Rana Naidu: వెబ్‌సిరీస్ కోసం భారీ పారితోషికం తీసుకున్న బాబాయ్, అబ్బాయ్!

ABN, First Publish Date - 2023-02-17T18:51:04+05:30

వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) తండ్రి కొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). అమెరికన్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ తెరకెక్కింది.

Rana Naidu: వెబ్‌సిరీస్ కోసం భారీ పారితోషికం తీసుకున్న బాబాయ్, అబ్బాయ్!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) తండ్రి కొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). అమెరికన్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ తెరకెక్కింది. ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడిన తరుణంలో ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో షికార్లు కొడుతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు వెంకటేష్, రానా భారీ పారితోషికాలు తీసుకున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

‘రానా నాయుడు’ లో వెంకటేష్ నాగ పాత్రలో కనిపించారు. ఈ పాత్రను చేసేందుకు వెంకీ దాదాపుగా రూ.10కోట్లను రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని ఫిల్మ్ నగర్‌లో వదంతులు షికార్లు కొడుతున్నాయి. రానా కూడా రూ.8కోట్లను పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది. సాధారణంగా వెంకటేష్ ఒక్కో సినిమాను చేయడానికి ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంటారు. రానా దగ్గుబాటి డేట్స్‌ను ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. కానీ, ఈ వెబ్‌సిరీస్ చేయడానికి మాత్రం వారు రెండింతల పారితోషికం తీసుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. ‘రానా నాయుడు’ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఈ షో ట్రైలర్ ఈ మధ్యనే విడుదలైంది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెట్టింట టాపలో ట్రెండ్ అవుతుంది. ఈ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-02-17T18:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising