Viral: ఈ సింహానికి ఏమైంది? నడిరోడ్డు మీద ఊహించని విధంగా.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు!
ABN, First Publish Date - 2023-11-04T18:17:25+05:30
ఏకంగా వారం రోజుల పాటు జిరాఫ్ మాంసం తిన్న ఓ సింహం పరిస్థితి తలకిందులైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అడవుల్లో సంచరించే సింహాలకు టైంకు ఆహారం దొరకదు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి ఖాళీ కడుపుతోనే వేటాడాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం కడుపు నిండా తిండి దొరుకుతుంది. ఇక ఏనుగు పిల్ల, జిరాఫీ లాంటి పెద్ద జీవాలు దొరికాయంటే వాటికి పండగ వచ్చినట్టే. తనకన్నా పెద్ద జంతువును మింగాక కొండచిలువ చాలా సేపు కదలకుండా పడుకుండి పోవడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో సింహానికి కూడా అదే పరిస్థితి వచ్చి పడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆఫ్రికాలోని కజరంగా నేషనల్ పార్క్‌లో వెలుగు చూసిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలోని ఓ సింహం అంతకుముందే పెద్ద జిరాఫీని తిందట(Giraffe meat for 7 days). మరి ఎంత తిందో ఏమో తెలీదు కానీ కడుపు నిండా ఆహారంతో కదలలేక నడి రోడ్డు మీదే పడుకుంది. పొట్ట ఉబ్బరం తట్టుకోలేనట్టు కాళ్లు గాల్లో ఎత్తిపట్టి అలాగే ఉండిపోయింది. చుట్టుపక్కల వాహనాల గోల ఎక్కువవుతున్నా కూడా అది పట్టించుకునే స్థితిలో లేదు. ఇలా చలనం లేకుండా పడి ఉన్న సింహాన్ని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు(Lion lying in the middle of the road motionless shocks netizens).
Hacking: మీ స్మార్ట్ ఫోన్ హ్యాకైందని డౌటా? ఇలా చేస్తే కేవలం 30 సెకెన్లలోనే..
సింహానికి కూడా మనుషుల గతే పట్టిందంటూ కొందరు కామెంట్ చేశారు. అది గత వారం రోజులుగా జిరాఫీ మాంసాన్నే తింటూ అరగక ఇబ్బంది పడుతోందని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో వైరల్‌గా(Viral Video) మారింది.
వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - 2023-11-04T18:25:12+05:30 IST