ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Valentines Day 2023: ప్రేమకు ఆ భేధాలేం లేవు.. నిజమైన ప్రేమ అందాన్ని చూడదు..!

ABN, First Publish Date - 2023-02-12T00:00:00+05:30

లవ్ యూ అమ్మూ అని రాసుకుంది.

valentine week 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమకు లావు, సన్నం, పొడవు పొట్టి లాంటి భేధాలు లేవు. ప్రేమ మాటలకందని భావన. దానికి ఎల్లలు, హద్దులు లేనే లేవు. ప్రేమించాలన్నా, ప్రేమించబడాలన్నా ఈరెంటికీ అదృష్టం మాత్రమే కావాలి. శరీరాకృతిలో లోపాలు ఉండటం సహజం. కాకాపోతే దాన్ని మనసారా ఆహ్వానించి జీవితంలో చోటిచ్చేవారు లేకపోతే అదే అసలైన కష్టం. ఇలా తన ప్రేమను గెలిపించుకుని పెళ్ళి పీటలెక్కాడో గట్టివాడు. ఈ ప్రేమకథలోకి వెళితే..

 

మరీ పలచగా ఉన్నా, సన్నగా, పీలగా ఉన్నావంటారు, అదే మరీ లావుగా ఉంటే ఇదేంటి ఇంత లావుగా ఉన్నాడంటారు, ఇది శరీరానికి ఆకృతికి కొలమానం. అయితే ఈ మనిషి తనను అర్థం చేసుకుని వివాహం చేసుకోవడానికి ఒకరు రాకపోతారా అని చాన్నాళ్ళు ఎదురు చూసాడు. అనుకోగానే అన్నీ అయిపోవుకదా.. దేనికైనా కాలం కలిసిరావాలి. అలాగే మన తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్, ప్రముఖ నటి మహాలక్ష్మీ పెళ్ళి కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సన్నిని లతలా కనిపిస్తుంటే.. రవీందర్ దానికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. చూసేవారంతా ఇదేం జంట అని అనుకున్నాగానీ.. ఇద్దరి పెళ్ళి ఫోటోలను షేర్ చేసిన మహాలక్ష్మి నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం, నీ ప్రేమతో నా జీవితాన్ని సంపూర్ణం చేశావు.. లవ్ యూ అమ్మూ అని రాసుకుంది. ఇది రవీందర్ మీద మహాలక్ష్మికి ఉన్న ప్రేమ.

 తన మనసులో రవీందర్ అంటే ఉన్న ప్రేమకు మహాలక్ష్మి మాటలే చక్కని అర్థం చెపుతున్నాయి. ఈ వార్తను చూసిన నెటిజన్లు మాత్రం మహాలక్ష్మి., రవీందర్ ఆస్తి కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటుంటే.. ఇప్పటి సినీ ప్రముఖుల ప్రేమలు అన్నీ బావుంటేనే కలకాలం నిలవడం లేదు ఇది మాత్రం ఎంతకాలమో చూద్దామని అన్నవారూ లేకపోలేదు. ఏది ఏమైనా ప్రేమకు ఈడూ, జోడు అనే మాట ఒకప్పుడు చూసేవారేమో..ఇప్పుడు మనసులు కలిస్తే చాలు. హద్దులు, ఎల్లలు లేనే లేవని అర్థం చేపుతున్నారు.

Updated Date - 2023-02-12T00:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising