Valentines Day: రియల్ లైఫ్ క్రేజీ ప్రేమ కథలు..!
ABN, First Publish Date - 2023-02-11T23:49:34+05:30
ప్రేమించినా పిరికిగా మారి సాధించుకోలేక మధ్యలోనే వదిలేస్తారు.
నిజజీవితంలో ప్రేమను అందుకోవడం అంటే పెద్ద సవాలే.. ఎన్ని త్యాగాలు చేయాలి, ఎన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. ఎందరి హృదయాలను నొప్పించాలో అనే మీమాంసలో కొందరు ప్రేమ జోలికే పోరు. మరికొందరు ప్రేమించినా పిరికిగా మారి సాధించుకోలేక మధ్యలోనే వదిలేస్తారు. ఇక సినిమా తరహాలో క్షణాల్లో పుట్టి, రోజుల్లో మాసిపోయే ప్రేమలు మరికొన్ని. వీటి మధ్య నిజమైన ప్రేమ ఎప్పుడూ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది. ప్రేమ పవిత్రమైనది. గొప్ప ప్రేమకథలు మన జీవితంలో ఎల్లప్పుడూ తీయని అనుభూతిని అందిస్తాయి. ఇప్పుడు చెప్పుకుంటున్న ప్రేమకథలు చరిత్రలో నిలిచిపోయిన జాబితాలోవే..
1. దశరథ్ మాంఝీ - ప్రేయసి కోసం పర్వతాలను బద్దలు కొట్టిన వ్యక్తి..
నీకోసం కొండనైనా పిండిలా కొట్టేయగలనని మాటవరసకి ప్రగల్భాలు పలికే వారుంటారు, వారికి సరిగ్గా భిన్నమైన మనిషి దశరథ్ తన ప్రేయసి కోసం నిజంగానే కొండను బద్దలు కొట్టి చూపించాడు. భారతదేశంలోని ఒక చిన్న గ్రామమైన గెహ్లోర్‌లో నిరాశ్రయుడైన దశరథ్ మాంఝీ తన ప్రియమైన భార్య కొండపై నుండి పడిపోయింది. ఆ ఊరికి సరైన రహదారి సౌకర్యం లేక ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లలేక పోగొట్టుకున్నాడు. ఆ సంఘటన తరువాత దృఢ సంకల్పంతో, దశరథ్ 22 సంవత్సరాల పాటు పర్వతాలలో రాళ్లను పగలగొట్టి 400 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో గ్రామాన్ని సమీప నగరానికి అనుసంధానించే విధంగా రహదారిని నిర్మించాడు. అతని ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే, తన గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలను అందించడం, తనలా మరెవరూ ప్రియమైన వ్యక్తిని కోల్పోకూడదనేది దశరథ్ ఉద్దేశ్యం.
2. ఫైజుల్ హసన్ క్వాద్రీ - రెండవ తాజ్ మహల్ నిర్మించిన వ్యక్తి
1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ నిర్మించాడు. ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్ మహల్ ఎందరో ప్రేమికులకు ప్రేమైక రూపం. అలాంటి మరో షాజహాన్ మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తన భార్య తాజమ్ములి బేగం కోసం తన 'ప్రేమకు రూపంగా స్మారక చిహ్నాన్ని' నిర్మిస్తానని 77 ఏళ్ల ఫైజుల్ హసన్ క్వాడ్రీ ప్రమాణం చేశాడు. ఫైజుల్ బేగమ్‌ని 14 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నాడు. అతను ఆమెకు ఉర్దూలో చదవడం, వ్రాయడం నేర్పించాడు. ఈ దంపతులకు సంతానం లేదు. అతని భార్య తన మరణానంతరం మరచిపోకూడదని ఆమె పేరు మీద సమాధి నిర్మించాడు. ఇప్పటి షాజహాన్.
3. చడిల్ డెఫీ, సారిణ్య కమ్సూక్ - మరణాన్ని మించిన ప్రేమ
చడిల్ డెఫీ, సారిణ్య కమ్సూక్ డెఫీ తన చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకునే తేదీని ఖరారు చేయకముందే ప్రమాదంలో సారిణ్య చనిపోయిందనే వార్త అతని జీవితం తలకిందులయ్యేలా చేసింది. కానీ మృత్యువు అతని ప్రేమను జయించలేకపోయింది. థాయిలాండ్‌లోని సురిన్ ప్రావిన్స్‌లో డెఫీ తన మరణించిన ప్రేయసి అంత్యక్రియలతో పాటు, వివాహ వేడుకలో వివాహం చేసుకున్నాడు.
4. డేవిడ్ హర్డ్, అవ్రిల్ కాటో – ఉత్తరాలు ఇద్దరిని ప్రేమికులుగా మారారు.
అవును డేవిడ్ హర్డ్ , అవ్రిల్ కాటో లేఖలతోనే ఒకటయ్యారు. ఇదేదో సినిమాలా అనిపించినా ఇది నిజంగా నిజం. ఇద్దరూ లేఖల ద్వారానే ప్రేమలో పడ్డురు. అవే చివరకు పెళ్ళి పీడలెక్కించాయి. ఈ కథలోకి వెళితే డేవిడ్ హర్డ్ 1907లో న్యూయార్క్ నగరానికి వెళ్లాడు. తను ఎప్పుడూ చూడని, కలవని కరేబియన్‌లోని అవ్రిల్ కాటో అనే తెలియని మహిళకు లేఖలు రాయడం మొదలుపెట్టాడు.. ఇద్దరూ లెటర్స్ షేర్ చేసుకోవడం మొదలుపెట్టి క్లోజ్ అయ్యారు. ఒక సంవత్సరం తరువాత, డేవిడ్ అవ్రిల్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ జమైకాలో ఆగస్టు 1914లో వారి పెళ్లి రోజున మొదటిసారి కలుసుకున్నారు. ఒకరిని ఒకరు చూసుకుని మురిసిపోయారు. పెళ్ళి బంధంతో ఒకటయ్యారు.
