Vande Bharat Train: వందేభారత్ రైళ్లను ఎక్కేవారికి ఇంపార్టెంట్ అలెర్ట్.. 6 నెలల పాటు అవన్నీ బంద్..!
ABN, First Publish Date - 2023-09-26T17:06:16+05:30
వందేభారత్ రైళ్లలో ప్రయాణించాలని అనుకునేవారు ఇక మీదట జాగ్రత్త పడాలి. ఇన్నాళ్లు ఉన్న ఆ సేవలను 6నెలలపాటు నిలిపేస్తోంది..
భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడినవి వందే భారత్ రైళ్ళు. సాధారణ రైళ్లకు విభిన్నంగా అత్యాధునిక పద్దతిలో విద్యుత్ సహాయంతో నడిచే ఈ రైళ్లు చాలా వేగంగా గమ్యాన్ని చేరుకుంటాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చెయ్యడం పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఖరీదైన ప్రయాణం చెయ్యాలని అనుకునేవారు కూడా ఈట్రైన్లలో ఎక్కడానికే మక్కువ చూపిస్తారు. అయితే ఇందులో ప్రయాణించాలనుకునేవారు ఇకమీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రైళ్లలో లభించే ఆహార సేవలను 6నెలల పాటు నిలిపివేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో దూర ప్రయాణాలు చేసేవారు ఆకలికి నకనకలాడాల్సి ఉంటుంది. అసలు ఆహార సేవలు నిలిపివేయడం వెనుక కారణం ఏంటి? ప్రయాణికులకు భోజన సదుపాయాన్ని ఎలా కల్పిస్తుంది? వివరంగా తెలుసుకుంటే..
వందేభారత్ రైళ్లలో(Vande Bharat Trains) ప్యాక్ చేసిన ఆహారాన్ని(packed food) విక్రయించేందుకు చాలామంది విక్రేతలకు ఐఆర్సిటిసి(IRCTC) గతంలో అనుమతులు ఇచ్చింది. అయితే ఈ రైళ్లలో శుభ్రత గురించి ప్రయాణికుల నుండి తరచుగా ఫిర్యాదులు అందడం, ఆహార విక్రేతలు ఎప్పుడూ ట్రైన్లలో తిరుగుతున్న కారణంగా సరిగా నిద్రపోవడం కుదరడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేయడం జరుగుతోంది. ఈ కారణాల వల్ల కొత్త నిర్ణయం తీసుకుంది. 'పైలట్ ప్రాజెక్ట్' కింద 6నెలల పాటు రైళ్లలో ప్యాక్డ్ ఫుడ్ నిషేదించారు(packed food ban for 6months). దీంతో ప్యాక్డ్ ఫుడ్ వందేభారత్ రైళ్లలో 6నెలల పాటు లభించదు.
Health Facts: బానపొట్ట కరిగిపోవాలా..? రోజూ పొద్దునే నిద్రలేవగానే ఈ జ్యూస్‌ను తాగితే.. చెడు కొవ్వు అంతా మటాష్..!
వందేభారత్ రైళ్లలో అల్పాహారం(break fast), భోజనం(lunch), రాత్రి భోజన(dinner) సౌకర్యం ముందులానే కొనసాగుతుంది. అయితే దీన్ని ఎయిర్ లైన్స్ తరహాలో టికెట్ బుకింగ్ సమయంలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా వెజ్, నాన్-వెజ్ రెండూ ఉంటాయి. ప్రయాణికుడు తనకు నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రయాణానికి 24 నుండి 48గంటల ముందు ఎస్ఎమ్ఎస్(SMS) ద్వారా భోజనం బుకింగ్ నిర్థారణ అందుతుంది. ముందే బుకింగ్ చేసుకోకుండా ట్రైన్ లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఆహారం కావాలంటే మాత్రం రూ. 50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!
Updated Date - 2023-09-26T17:06:16+05:30 IST