలు పడ్డా, నేను మాత్రం తనపై నమ్మకంతో ధైర్యంగా ఉండేదాన్ని. ఇక వాళ్ల ఇంట్లో వాళ్లు అంతగా ఆర్ధికంగా పరిస్థితులు బాగుండేవి కాదు. తన అన్నయ్యకు నన్ను ఒక ఫ్రెండ్‌గా పరిచయం చేసాడు. వాళ్ళ ఇంటికి తీసుకువేళ్ళే వాడు. కానీ వాళ్ళ ఇంట్లో అనుమానం‌గానే ఉన్నా ఎప్పుడూ ఏం అడగలేదు. మేము ఇంజనీరింగ్ అయ్యాక జాబ్స్ కోసమని హైదరాబాద్ వచ్చాము. మా నాన్న గారికి ఇష్టం లేకున్నా ఎదో ఒప్పించి హైదరాబాద్‌కి వచ్చి ఒక మంచి softwareకంపెనీలో జాయిన్ అయ్యాను. షారిక్ మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు..

జాబ్స్ రాగానే మంచి సమయం చూసుకుని ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పాము. నాన్న నీఇష్టం వచ్చింది చేస్కో మనల్ని వదిలేయ్ మాకేం చెప్పకు అన్నారు. మా అమ్మ ఇన్ని ఇయర్స్‌గా నా బాధని, ప్రేమని చూసి ఒప్పకుందాం అన్నా, నాన్న వలన ఏమి చెప్పలేక నీ ఇష్టం కానీ ఆలోచించుకో అంది.

నేను మతం మారాలనే ఆలోచన వాళ్ళ ఇంట్లో ఉండేది. అది కుదరదని చాలా నిక్కచ్చిగా చెప్పేసాం. సరదాగా ఉండే వాళ్ల పేరెంట్స్ ఈవిషయం తరవాత మారిపోయారు. మతం మారానిదే మేము పెళ్ళికి ఒప్పుకోము అన్నారు. వాళ్ల అన్నయ్య పేరెంట్స్‌కే సపోర్ట్ చేసాడు.. ప్రేమించుకున్నప్పుడు ఎప్పుడూ మా మధ్య మతం పేరు రాలేదు కానీ ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఆమెకు జీతం ఎక్కువ, నీకు తక్కువ రేపు నిన్ను కొట్టి పని చేయిస్తుంది అన్నారు. ఆమెకు వంట రాదు, ఏం రాదు ఇబ్బంది పడతారు. మీకు పిల్లలు పూడితే ఏం చేస్తారు. మమ్మల్ని పూడుస్తావా? కాలుస్తావా? అని అడిగారు. తనను నువ్వు మారిపోతావ్.. హిందూ ఐపోతావ్ అని తిట్టారు. ఆమెది ప్రేమే కాదు మతం మారకుంటే అన్నారు. అది నాకు ఇష్టం లేదు తాను తనలాగానే నాకు ఇష్టం అని షారిక్ అన్నా వినలేదు.

ఎన్ని జరిగినా పేరెంట్స్ మధ్యలో గొడవలు రాకూడదని అనుకున్నాం.. కానీ షారిక్ పేరెంట్స్ మా నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయి మాకు ఇష్టమే, కానీ అమ్మాయి మతం మారాలి తరువాత ఏం ప్రాబ్లెమ్ రాదనీ మీరు సంతకంచేయాలని‌ మా పేరెంట్స్‌ని అడిగారు. నా పేరెంట్స్ ఇలా ఫోన్ చేసేసరికి భయపడ్డారు. "ఇందుకే ముస్లిమ్స్ వద్దన్నది నువ్వు ఒక మంచి క్లాసికల్ డాన్సర్‌వి నీకు మంచి పేరుంది నువ్వలా మతం మరి చేసుకుంటే నీకు ముస్లిమ్‌ల బ్రతకల్సి వస్తుంది అన్ని వదిలేసి నీకు నచ్చితే వెళ్లి చేస్కో మారిపో" అన్నారు.

రెండు నెలలు తిండి లేదు, నిద్ర లేదు, వాలింట్లో గొడవలు, మా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, మొత్తానికి మా ఫ్రెండ్ ఒప్పించాడు అందరినీ. అయితే నువ్వు నిఖా చేసుకోవాలి, పేరు మర్చి ముస్లిం పద్దతిలోనే పెళ్ళి చేసుకోవాలి అన్నారు. ఇన్ని గొడవల మధ్య డబ్బు ప్రసక్తి కూడా తెచ్చారు. నీ మానాన నువ్వు పెళ్ళి చేసుకుని వెళిపోతే మా సంగతి ఎవరు పట్టించుకుంటారు. మాకు కాస్త డబ్బులు ఇచ్చి వెళ్ళి పెళ్లి చేసుకోమని షారిక్ వాళ్ళ తల్లిదండ్రులు అనేసరికి అప్పటివరకూ డబ్బుల ప్రసక్తి రాని మామధ్య అదీ వచ్చి చేరింది. ఆఫీస్‌లో లోన్ పెట్టి వాళ్లకు డబ్బులు ఇచ్చి పెళ్ళికి సిద్ధం అయ్యాం. అలా 2017 డిసెంబర్ 8న రిజిస్టర్ మ్యారేజ్ చేస్కుని దండాలు మార్చకున్నాం. ఈవెనింగ్ రిసెప్షన్ పెట్టుకుని ఫ్రెండ్స్‌ని ఆఫీస్ వాళ్ళని పిలిచి చాలా ఘనంగా మా పెళ్లి మేము అనుకున్నదాని కంటే బాగా చేసుకున్నాం. కానీ మా పేరెంట్స్, తన పేరెంట్స్ ఎవరూ రాలేదు కేవలం వాళ్ళ అన్నయ్య మాత్రమే వచ్చాడు.

పెళ్ళి నాటి నుంచి ప్రతి నెలా ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ల పేరెంట్స్‌కి డబ్బులు పంపుతూనే ఉన్నాం. మా పేరెంట్స్ కి ఫైనాన్సియల్ హెల్ప్ అవసరం లేదు. నెమ్మదిగా అమ్మ షారిక్‌ని అర్థం చేసుకుంది. కానీ మా నాన్నలో మాత్రం మార్పు ఇప్పటికీ లేదు. ఆయన మనసులో షారిక్ ముస్లిం అనే మాట స్థిరపడిపోయింది. చుట్టాల్లో నన్ను తను బాగా చూసుకుంటాడనే నమ్మకం కలిగింది కానీ ఈయనకు మామీద నమ్మకం రాలేదు. పెళ్ళయి ఐదేళ్ళు అవుతున్నా ఇంకా అదే ధోరణిలో ఆయన ఉండిపోయారు. ఐదేళ్ళవుతున్నా షారిక్ ఇంట్లోనూ అదే పరిస్థితి.. వాళ్ల చుట్టాల్లో ఏదైనా పెళ్ళయితే బొట్టు తీసేసి రావాలంటారు. నాకు అది ఇష్టం లేదని ఎంత చెప్పినా అర్థంచేసుకోరు. మా ప్రేమ వివాహం వల్ల ‌షారిక్ అన్నయ్యకు పెళ్ళికావడం లేదనేది మరో అపవాదు.. మొత్తానికి వాళ్ల అన్నయ్య పెళ్ళి జరిగినా అక్కడా అవే చీత్కారాలు. మా ఇంట్లో అన్ని పండగలూ చేసుకుంటాం దీపావళి, రంజాన్, క్రిస్మస్ కూడా జరుపుకుంటాం. తను నమాజ్ చేసుకుంటాడు. ఒకరి మతాన్ని ఒకరం ఒకరి భావాన్ని ఒకరం అర్ధం చేసుకుంటాం. షారిక్ ముస్లిం అని కొంతమంది ఇల్లు కూడా ఇవ్వలేదు. నన్నయితే బ్రాహ్మిన్ అయ్యే ఇలా చేశావని బయట సొసైటీలో చాలామంది తిట్టారు.

మేము ఇద్దరం కాలేజీ రోజుల్లోనే చాలా సోషల్ ఆక్టివిటీస్ చేసేవాళ్ళం.. అనాధ శరణయాలకి వెళ్లడం ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్లి వాళ్ళతో టైం స్పెండ్ చేసే వాళ్ళం.. ఇప్పుడు కూడా చేస్తున్నాం. మల్టీపుల్ సోషల్ ఆర్గనైశాషన్ ఫౌండేషన్ లో జాయిన్ అయ్యాం. బ్లడ్ డొనేషన్, విమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఫీజు, ఇలా చాలా వాటిల్లో ఆక్టివ్ ఉంటాం.Hhn Foundation, Litbyhumanity, Asya Foundation Bethechange వాటిల్లో ఆక్టివ్ వాలంటీర్స్ ఉన్నాం. మాకు చేతనైనా సహాయం చేస్తుంటాం. ఇదంతా ఎందుకంటే రేవు వెనక్కి తిరిగి చూస్కుంటే మనకంటూ జీవితం ఉండాలి మనం ఉన్నంతకాలం పది మందికి తోడుగా ఉండాలి.

ఈ మధ్యనే కుల మత నిర్ములన సంఘం ఈవెంట్లో ఇద్దరం చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాం. అది ఫేస్బుక్‌లో పెడితే చాలా మంది తిట్టారు, నువ్వు బ్రాహ్మిన్ వేనా, సిగ్గులేదా వాడు నిన్ను చంపేస్తాడు, నరికేస్తాడు. అని చాలా దారుణంగా తిట్టారు.. నిజంగా ప్రేమ వివాహాలు ఫెయిల్ అవడానికి కారణం సమాజం కూడా కారణమే,. వాళ్ళ మాటలతోనే సగం చంపేస్తారు. అవమానిస్తారు. పేరెంట్స్ ఒకరకమైతే, సమాజం చూసే హీనమైన చూపులు ఒకరకం. అడుగడుగునా అవమానాలు, చీత్కారాలమధ్య నిత్యం దినదినగండం, నూరేళ్ళ ఆయుష్షులా మాలా ఎందరో ప్రేమికులు కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్క మా విషయమనేకాదు, మాలా ప్రేమ వివాహం చేసుకుని అభిరుచిల్ని, ఆనందాన్ని పంచుకునే వారిని జీవితంలోకి తెచ్చుకున్నాకా తల్లిదండ్రులు అర్థంచేసుకోకపోతే అది చాలా నరకం, ఎన్ని ఉన్నా ఏదో వెలితి వెంటాడుతూనే ఉంటుంది. నిజానికి మేం చేసిన నేరం ఏంటని గట్టిగా అడగాలనిపిస్తుంది. నచ్చిన జీవితాన్ని అందుకోవడం ఇంత నేరమా? తల్లిదండ్రులే కాదు, చుట్టూ సమాజం కూడా అలాగే ఉంది. ఎప్పటికి వీళ్లలో మార్పు వస్తుందో.. పైగా మతం, కట్టు బొట్టు మారితే మా మనిషని, లేదంటే వద్దనే పెద్దల మధ్య నిత్యం నలిగిపోయే వారు మాలానే ఎందరో, ఈ ధోరణిలో ఇకపైనన్నా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.

-శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2023-02-13T11:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising