Veera Simhareddy: ఓటీటీలోనూ అదరగొడుతోంది

ABN, First Publish Date - 2023-02-24T12:18:58+05:30

భయం బయోడేటాలో లేని వీర విజృంభణం, పవర్‌ ఫుల్‌ మాస్‌, యాక్షన్‌ డ్రామా ‘వీర సింహారెడ్డి'(Veera simhareddy) సంక్రాంతి బరితో విడుదలై అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Veera Simhareddy: ఓటీటీలోనూ అదరగొడుతోంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయం బయోడేటాలో లేని వీర విజృంభణం, పవర్‌ ఫుల్‌ మాస్‌, యాక్షన్‌ డ్రామా ‘వీర సింహారెడ్డి'(Veera simhareddy) సంక్రాంతి బరితో విడుదలై అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో సంచలనం సృష్టిస్తోంది. సీమ సంక్షేమం కోసం సింహగర్జన చేసిన ‘వీర సింహారెడ్డి’(Nbk's Veera Simhareddy) డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ప్రేక్షకులకు వినోదంతో పాటు ఎన్నో భావోద్వేగాలను పంచుతోంది. (Mass blockbuster Veera simhareddy now in Disney + Hotstar)

యాక్షన్‌, సెంటిమెంట్‌ మేలు కలయికగా, కావలసినన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మేళవింపుగా ‘వీర సింహారెడ్డి’ కోసం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో అన్ని వరాల ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇప్పుడు బాలకృష్ణని(Nandamuri Balakrishna) ‘వీర సింహారెడ్డ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రలో ఆయన అందించిన నటనకి, పండించిన ఎమోషన్‌ కి ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఇప్పటికే స్ర్టీమింగ్‌ అవుతున్న ఈ సినిమా పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులకు ఎన్నో విషయాల్లో ప్రత్యేకం. ముఖ్యంగా సిస్టర్‌ సెంటిమెంట్‌ కథకు ఎంతో కీలకం. మరెన్నో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పూర్తి ఎంటర్‌ టైనర్‌గా ‘వీర మాస్‌ బ్లాక్‌ బస్టర్‌’గా ‘‘వీరసింహా రెడ్డి’ ఓటీటీలోనూ అదరగొడుతోంది. మిస్‌ అవ్వకండి! (shruthi haasan)

'వీర సింహారెడ్డి' ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: http://bit.ly/3XXgFW7

1.jpg

Updated Date - 2023-02-24T12:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising