ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పాములకు కూడా ఇంతలా దాహం వేస్తుందా? గ్లాసులో తల పెట్టి మరీ ఆ పాము నీళ్లు ఎలా తాగిందో చూడండి..

ABN, First Publish Date - 2023-03-26T16:18:14+05:30

ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణి మనుగడకూ ప్రకృతి నుంచి లభించే గాలి, నీరు, ఆహారం ఎంతో అవసరం. ఇవి లేకుండా ఏ జీవీ ఎక్కువ కాలం జీవించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణి మనుగడకూ ప్రకృతి నుంచి లభించే గాలి, నీరు, ఆహారం ఎంతో అవసరం. ఇవి లేకుండా ఏ జీవీ ఎక్కువ కాలం జీవించలేదు. ఇతర జంతుజాలంలో పాములు (Snakes) నీళ్లు తాగడం ఎవరూ చూసుండరు. ప్రతి ఇతర జీవిలాగే, పాములకు కూడా దాహం వేస్తుంది. అయితే, పాము నీరు తాగడం అనేది సాధారణంగా ఎప్పుడూ మన దృష్టిలో పడదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో (Viral Videos) చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు (Snake Videos).

Harrison Onuoha అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని పాము ప్లాస్టిక్ గ్లాసులో తల పెట్టేసి మొత్తం నీటిని వేగంగా తాగేసింది (Thirsty snake drinks water ). గ్లాసు మొత్తాన్ని ఖాళీ చేసింది. ఆ వీడియోను షేర్ చేసిన యూజర్.. ``పాము ఎలా నీటిని తాగుతుందో చూశారా? మనుషుల్లాగానే వాటికీ దాహం వేస్తే నీళ్లు తాగుతాయ``ని పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంది.

Snake bite: పాము కాటేసినా పరీక్ష రాస్తానని పట్టుబట్టిన బాలిక.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ఈ వీడియోను ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు.. పాము నీరు తాగడాన్ని మొదటిసారి చూశామని చెప్పారు. ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-03-26T16:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising