ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నవ్వుతూనే ఈ పిల్లాడు చెప్పిన మాటలు విని కన్నీళ్లు రావడం ఖాయం.. కారులో కూర్చున్న ఓ యువతి మనసు కరిగిపోయి..!

ABN, First Publish Date - 2023-10-31T21:20:34+05:30

పేదరికం కారణంగా చదువుసంధ్యలకు దూరమై కుటుంబభారాన్ని భుజానవేసుకున్న ఓ కుర్రాడి వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: చిన్నతనం ఆటపాటలు, చదువుసంధ్యలతో గడిచిపోతుందని అనుకుంటాం కానీ ఈ అదృష్టం అందరికీ ఉండదు. ఇప్పటికీ ఎంతో మంది చిన్నారులు పేదరికంతో సతమతమవుతూ అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. చిన్నతనంలోనే కుటుంబభారాన్ని మోసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి ఓ చిన్నారి వీడియో నెట్టింట వైరల్‌గా(Viral) మారింది.


ఓ కారులోని మహిళ వద్ద భిక్షాటనకు వచ్చిన ఓ పిల్లాడి వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. అప్పుడప్పుడూ నవ్వుతూ, కడుపులొంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ ఆ పిల్లాడు చెప్పినవి విని కారులోని మహిళ మనసు కూడా వేదనతో నిండిపోయింది. తొలుత అతడు ఎదురుపడగానే నువ్వు చదువుకోవా అని అతడిని ప్రశ్నించింది. కుటుంబభారం అధికంగా ఉందని, చదువుకు తగినంత సమయం లేదని అతడు తేల్చి చెప్పాడు. ఇంట్లో తనకో తమ్ముడు ఉన్నాడని అన్నాడు. తనకు అర్జెంటుగా ఓ పది కేజీల గోధుమ పిండి కావాలని చెప్పాడు. ఇదంతా చెబుతున్నప్పుడు అతడి ముఖంలో ఆవేదన తెరలాగా వచ్చి వెళ్లడం ఆమె దృష్టి దాటిపోలేదు(Video of a kid begging for wheat to support his family goes viral).


దీంతో, అతడి బాధను అర్థం చేసుకున్న మహిళ కుర్రాడిని సూపర్ మార్కెట్ తీసుకుని వెళ్లి అతడికి కావాల్సిన సమాన్లను కొనిచ్చింది. ఈ వీడియో జనాలను కలిచివేస్తోంది. పిల్లాడి కష్టం చూసి అనేక బాధపడ్డారు. దేశంలో ఓవైపు అపరకుబేరులు సంఖ్య నానాటికీ పెరుగుతుంటే మరోవైపు తిండికి కూడా నోచుకోని అభాగ్యులు ఉంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Updated Date - 2023-10-31T21:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising