Valentines Day: కాదనిపించుకున్నా వాలెంటైనే..!
ABN, First Publish Date - 2023-02-14T11:46:55+05:30
నువ్వు నాకు నచ్చలేదనో, మనకు ప్రేమ సెట్ కాదనో, బ్రేకప్ మాటలు ఎదురుపడ్డాయో
బ్రేకర్ అనేది నిజంగా బాధాకరమే, ప్రపంచమంతా ప్రేమను పంచుకునే సమయంలో కొన్ని హృదయాలకు ఈ బ్రేకప్‌లతో గట్టి దెబ్బలే తగులుతాయి.. మరి మీ ప్రేమ ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇప్పటికే మీరు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఉంటే ఈ ప్రేమికుల రోజుని ప్రియమైన వారితో ఎంజాయ్ చేయండి. ఈరోజున నచ్చిన ఫ్లేస్‌కి వెళ్ళడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో లంచ్, డిన్నర్, ప్రియమైనవారి కోసం కొని ఉంచిన గిఫ్ట్స్ పంచుకోవడం, ఈ ప్రేమికులవారంలో షాపింగ్స్, సరదా కబుర్లు, వీకెండ్ ఫ్లాన్స్, రోజ్ డే, హగ్ డే, ప్రపోజ్ డే, కిస్ డే అంటూ బిజీ బిజీ గడిపేసి ఆఖరు రోజైన ప్రేమికుల రోజున మీ ఫ్లానింగ్స్ మరీ ముఖ్యంగా మీ ఇద్దరు మాత్రమే ఎంజాయ్ చేయాలనుకుంటారు. దానికి తగ్గట్టు వాలెంటైన్ డేని ఫ్లాన్ చేసుకుంటారు.
అయితే కొత్తగా లవ్ ప్రపోజల్ వస్తే బావుండునని చూసే వారికి ఇది మరీ ఉత్సాహాన్నిచ్చే టైం. తనకోసం ఒకరు ప్రేమను పంచేందుకు రాబోతారని ఎదురుచూసే యూత్ కూడా ఉంటారు. నచ్చినవారు జీవితంలోకి వస్తే కలర్ ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయచ్చనే ఆలోచలో ఊగిపోతారు.
ఇక తరువాత కేటగిరీ ప్రేమించినవారు ఈరోజు ప్రపోజ్ చేసాకా తన మీద ప్రేముందని తీపి కబురు చెపుతారని ప్రపోజల్‌ని అంగీకరిస్తారని ఎదురు చూస్తారు. ఈ ప్రేమ పూజారులు నెల ముందు నుంచే ప్రేమికుల నెల ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ప్రేమ వారం దగ్గర పడుతుంటే పెరిగిన గుండె దడతో చెప్పలేని గుండె భారాన్ని మోస్తారు. నువ్వు నాకు నచ్చలేదనో, మనకు ప్రేమ సెట్ కాదనో, బ్రేకప్ మాటలు ఎదురుపడ్డాయో అది మీ మానసిక ఆరోగ్యంపై దెబ్బతీసేంత ప్రభావాన్ని చూపకుండా చూడాలి. విడిపోవడం, కలవడం, అనేది భావోద్వేగ స్థాయిలో చాలా బాధాకరంగా ఉండొచ్చు. దానిని అధిగమించడానికి మానసిక ధైర్యం కావాలి. మనం చేయాల్సిన అత్యంత కష్టమైన పని అదే అయినా తప్పదు. ముఖ్యమైన వ్యక్తిని కోల్పోతే, అది ప్రియుడైనా, ప్రియురాలైనా హృదయం పగిలిన భావమే కలుగుతుంది.
ఇంకా చదవండి: మేం ప్రేమించుకున్నామని మా దగ్గరకు ఎవరైనా వస్తే..!
ఇకపై వాళ్లు మన జీవితంలో లేకపోతే అన్నీ ఆగిపోతాయని అనిపిస్తుంది. దూరం పెరిగి పోయినట్టుగా భావిస్తారు. తగిలిన గాయాలు మాని కొత్త ప్రేమలు పుట్టేందుకు, కొత్త వ్యక్తులు లైఫ్‌లోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. వేచి చూడాలంతే.. ప్రస్తుతం ఆవేశంలో విడిపోవడం, తరవాత ఆందోళన చెందడం అనేది తట్టుకోలేక ఆవేశ నిర్ణయాలు తీసుకునేలా పరిస్థితి దారి తీయడం చివరి మజిలీ అవుతుంది.
ఇలాంటి బ్రేకప్స్ వచ్చినపుడే ఎదుర్కునే సామర్థ్యం కూడా కావాలి. సంతోషకరమైన సంబంధాలకోసం వేచిచూడటంలో తప్పులేదు. ఇద్దరు ప్రేమించుకుంటే అది అందమైన ప్రేమ బంధం అవుతుంది. అమ్మయి తిరస్కరించిందని అబ్బాయీ, అబ్బాయి తిరస్కరించాడని అమ్మాయి వైరాగ్యంలో కూరుకుపోయి ఉంటే నష్టపోయేదెవరు. ఒకరు మన నుంచి విడిపోయినా వాళ్ళు ఎప్పటికీ పర్మినెంట్ వాలెంటైన్ గా మిగిలిపోతారు. నిజమైన ప్రేమికులు విడిపోయినా గుండెల్లో సాస్వత వాలెంటైన్‌గా నిలిచే ఉంటారు.
Updated Date - 2023-02-14T11:47:08+05:30 IST