Homemade Washing Machine: వాషింగ్ మెషీన్ కొనడానికి డబ్బుల్లేక.. ఓ డ్రమ్ముతో ఎలా తయారు చేశాడో చూస్తే..!
ABN, First Publish Date - 2023-11-20T22:05:23+05:30
ఓ నీళ్ల డ్రమ్ము, ఎలక్ట్రిక్ మోటార్‌తో తయారు చేసిన వాషింగ్ మెషీన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అవసరమే ఆవిష్కరణలకు జీవం పోస్తుందనేది పాశ్చాత్య సామెత. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి జనాలు సరిగ్గా ఇదే కామెంట్ చేస్తున్నారు. వాషింగ్ మెషీన్ కొనుక్కునేందుకు డబ్బుల్లేకపోవడంతో ఓ వ్యక్తి సొంతంగా వాషింగ్ మెషీన్(Home made Washing machine) డిజైన్ చేసిన తీరు నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. ఇంట్లో నిత్యం కనిపించే వస్తువులతో అతడు చేసి అద్భుతం చూసి జనాలు షాకైపోతున్నారు.
Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..
వీడియోలోని వ్యక్తి ఏకంగా డ్రమ్ము, మోటార్ సాయంతో వాషింగ్ మెషీన్ తయారుచేసి చూపించాడు. ఓ పెద్ద డ్రమ్ముకు చిల్లులు పెట్టి, వాటితో డ్రమ్మును మోటార్‌కు కనెక్ట్ చేశాడు. డ్రమ్ములోపల వేసిన బట్టలను తిప్పేందుకు వీలుగా ఓ చక్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. డ్రమ్ములో నీళ్లు పోసి, వాషింగ్ పౌడర్, దుస్తులు వేసి మోటార్ ఆన్ చేశాడు. అంతే..ఈ హోం మేడ్ వాషింగ్ మెషీన్ చకచకా పని ప్రారంభించేసింది. పేరుకు అది ప్లాస్టిక్ డ్రమ్మే అయినప్పటికీ ఎక్కడా నీళ్లు లీకు కాకుండా అతడు దానికి మోటార్ అనుసంధానం చేసిన విధానం జనాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది(Washing machine made from drum and motor).
ఇక ఈ వీడియో నెట్టింట ఎంతగా వైరల్ అవుతోందో మాటల్లో వర్ణించడం అసాధ్యం. వీడియోలోని వ్యక్తి ఐడియాకు జనాలు ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది 150+ లీటర్ల వాషింగ్ మెషీన్ అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం దీన్ని వాడితే కరెంట్ బిల్లు పదివేలు దాటిపోతుందని హెచ్చరించారు. ఇందులో దుప్పట్లు బాగా ఉతకొచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. భారతీయులకు టాలెంట్ తక్కువేం లేదంటూ అధిగశాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల అభిప్రాయాల మధ్య వీడియో వైరల్‌గా మారింది.
Updated Date - 2023-11-20T22:05:27+05:30 IST