ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake on Fan: సీలింగ్ ఫ్యాన్‌పై పాము.. స్పీడ్‌గా తిరుగుతున్న రెక్కల్ని దాటేందుకు విశ్వ ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందో చూస్తే..!

ABN, First Publish Date - 2023-06-15T21:53:06+05:30

తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాను నుంచి కిందకు దిగేందుకు ఓ పాము నానా ఇబ్బందీ పడింది. ధైర్యం చేసి కిందకు దిగే ప్రయత్నించగా ఫ్యాను రెక్క తగిలి దూరానికి ఎగిరెళ్లి పడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలం అన్ని జీవాలకు కష్టకాలమే. ఈ టైంలో కాస్తంత నీడమాటున సేదతీరితే బాగుండని ప్రతి ప్రాణి అనుకుంటుంది. కానీ, జనారణ్యాలు పెరిగిపోతున్న నేటి తరుణంలో ఇతర జంతువులు ఎండాకాలంలో ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. చివరకు అనూహ్య ప్రమాదాల్లో పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఎండవేడి తట్టుకోలేక ఓ పాము ఇంట్లోకి వెళ్లింది. ఆ తరువాత టాపుకు ఉన్న ఫాల్స్ సీలింగ్‌లో వెళ్లి దాక్కుంది. ఇంతలో ఫ్యాను తిరగడం మొదలైంది. అయితే, బయటకు ఎలా వెళ్లాలో తెలీక పాము ఫ్యాను రాడ్డుపట్టుకుని కిందకు దిగే ప్రయత్నం చేసింది(Snake On Fan). కానీ తిరగుతున్న ఫ్యాను రెక్కలు అడ్డు రావడంతో దానికి ఎటువెళ్లాలో పాలు పోలేదు. అన్ని దిక్కుల్లో ప్రయత్నించింది. తలను కొద్దిగా కిందకు దించిన ప్రతిసారి ఫ్యాను రెక్క తగిలింది. మరి ఏమనుకుందో ఏమో కానీ ఆ పాము చివరకు ధైర్యం చేసి పూర్తిగా కిందకు తల దించడంతో ఫ్యాను రెక్కలు తగిలి వీడియో తీస్తున్న వ్యక్తిపై పడింది.

వీడియో చూసిన నెటిజన్లు పాము పరిస్థితిపై జాలి పడుతున్నారు. అలా వీడియో తీసే బదులు ఫ్యాను ఆఫ్ చేస్తే పాముకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అంటూ వీడియో తీసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-15T21:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising