ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Valentine Week 2023 : ఈ ప్రేమకథ చైనాలో మొదలై, గుంటూరుకు చేరింది.

ABN, First Publish Date - 2023-02-13T16:50:59+05:30

ఎంత త్వరగా పెళ్లి చేసేసుకుంటానా అనే తొందరలో ఉన్నాం.

Valentine's Day 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా తల్లిదండ్రులది అందమైన ప్రేమకథ. ఈ కథలోకి వెళితే క్రాంతి గుత్తా నాగ్‌పూర్‌లో రిజర్వ్ బ్యాంక్‌లో పనిచేసారు, వీరి పూర్వీకులంతా గుంటూరు నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డారు. చదువంతా ఆంధ్రాలో ఇంటర్ వరకూ జరిగింది. ఆ తరువాత మహారాష్ట్రలో కొనసాగింది. అక్కడే ఉద్యోగం కూడా మొదలైంది. జ్వాలకు నాలుగేళ్ళప్పుడు హైదరాబాద్ వచ్చారు. ఇక జ్వాలా గుత్తా తల్లి ఎలెన్ గుత్తా ఆమె, క్రాంతి గుత్తా కలిపి చదువుకున్నారు. చైనాలో పుట్టి పెరిగిన ఎలెన్ ఇండియా రావడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. వీరి ముత్తాత మహాత్మాగాంధీ శిష్యులు. ఆయన మహాత్మాగాంధీ బయోగ్రఫీని చైనీస్‌లోకి అనువదించాలని సేవాగ్రామ్ వచ్చారు. వస్తూ, వస్తూ తన వెంట ఎలెన్ని కూడా తీసుకొచ్చారు. అలా కాలేజ్ చదువు వరకూ ఆమె చదువు ఇండియాలోనే గడిచింది. అప్పుడే క్రాంతి గుత్తాను కలిసారు.

ఒకే ఊరిలో ఒకే కాలనీలో ఉండేవారు ఇద్దరూ, కానీ ప్రేమ మాత్రం చాలా ఏళ్ళకే పుట్టింది. ఒకసారి న్యూ ఇయర్ సమయంలో ఎలెన్ క్రాంతిగారి ఇంటికి రావడంతో ప్రేమ చిగురించింది. అప్పుడప్పుడూ కెమిస్ట్రీ నేర్చుకోవడానికి క్రాంతి దగ్గరకు వచ్చేది. ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టి, మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయిందంటుంది ఎలెన్. ఇదేదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేం కాదు కానీ, ఇద్దరం ప్రేమలో ఉండి దానిని పెళ్ళి వరకూ తీసుకువెళ్ళగలిగాం అంటారు క్రాంతి.

ఇద్దరూ కలుసుకునేందుకు చాలా సార్లు గోడదూకి వెళ్ళేవారు.. కాబట్టి గోడదూకడం, ఇద్దరూ మాట్లాడుకోవడం స్వీట్లు, చాక్లెట్స్ పంచుకుని, తీయనైన కబుర్లు చెప్పుకోవడం కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. మా మధ్యలో పెద్దల అతి కరకుదనం లేకపోయినా పెళ్ళి మాత్రం ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజంలో చేసుకోవలసి వచ్చింది. ఈ విషయంలో ఎలెన్ ఏమంటారంటే.. క్రాంతి రాసే ఏ ఉత్తరమూ నాకు సరిగా అర్థం అయ్యేది కాదు. తను నువ్వు ఇప్పుడు క్లాస్ అవుతుండగా వచ్చి నన్ను కలుసుకో అనేసరికి నాకు భయం వేసేది. అంతే క్లాస్ వదిలేసి తనని కలవడానికి వెళ్ళేదాన్ని. పెళ్ళి అనుకున్నప్పుడు సడెన్‌గా నిర్ణయం తీసుకున్నాం. వాళ్ల ఇంట్లో అంతా ఓకే చెప్పారు కానీ మావాళ్ళు కాస్త ఇబ్బంది పెడతారని చెప్పకుండా చేసుకోవలసి వచ్చింది. అంత ఉదయాన్నే లేచి పెళ్ళికి రఢీ కావడం అంటే ఇప్పుడు తలుచుకున్నా వింతగానే ఉంటుందినాకు. పెళ్ళి జరిగినట్టు సర్టిఫికెట్ కావాలి కనుక ఆర్య సమాజ్‌ను ఎంచుకున్నాం. మా కూడా వాళ్ళ పెద్దవాళ్ళు, బంధువులు వచ్చారు. పెళ్ళికోసమని ప్రత్యేకంగా షాపింగ్ చేసింది ఏం లేదు. అన్నీ మామూలు బట్టలే. వాటికన్నా తనను ఎంత త్వరగా పెళ్లి చేసేసుకుంటానా అనే తొందరలో ఉన్నాను నేను.

ఇంకా చదవండి: పంజాబ్ సింహాన్నే ప్రేమలో పడేసిన డాన్సర్..!

క్రాంతి మాట్లాడుతూ.. పెళ్ళికి మావాళ్ళను వెంటబెట్టుకుని వెళ్ళాం. కానీ మానాన్నమాత్రం అన్నింటినీ వ్యతిరేకించే నన్ను ఈ ఆర్యసమాజ్‌కి తెచ్చావేంరా అని బాధపడ్డారు. ఇక ఫోటోగ్రాఫర్ తీసే ఫోటోలకు కూడా మాకు లెక్కే. పది ఫోటోలకన్నా ఎక్కువ తీయద్దని నాగోల. ఎందుకంటే అంతకన్నా ఎక్కువైతే నా దగ్గర మనీలేవు. చాలా తక్కువలో పెళ్ళి తంతు ముగించుకుని ఇంటికి చేరుకున్నాం. ఇప్పుడు తలుచుకుంటే మా ప్రయాణం ఎంత సాఫీగా సాగినా వెనకటి రోజులు తలుచుకుంటే, చాలా తృప్తిగా అనిపిస్తుంది. ప్రేమకు కులమతాలు ఎలా అడ్డుకావో అలాగే ప్రాంతాలు, దేశాలు కూడా అడ్డురాని మేం నమ్ముతాం. ఇప్పటివారికి ఈ విషయంలో మంచి అవగాహనే ఉంది. కోరుకున్న వారి కోసం అందరినీ ఎదిరించి వివాహం చేసుకుంటున్నారు. కాకపోతే బంధాన్ని నిలుపునే ఓపికే ఉండటం లేదు. ఈగోలకు పోతున్నారు. కాస్త ఆగి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంతా ప్రేమైక సౌందర్యమే..!

Updated Date - 2023-02-13T16:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising