ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Valentine's Day 2023: వాలెంటైన్స్ డేకి మీ ప్రియమైనవారికి ఆరోగ్యాన్ని బహుమతిగా ఇస్తున్నారా?

ABN, First Publish Date - 2023-02-13T21:51:00+05:30

మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, మీ సపోర్ట్ చూపడానికి ప్రేమికులరోజు ఒక ఛాన్స్

valentine week 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాలెంటైన్స్ డే అనేది ప్రేమను తెలుపుకోవడానికి చక్కని అవకాశం, మీ ప్రియమైనవారి పట్ల ప్రేమను, శ్రద్ధను చూపించే సమయం కూడా. మీకు ఇష్టమైనవారు క్రీడలు, ఫిట్‌నెస్‌లో ఉన్నట్లయితే, ఆరో‌గ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధిత వస్తువులను ఈ ప్రేమికుల రోజుకు బహుమతిగా ఇవ్వడం చక్కని ఎంపిక అవుతుంది.. వారి పట్ల మీకు సరైన అవగాహన ఉందని, వాళ్ళ గురించి శ్రద్ధ చూపుతున్నారని, ప్రేమికుల రోజు సందర్భంగా మీరు ప్రియమైన వారికి ఇచ్చే ఇలాంటి బహుమతులు నిర్ణయిస్తాయి. అంతేనా.. ఈ బహుమతులు వారి ఫిట్‌నెస్ జర్నీ పట్ల, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం పట్ల ఎంకరైజ్ చేసేలా చేస్తాయి., ఈ ఫిట్ నెస్ సెషన్‌లను మరింత ఆనందదాయకంగా మార్చడానికి కూడా సహాయపడతాయి. అంతేకాకుండా, మీ ప్రేమ బంధం, ఆరోగ్యకరంగా మారేందుకు దారి చూపుతాయి. కాబట్టి, ఇష్టమైనవారికోసం 2023లో ప్రేమికులరోజుకు క్రీడలు, వ్యాయామ దినచర్యకు సంబంధించినవి ఏవైనా బహుమతిగా ఇవ్వాలని చూడండి.

జిమ్ మెంబర్‌షిప్ (Gym membership) : మీ ప్రియమైనవారికి ఇప్పటికే జిమ్ మెంబర్‌షిప్ లేకపోతే, వాలెంటైన్స్ డే కోసం వారికి అది అందజేయండి. కొత్త వ్యాయామ పరికరాలు, క్లాసెస్‌ను ప్రయత్నించేలా ప్రోత్సహించండి.

ఫిట్‌నెస్ ట్రాకర్ (Fitness tracker) : ఫిట్‌నెస్ ట్రాకర్ కూడా ప్రియమైన వారికి ఇవ్వచ్చు. ఇది దినచర్యలో కొత్త టెక్నిక్స్ ను అందించడంలో సహకరిస్తుంది.

వర్కౌట్ బట్టలు (Workout clothes) : కొత్త వర్కౌట్ బట్టలు, అథ్లెషర్ షూస్ తేలికగా కదలడానికి, హాయిగా అనిపిస్తాయి. నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి.

సప్లిమెంట్‌లు (Supplements) : వెయిట్‌లిఫ్టింగ్ వ్యాయామాలు చేస్తుంటే, వెయ్ ప్రొటీన్, ప్రీ-వర్కౌట్, సప్లిమెంట్ వారి ఫిట్‌నెస్ రొటీన్‌ మరింత మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. వెయ్ ప్రోటీన్లు ఇప్పుడు స్విస్ చాక్లెట్, మడగాస్కర్ వనిల్లా వంటి విభిన్న రుచులను కూడా బహుమతిగా ఎంచుకోవచ్చు.

ఫోమ్ రోలర్ (Foam roller) : వర్కౌట్స్ తర్వాత కోలుకోవడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి ఫోమ్ రోలర్ సహాయపడుతుంది.

రెసిస్టెన్స్ బ్యాండ్‌లు (Resistance bands) : పోర్టబుల్, బహుముఖ, రెసిస్టెన్స్ బ్యాండ్‌లను వివిధ రకాల వ్యాయామాల కోసం ఉపయోగించవచ్చు, ఇవి వ్యాయామం చేసే ఎవరికైనా గొప్ప బహుమతి.

మసాజ్ గన్ (Massage gun) : మసాజ్ గన్ మీ ప్రియమైనవారి కండరాల ఒత్తిడిని తగ్గించడానికి, తీవ్రమైన వ్యాయామాల తర్వాత వారి రికవరీ సమయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

స్మార్ట్ వాటర్ బాటిల్ (Smart water bottle) : వాటర్ తీసుకోవడం ట్రాక్ చేసే స్మార్ట్ వాటర్ బాటిల్, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండాలని మీ వారికి గుర్తు చేసే స్మార్ట్ వాటర్ బాటిల్ , ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకునే ఎవరికైనా గొప్ప బహుమతి.

యోగా (Yoga mat): యోగాను ఆస్వాదించే, వారికి శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపరచాలనుకునే ఎవరికైనా యోగా మ్యాట్ గొప్ప బహుమతి.

మసాజ్ (Massage gift certificate): మసాజ్ ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకునే ఎవరికైనా గొప్ప బహుమతిగా మారుతుంది.

ఈ బహుమతి ఆలోచనలు మీ భాగస్వామి వారి అథ్లెటిక్, ఫిట్‌నెస్ లక్ష్యాలను కొనసాగించేటప్పుడు వారి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మీ ప్రేమ, మీ సపోర్ట్ చూపడానికి ప్రేమికులరోజు ఒక చాన్స్‌గా ఉపయోగించుకోండి, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి ఇదో చక్కని అవకాశం, ఏమంటారు?

Updated Date - 2023-02-13T22:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising