ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Valentine's Day 2023: మేం ప్రేమించుకున్నామని మా దగ్గరకు ఎవరైనా వస్తే..!

ABN, First Publish Date - 2023-02-13T23:56:50+05:30

మా ప్రేమకథలో కష్టాలనైతే అసలు గుర్తుచేసుకోం.

valentine week 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్కూల్ ప్రేమ, పెళ్ళివరకూ వెళుతుందని ఇద్దరూ అనుకోలేదు.. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారే అచ్చం అలాగే వీళ్ళూ స్కూల్ చదువు తరవాత కలిసారు. మంచి చెడులు మాట్లాడుకుంటూనే మనసులో ప్రేమను పంచుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కలిసి, బంధంగా మారాలనుకునేలోపు మతం అడ్డంగా నిలబడింది. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం, ప్రేమా, నమ్మకం ముందు మతం నిలవలేక పెద్దల్ని మధ్యలో నిలబెట్టింది. నచ్చజెప్పారు, వేచి చూసారు. కఠినమైపోయిన పెద్దలు మతం మారితేనే, పెళ్ళి మా చేతులమీద చేస్తాం.. లేదంటే మీదారి మీది, మాదారి మాదని తప్పుకున్నారు. మళ్ళీ ప్రేమే చేయందించింది. ఇద్దర్నీ భార్యాభర్తలుగా నిలబెట్టింది. ఈ ప్రేమకథంతా ఇక్కడే తెలుసుకుంటే ఎలా? ఈ ప్రేమికుల మాటల్లోనే వాళ్ళ కథను తెలుసుకుందాం రండి.. ప్రేమికుల రోజు సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ అందిస్తున్న ప్రేమకథను రఫీ, దయా మాటల్లోనే తెలుసుకోండి.. ఇక కథలోకి వెళితే..

విజయవాడకు చెందిన షేక్ రఫీ సి.ఎ గా వర్క్ చేస్తున్నాడు, దయా హెచ్.ఆర్ గా ఓ కంపెనీలో పనిచేస్తుంది. బాబూ గోగినేని, వహీద్ వంటి ప్రముఖుల ద్వారా కులనిర్మూలన సంఘంలో ఈ ప్రేమికులు మరికొందరి ప్రేమికులకు, పెళ్ళి బంధంతో ఒకటయ్యేందుకు సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే భారతనాస్తిక సమాజం, అధ్యక్షులు భైరి నరేష్ గారితో కలిపి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో యాక్టివ్‌గా ఉన్నారు.

1. చిన్ననాటి పరిచయం ఇద్దరి మధ్యా ప్రేమగా ఎప్పుడు పుట్టింది?

నేను స్కూల్‌లో వున్నప్పుడు తను నా సబ్ జూనియర్, బాగా చదివేది. ఇద్దరం toppers, అప్పటిలో లవ్ అనేదేం తెలియదు. జస్ట్ ఇష్టం ఒకరి మీద ఒకరికి అంతే. స్కూల్ లైఫ్ అయ్యాకా, మళ్ళీ ఫేస్బుక్‌లో కలిసే దాకా తన గురించి నాకు, నా గురించి తనకు ఏమీ తెలీదు.. అప్పటిలో ఫోన్ సౌకర్యం కూడా అంతగా లేదు. కలిసిన కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. ఆ సమయంలోనే చిన్ననాటి ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. ముందు దయానే పెళ్లికి ప్రపోజల్ పెట్టింది. నేను కొన్ని రోజులు ఒకరిని ఒకరం అర్దం చేసుకుని, తర్వాత డిసైడ్ అవుదాం అని చెప్పాను.

2. ప్రేమని తెలుపుకున్నాకా, పెళ్ళికి అంత టైం ఎందుకు పట్టింది?

ఫేస్బుక్‌లో కలిసినపుడు మాటలు బాగానే ఉన్నా, మనసులు కలిసినా ఎందుకో మాది ప్రేమేనా? అనే సందేహం, కాస్త టైం తీసుకుంటే తప్పేంలేదని, ఇద్దరం ఒకమాట అనుకుని ఆగాం. ఆ తరువాత రెండేళ్ళకి పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం. అలాగే దయా తన ఇంట్లో నా గురించి చెప్పింది. నేను కూడా మా ఇంట్లో దయ గురించి చెప్పాను.

3. ఇద్దరూ మీ ప్రేమ సంగతి చెప్పగానే మీతల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ల నుంచి సపోర్ట్ ఏదైనా వచ్చిందా?

దయా పేరెంట్స్ నాతో మాట్లాడతాం అన్నారు, నేను వెళ్లి కలిసాను. నా మాటలు, నా చదువు అన్నీ వాళ్లకు నచ్చాయి, కానీ ముస్లిం అంటే భయపడ్డారు. వాళ్ల ఆలోచనను తప్పుబట్టలేం. కాకపోతే నేను నచ్చజెప్పాలని మాత్రం అనుకోలేదు. దయ తనే వాళ్ళ తల్లిదండ్రులకు నా గురించి చెప్పి మా పెళ్లికి ఒప్పించింది. ఇక మా పేరెంట్స్ విషయానికి వస్తే అసలు ఒప్పుకోలేదు, కారణం ఓన్లీ మతం. ప్రేమించడానికి, కలిసి బతకడానికి అవసరం లేని కులం, మతం పెళ్లికి కూడా అవసరం లేదని, మేం మాకాళ్ల మీద నిలబడి ఆనందంగా జీవిస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారని పెళ్లికి రెఢీ అయ్యాం.

మాపెళ్లి అనుకున్నాకా, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరీ నరేష్‌గారూ చాలా సపోర్ట్ చేశారు. ప్రేమ పుట్టేటపుడు ముహూర్తాలు చూసి పుట్టలేదు, సో పెళ్లికి కూడా వాటి అవసరం లేదని Special marriage act ప్రకారం ఒక తేదీ అనుకోని రిజిస్టర్ మరేజ్ చేసుకున్నాం. మా వైపు నుంచి బంధువులుగానీ, స్నేహితులుగానీ, మరెవరూ సపోర్ట్ చేయలేదు, దయ వైపు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. మా ఇంట్లో మతం అడ్డొచ్చింది మావాళెవ్వరూ రాలేదు, కానీ తన వైపు ఎవరూ అబ్జెక్షన్ పెట్టలేదు. మేం ఇద్దరం ఆనందంగా వుంటే చాలు అనుకున్నారు. తను btech చేసింది. కనుక తన చదువుకి, తన డెసిషన్‌కి, వాళ్ళ side రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ నా పెరెంట్స్ అలా కాదు. దయా మతం మారాలని, నిఖా చేసుకోవాలని, పేరు మార్చుకోవాలని అన్నారు.

4. మీ ఇద్దరికి ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఒకరి గురించి ఒకరు ఏం చెపుతారు?

మా వారు చాలా అప్డేట్‌గా ఆలోచిస్తారు. మనుషులు అందరూ సమానమని, ఈ కులాల మతాలు అన్నీ బ్రతకడానికి అవసరం లేదనేది ఆయన ఉద్దేశ్యం. అది నాకు తనలో నచ్చే విషయం. దానికి సరైన ఉదాహరణ మేం ఇద్దరమే. మాకు కులమతాలు రెండూ లేవు. అంతేకాదు నాకు చాలా రెస్పెక్ట్, స్వేచ్ఛ ఇస్తారు. అంతకన్నా ఏం కావాలి.

తను చాలా దైర్యవంతురాలు, నిజాయితీగా వుంటుంది. అబద్దం చెప్పదు. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది. తనలో నచ్చని అంశం కూడా అదే. ఆ ముక్కుసూటి తనమే కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఎదుటి వారు బాధ పడినా నిజమే చెప్పాలి అనుకుంటుంది. అలాగే వుండాలి అంటుంది. ఇది అన్ని సమయాల్లోనూ వర్కవుట్ కాదుగా..

5. పెళ్లయి మూడేళ్ళవుతుంది. అమ్మానాన్నల్లో మార్పేమన్నావచ్చిందా?

మూడేళ్లల్లో మా సంతోషాన్ని రెట్టింపు చేసేలా బాబు పుట్టాడు. వాడితో ఆడుకుంటూ, లోకమే మరిచిపోతాం. మా ప్రేమకథలో కష్టాలనైతే అసలు గుర్తుచేసుకోం. కాకపోతే మనవడు వచ్చాకా రఫీ అమ్మానాన్నలు కలిసినా అప్పుడప్పుడూ మతం అడ్డొస్తుంది. పిల్లల సంతోషంలో తమ సంతోషం ఉందనుకుంటే సమస్యే లేదు, కానీ ఇంకా వాళ్ళ మతంలోకి రాలేదనే ఆలోచనే వాళ్లలో ఉంది. కన్నప్రేమంటే బిడ్డల సంతోషమే కదా కన్నవారిని సంతోషానిచ్చేది.. అలా ఎలా పట్టింపులతో వదిలేస్తారు. ఏదో మొదట్లో అలుగుతారు, సమాజం నుంచి సమస్యలు ఎదురవుతాయని, కాస్త భయపడతారు, కానీ మరీ ఇలా ఉండరు కదా.

6.ఇప్పటి ప్రేమికులకు మీ నుంచి ఏదైనా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే?

ప్రేమకి కులం, మతం, ధనం, రంగు, అందం ఇంకేది అడ్డు కాకూడదు. మేం ప్రేమించుకున్నామని మా దగ్గరకు ఎవరైనా వస్తే ముందుగా వాళ్ళకు మేం మా లైఫ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులను, పడిన ఇబ్బందులను గురించి వివరిస్తాం. రేపు భవిష్యత్ ఎలా ఉండబోతుందో కూడా చెపుతాం. అది విని కూడా వాళ్ళు ప్రేమలోనే ఉన్నామంటే, ఆర్ధికంగా ఒకరిని ఒకరు పోషించుకునే సత్తా ఉందా లేదా అనేది చూసి వాళ్ళ పెళ్ళి ప్రయాణం మొదలయ్యేలా సపోర్ట్ చేస్తాం.

ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ, నమ్మకంతో నిర్ణయాలు తీసుకుని బంధాన్ని బలంగా నిర్మించుకోవడానికి ఆర్థికమైన సపోర్ట్‌‌తో కొత్త జీవితంలోకి వస్తామంటే వాళ్లకు మా సపోర్ట్, మా సంస్థల సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అంతే కానీ కుల, మతాల సంస్కృతి మాకొద్దు, పెద్దలు కూడా బిడ్డల మీద ప్రేమని ఇలాంటి సమయాల్లోనే మరింత ఎక్కువ చూపించాల్సి ఉంది. అంతేకానీ నిందలకు పోయి పిల్లల్ని దూరం పెట్టకూడదు.

-శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2023-02-13T23:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising