ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral video: ఇదేందయ్యా..ఇదీ..పెళ్లైన మరుక్షణమే ఈ నవదంపతులు ఊహించని విధంగా..

ABN, Publish Date - Dec 15 , 2023 | 02:55 PM

పెళ్లైన వెంటనే నవదంపతులు చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట్లో తరచూ పెళ్లి వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లి వేడుక సందర్భంగా వధూవరుల డ్యాన్స్ వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే, ఇటీవల ఓ జంట పెళ్లిమంటపంలో రెచ్చిపోయారు. వారి సంబరం, స్పీడు చూసి పెళ్లికి వచ్చిన అతిథులు, స్నేహితులు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో (viral video) నెటిజన్లనూ అమితంగా ఆకట్టుకుంటోంది.


వాస్తవానికి పెళ్లంటే రెండు జీవితాలను ముడిపెట్టే గొప్ప క్రతవు. వివాహ బంధానికి ఆధ్యా్త్మిక సామాజిక ప్రాముఖ్యతలు అన్ని సంస్కృతుల్లోనూ ఉన్నాయి. ఇక జీవితంలో ఓ తోడు దొరికనందుకు వధూవరుల్లోనూ సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే, మనం చెప్పుకుంటున్న వీడియోలోని జంటలో మాత్రం ఈ ఆనందం కట్టలు తెంచుకుంది. పెళ్లవ్వగానే ఆ జంట అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు (Newly wed couple dance). సినిమాల్లో హీరోహీరోయిన్లు డ్యూయెట్లు పాడుకున్న రేంజ్‌లో నృత్యం చేశారు.


పెళ్లిలో వధూవరులు డ్యాన్స్ చేయడం కామనే కానీ ఈ జంట నృత్యం చూసి అక్కడున్న వారందరూ ఒకింత షాకైయ్యారు. మరి కొందరు ఈలలు వేస్తూ వారిని ప్రోత్సహించారు. నెట్టింట్లో కూడా ఈ వీడియో వైరల్‌గా మారింది. వధూవరుల సంబరం ఆకాశాన్నంటిందంటూ పలువురు కామెంట్ చేశారు. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది.

Updated Date - Dec 15 , 2023 | 03:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising