Veera Simha Reddy Trailer: ఏంటీ ఊచకోత..?
ABN, First Publish Date - 2023-01-06T21:34:28+05:30
‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే.. నేనొక్కడినే కత్తిపట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు...
‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే.. నేనొక్కడినే కత్తిపట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్’ అంటూ ట్రైలర్‌తో దిగాడు ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). ఈ నందమూరి హీరో (Nandamuri Hero) సినిమాకి ఏమేం ఉండాలో అవన్నీ ఈ సినిమాలో సమకూర్చినట్లుగా.. గతంలో ఆయన చేసిన ఫ్యాక్షన్ సినిమాలు గుర్తు చేసేలా ఈ సినిమా రూపొందినట్లుగా ట్రైలర్ చెప్పేస్తుంది. ‘సమరసింహారెడ్డి’(Samara Simha Reddy)ని తలపించే లుక్, బోయపాటి (Boyapati) సినిమాలలో ఉండే మాస్ డైలాగ్స్ మిక్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్.. సంక్రాంతికి ఓ ఊర మాస్ సినిమా వస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
‘వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్..’ అంటూ వీరసింహారెడ్డిని పరిచయం చేసిన తీరే.. ఈ సినిమా ఏ కోణంలో ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చేస్తోంది. ‘మైలురాయికి మీసం మొలిసినట్టున్నాదిరా..’ అంటూ ఓ ఎలివేషన్ డైలాగ్.. ఆ తర్వాత రక్తపాతం తలపించేలా ఓ యాక్షన్ ఎపిసోడ్.. ఇలా నడిచిన ఈ ట్రైలర్‌లో ‘పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వెళ్లి నిలబడు.. అక్కడ నీకొక స్లోగన్ వినిపిస్తుంది’ అంటూ ఈ మధ్య ప్రతి వేడుకలో, థియేటర్లలో, పబ్‌లలో వినిపించే పేరుని, ఆ పాటని వినిపించారు. శృతిహాసన్ (Shruti Haasan)తో డ్యాన్స్ మూమెంట్స్.. ఆ తర్వాత ‘అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను, లొకేషన్ చూడను.. ఒంటి చేత్తో ఊచకోత కోస్తా.. నా కొ**కా’ అనే ఊర మాస్ డైలాగ్, యాక్షన్.., ఆ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)తో చెప్పించిన డైలాగ్‌తో ఈ సినిమాలో ఉన్న మరో కోణాన్ని పరిచయం చేశారు. (Veera Simha Reddy Trailer Review)
‘సంతకాలు పెడితే.. బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు’ అంటూ ఏపీ గవర్నమెంట్ (AP Government)కి తగిలేలా (ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు) ఓ పంచ్.. ఆ వెంటనే ఓ ఎమోషనల్ సీన్.. మళ్లీ ‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ..’ అంటూ బోయపాటి మార్క్ డైలాగ్.. ఇలా సాగింది ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్. ఓవరాల్‌గా అయితే ఈ నందమూరి హీరో నుంచి ఫ్యాన్స్ ఏమి ఆశిస్తారో.. వాటన్నింటిని సమపాళ్లలో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దట్టించినట్లుగా అయితే ఈ ట్రైలర్‌తో తెలిసిపోతుంది. కెమెరా వర్క్, మ్యూజిక్, డైలాగ్స్.. ఇలా అన్నీ హైలెట్ అనేలా ఉన్నాయి కానీ.. ఇంత మాస్ మసాలా సినిమా.. అందునా ఇంతకు ముందు ఈ నందమూరి హీరో చేసిన సినిమాలనే తలపిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో ఊచకోత కోస్తుందో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయక తప్పదు. (Veera Simha Reddy Trailer Talk)
Updated Date - 2023-01-06T22:05:20+05:30 IST