5. అన్నా, బోరిస్ - 60 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్న ఇద్దరు ప్రేమికులు..
రష్యన్ జంట అన్నా, బోరిస్ కేవలం మూడు రోజులు మాత్రమే వివాహం తర్వాత కలుసున్నారు. బోరిస్ రెడ్ ఆర్మీ యూనిట్‌లో చేరడం వల్ల యుద్ధానికి వెళిపోయాడు. అన్నా కుటుంబాన్ని ప్రవాసానికి పంపారు. ఇద్దరూ ఒకరితో ఒకరు సంబంధాలు లేకుండా దూరమైపోయారు. బోరిస్ ఆమె కోసం చాలా వెతికాడు కానీ ఆమె కనిపించలేదు. ఇలా జీవితం మీద విరక్తితో ఇద్దరూ చాలా కాలం గడిపారు. ఒక మంచి రోజున, అన్నా కోజ్లోవ్ సైబీరియాలోని బోరోవ్లియాంకాలో తన కారు నుండి బయటకు వెళ్తున్న వృద్ధుడిని చూసి ఆమె ఊపిరి పీల్చుకుంది. బయటికి వచ్చిన వ్యక్తి బోరిస్ అని తెలిసినప్పుడు ఆమె తన కళ్లను నమ్మలేకపోయింది. ఈ జంట 60 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు. మళ్లీ వీరి ప్రేమ వికసించింది.
6. బోనీ , క్లైడ్ - ఒకరినొకరు ప్రేమించిన ఇద్దరు సహచరులు
ప్రేమ గుడ్డిది. బోనీ, క్లైడ్ అదే నిరూపించారు. గ్రేట్ డిప్రెషన్ సమయంలో యునైటెడ్ స్టేట్స్‌లో చట్టాలను ఉల్లంఘించిన బోనీ, క్లైడ్ అనే ఇద్దరు ప్రేమికులు చాలా బ్యాంకులు, చిన్న దుకాణాలు, గ్యాస్ స్టేషన్‌లను దోచుకున్నారు. తొమ్మిది మంది పోలీసు అధికారులను, అనేక మంది పౌరులను కూడా చంపారు. ఈ ఇద్దరూ జనవరి 5, 1930న 105 హెర్బర్ట్ స్ట్రీట్‌లోని క్లారెన్స్ క్లే (క్లైడ్ స్నేహితుడు) ఇంట్లో కలుసుకున్నారు. కొద్దికాలంలోనే సన్నిహిత మిత్రులయ్యారు. ఇద్దరూ ఒక ముఠాను నడిపారు. చాలా నేరాలకు పాల్పడ్డారు. తుపాకీ కాల్పులతో హింసాత్మకంగా మరణించిన సమయంలో కూడా ప్రేమలోనే చనిపోయారు.
7. హెలెన్, లెస్ - జీవితకాలం ప్రేమ
ప్రేమ జంటలు కలిసి జీవిస్తామని, కలిసి చనిపోతామని వాగ్దానాలు చేస్తారు. హెలెన్ , లెస్ కూడా అదే నిరూపించారు. దీన్ని అదృష్టమా లేదా నిజమైన ప్రేమతో పిలవండి, హెలెన్ , లెస్ డిసెంబర్ 31, 1918న ఒకే రోజున జన్మించారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ప్రేమలో పడ్డారు. పాఠశాల నుంచి పారిపోయి 75 సంవత్సరాలు కలిసి జీవించారు. వారి జీవితపు చివరి రోజులలో, లెస్ పార్కిన్సన్స్ వ్యాధితో అనారోగ్యంతో పోరాడుతున్నాడు. ఇక హెలెన్ కడుపు క్యాన్సర్‌తో పోరాడుతుంది. ఆమె జూలై 16 న మరణించింది. లెస్ తన భార్య మరణం గురించి తెలియకుండానే ఒక రోజు తర్వాత మరణించాడు. ఈ దంపతులిద్దరికీ 94 ఏళ్లు.
8. షా హుస్సేన్ , మధో లాల్ - చనిపోయిన తర్వాత కూడా
పంజాబీ సూఫీ కవి అయిన షా హుస్సేన్‌ను సూఫీ సన్యాసి అని కూడా పిలుస్తారు, "మధో లాల్" అనే బ్రాహ్మణ అబ్బాయితో అతను ప్రేమలో పడ్డాడు. అప్పటికి ప్రపంచంలో ఎక్కడా స్వలింగ వివాహం చట్టబద్ధం కానప్పటికీ, ఇద్దరూ ఒకరికొకరు పరస్పర ప్రేమను పంచుకున్నారు. 1960 లలో ముస్లిం రాష్ట్రమైన పాకిస్తాన్‌లో తమ ప్రేమను చాటిచెప్పే ధైర్యం చేశారు. ఇద్దరినీ అక్కడివారు "మధో లాల్ హుస్సేన్" అనే పేరుతో ఒకే వ్యక్తిగా పిలుస్తారు. కాలం గడిచి ఇద్దరూ లోకాన్ని విడిచి వేళిపోయాకా వీళ్ళ సమాధులు ఇప్పుడో సందర్శన ప్రదేశంగా మందిరంగా ప్రసిద్దికెక్కాయి."మేళా చిరఘన్" సమయంలో వేలాది మంది ప్రజలు ఈ మందిరాన్ని, సమాధిని సందర్శిస్తారు, అక్కడ ఇద్దరూ కలిసి నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటారు.
Updated Date - 2023-02-11T23:49:36+05:30 IST